
రజనీ కథకు హీరోగా బాలయ్య
- EntertainmentMoviesNews
- June 6, 2023
- No Comment
- 24
ఆహాతో అన్‌స్టాపబుల్‌గా బాలయ్య మారిపోయాడు. సినిమాల్లో గర్జించిన నటసింహ బుల్లి తెరపై కూడా అన్‌స్టాపబుల్‌తో అందరికి ఆప్తుడయ్యాడు. బాక్సాఫీస్ దగ్గర కూడా అఖండ విజయాలు అందుకుంటున్నాడు. వీర సింహరెడ్డితో 100 కోట్లు కొట్టాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న బాలయ్య అనిల్ రావిపూడితో 108 మూవీ చేస్తున్నాడు. ఈ మూవీలో శ్రీలీల బాలయ్యకు కూతురుగా నటిస్తుంది. అనిల్‌తో సినిమా చేస్తూనే మరో సినిమాకు సిగ్నల్ ఇచ్చాడు.
వాల్తేర్ వీరయ్యతో సంక్రాంతికి సక్సెస్ కొట్టిన బాబీ సూపర్ స్టార్ రజనీకాంత్‌ని డైరెక్ట్ చేయడానికి కథని రెడీ చేసుకున్నాడు. ఆ స్టోరీని రజనీకు నరేట్ చేస్తాడట సీతారా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో సినిమాకు సకలం సిద్ధం చేసుకున్నాటు. కానీ సూపర్‌స్టార్‌కు ఆ కథ అంతా కనెక్ట్ అవ్వలేదట. ఇప్పుడు అదే కథను బాలయ్యకు వినిపిస్తే సింగిల్ సిట్టింగ్‌లోనే సినిమాకు సిగ్నల్ ఇచ్చాడట బాలయ్య. ఇది పవర్‌పుల్ యాక్షన్‌తో పాటు మేసేజ్ ఓరియాంటేడ్ మూవీ అని బాబీ చెప్పినట్లు ఫిల్మ్‌నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ మూవీకి సంబంధించి అఫిషియాల్‌గా నటసింహం బర్తేడే గిఫ్ట్‌గా జూన్ 10 అనౌన్స్ చేస్తాడట నిర్మాత నాగా వంశీ. సూపర్‌స్టార్ కోసం రాసుకున్న ఎలివేషన్స్‌ని బాలయ్య కోసం మార్పులు చేస్తున్నాడట డైరెక్టర్ బాబీ. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్‌గా మారిపోయింది.