
వెయ్యేళ్ల తెలుగు వెలుగు ఎన్టీఆర్ : నందమూరి బాలకృష్ణ
- Ap political StoryNewsPolitics
- April 29, 2023
- No Comment
- 39
వందేళ్ల క్రితం ఓ వెలుగు పుట్టింది. ఆ వెలుగు మరో వెయ్యేళ్లు వెలుగుతుంది. తెలుగు వెలుగు ఎన్టీఆర్. నటనకు జీవం పోసిన నటధీరశాలి ఎన్టీఆర్. ఎన్టీఆర్ అసమాన నటుడు. ఎన్టీఆర్ పౌరాణిక పాత్రలకు ప్రాణం పోశారు. ఎన్టీఆర్ పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేసేవారు. సినీ రంగంలోనే కాకుండా రాజకీయాల్లో రాణించారు.
ఎన్టీఆర్ రాజకీయ చైతన్యాన్ని తీసుకువచ్చారు. ఎన్నో సాహసోపేత పథకాలను ఎన్టీఆర్ ప్రవేశపెట్టారు. ఎన్టీఆర్ ప్రసంగాల పుస్తకావిష్కరణ కార్యక్రమం ఎన్టీఆర్ సొంత జిల్లాలో జరపడం సంతోషంగా ఉంది. ఎన్టీఆర్ తనయుడిగా నేను పుట్టడం పూర్వజన్మ సుకృతం.
ఎన్టీఆర్ లాంటి నటుడు ప్రపంచంలో ఎక్కడా వెతికినా కనిపించరు. నేను తెలుగువాడినని గర్వంగా చెప్పుకునేలా చేసింది ఎన్టీఆర్. రాజకీయాలంటే ఏంటో తెలియని వాళ్లకు కూడా రాజకయ చైతన్యం కల్పించారు ఎన్టీఆర్. ప్రజల వద్దకే ప్రభుత్వాన్ని, పాలనను తీసుకెళ్లిన మహానాభావుడు ఎన్టీఆర్.