భగవంత్ కేసరిగా బాలయ్య..గూస్ బంప్స్

భగవంత్ కేసరిగా బాలయ్య..గూస్ బంప్స్

బాలయ్య బర్త్ డే కానుకగా అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చాడు. తన అప్ కమింగ్ మూవీకి టైటిల్ ఫిక్స్ అయ్యింది. nbk108 మూవీకి భగవంత్ కేసరి అనే పేరు పెట్టారు. ఐ డోంట్ కేర్ అనే ట్యాగ్ లైన్ కూడా ఫిక్స్ చేశారు. తాజాగా టైటిల్ పోస్టర్ రివీల్ చేశారు. వైబ్రేషన్ తో కూడిన బాలయ్య మూవీ టైటిల్, అభిమానులకు మంచి కిక్కు ఇస్తోంది. ఈ పోస్టర్ లో సరికొత్త ఆయుధంతో దర్శనమిచ్చాడు బాలకృష్ణ. అనీల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి.

టాలీవుడ్ లో కొత్తకొత్త ఆయుధాలు సృష్టించాలంటే రాజమౌళి, బోయపాటి తర్వాతే ఎవరైనా. బాలయ్య మూలంగా ఇప్పుడా లిస్ట్ లోకి అనీల్ రావిపూడి చేరినట్టు కనిపిస్తోంది. బాలయ్య చేతిలో ఉన్న ఆయుధం చూడ్డానికి చాలా వెరైటీగా ఉంది. ఇక టైటిల్ పోస్టర్ చూస్తుంటే.. అందులో మనదేశ జాతీయ చిహ్నం కనిపిస్తుంది. బాలయ్య డ్రెస్సింగ్ స్టైల్ పూర్తిగా భిన్నంగా ఉంది. బ్రౌన్ కలర్ చొక్కా.. ఫార్మల్ ప్యాంటు ధరించి మెడలో కండువా ఉంది. ఇక బాలయ్య చేతికి బ్రాస్లెట్ గడియారాన్ని గమనించవచ్చు. ఇక ఈ పోస్టర్ లో బాలయ్య ఒక ఆయుధాన్ని పట్టుకుని ఉన్నాడు.

కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల కీలక పాత్రలో కనిపించనుంది. సాహు గారపాటి హరీశ్ పెద్ది బాలకృష్ణ 108వ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షైన్ స్క్రీన్ పతాకంపై వస్తోంది. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *