బాల్లయ్య యాక్షన్  సీన్స్ తో పూనకాలే.. !

బాల్లయ్య యాక్షన్ సీన్స్ తో పూనకాలే.. !

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నటసింహ బాలకృష్ణ కథానాయకుడిగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో 108 వ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోన్న సంగతి తెలిసిందే. బాలయ్య మాస్ ఇమేజ్ కి ఏమాత్రం తగ్గకుండా అనీల్ మార్క్ ఎంటర్ టైనర్ గా మలుస్తున్నారు. ఇద్దరు సక్సెస్ జోరులో ఉండటంతో మరో హిట్ ఖాయమంటూ అంచనాలు పెరిగిపోతున్నాయి. మార్కెట్ పరంగా బాలయ్య ఇమేజ్ రెట్టింపు అయింది.

యువ హీరోలకు బాలయ్య ఏమాత్రం తక్కువ కాదని నిరూపిస్తున్నారు. బాలయ్య సైతం కథల పరంగా మరింత జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్తున్నారు. ఈ కోవలోనే అనీల్ లాంటి యువ మేకర్ తోనూ సై అనడం జరిగింది. ప్రస్తుతం షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. దీనిలో భాగంగా బాలయ్యపై యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఫైట్ మాస్టర్ వెంకట్ కంపోసింగ్ లో చిత్రీకరిస్తు న్నారు.

ఈ యాక్షన్ ఎపిపోడ్ సినిమాకి చాల ఇంపార్టెంట్ అని . ప్రతి సీన్ లో బాలయ్యని కొత్తగానూ ప్రజెంట్ చేస్తున్నారట . బాలయ్య గత ఫైట్స్ కి భిన్నంగా ఈ ఫైట్ స్పీక్వన్స్ ఉంటుందని..ఆద్యంతం ఆసక్తికరంగా తీర్చి దిద్దుతాన్నామని చిత్రబృందం చెప్తున్నారు .

బాలయ్య యాక్షన్ ఎపిసోడ్లు అన్న డైలాగ్స్ అన్న పీక్స్ లో ఉంటాయి. థియేటర్లు ఈలలకు..కేకలతో దద్దరిల్లిపోతాయి. ఇప్పుడేకంగా 2 వీక్స్ బారి యాక్షన్ సీన్ చిత్రీకరిస్తున్నారు? అంటే ఇంకే రేంజ్ లో ఉంటుందో ఊహించాల్సిన పనిలేదు.

బాలయ్య అభిమానులకు ఇది పూనకాలు తెప్పించే వార్తే అనొచ్చు.దీన్ని బట్టి బాలయ్య ఇమేజ్ కి తగ్గట్టు ఓ శక్తివంతమైన మాస్ యాక్షన్ కథాంశంతో తెరకెక్కు తోన్న చిత్రమని క్లారిటీ వస్తోంది. అన్ని పనులు పూర్తిచేసి దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *