సల్మాన్ ఖాన్ మూవీలో… బతుకమ్మ పాట

సల్మాన్ ఖాన్ మూవీలో… బతుకమ్మ పాట

తెలంగాణ యాస, సంస్కృతీ, సంప్రదాయాలు ప్రతిబింబించే సినిమాలు ఎన్నో ఉన్నాయి. కానీ.. బాలీవుడ్ లో ఫస్ట్ టైమ్ .. తెలంగాణ బతుకమ్మ పాటకు చోటు దక్కింది. ఉత్తరాది ప్రేక్షకులకు.. మొదటిసారిగా.. బతుకమ్మ విశిష్టత గురించి తెలియజేస్తూ.. ఏకంగా ఓ పాటను జోడించి చిత్రీకరించారు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న కిసీ కా భాయ్‌ కిసీ కి జాన్‌ చిత్రంలో బతుకమ్మ పాటను తెరకెక్కించారు. ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ఈ చిత్రంలో తెలంగాణ నేపథ్యం ఉండటంతో.. మొట్టమొదటిసారిగా బాలీవుడ్ ప్రేక్షకులను బతుకమ్మ సాంగ్ ను పరిచయం చేస్తున్నారు. తెలంగాణ నేటివిటీతో.. ప్రధాన ఆకర్షణగా ఉండే ఈ పాటను భారీ స్థాయిలో చిత్రీకరించారు. ఒక బాలీవుడ్‌ సినిమాలో.. తెలంగాణ బతుకమ్మ పాటను రూపొందించడం ఇదే తొలిసారి. ఈ బాలీవుడ్ చిత్రంలో విక్టరీ వెంకటేష్‌, పూజా హెగ్డే, భూమిక కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఈ చిత్రం నుంచి బతుకమ్మ తెలుగు పాటను విడుదల చేశారు.

సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కిసీకీ భాయ్ కిసీకీ జాన్’.. తమిళ బ్లాక్ బస్టర్ వీరమ్ ఆధారంగా హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటూ విడుదలకు సిద్ధమైంది. తాజాగా మూవీ మేకర్స్.. ఈ సినిమా నుంచి.. ముంగింట్లో ముగ్గెట్టి గొబ్బిల్లే పెట్టుదామా.. అంటూ సాగే.. తెలంగాణ బతుకమ్మ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటను ‘కె.జి.యఫ్’ ఫేమ్ రవి బస్రూర్‌ స్వరకల్పనలో కిన్నల్‌ రాజ్‌, హరిణి ఇవటూరి సాహిత్యాన్ని అందించగా..సంతోష్‌ వెంకీ పాడారు. ఫర్హాద్‌ సమ్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా .. త్వరలోనే విడుదల కాబోతున్నది. ఈ సినిమాలో బతుకమ్మ.. పాట పెడితే బావుంటుందని సల్మాన్ ఖాన్ కు వెంకటేష్ సలహా ఇచ్చారట. దీంతో సల్మాన్ ఖాన్ కోరిక మేరకు.. దర్శక, నిర్మాతలు.. బతుకమ్మ సాంగ్ ను ప్రత్యేకంగా .. భారీగా ఖర్చు పెట్టి.. చిత్రీకరించారు.

కిసీకీ భాయ్ కిసీకీ జాన్.. చిత్రంలోని బతుకమ్మ సాంగ్ లో .. నటి పూజా హెగ్డే డ్యాన్స్ అందరినీ ఆకట్టుకునేలా చాలా అందంగా ఉంది. పాటలో తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా పూజా హెగ్డే.. చక్కగా డాన్స్ చేశారు. పూజా హెగ్డే బతుకమ్మ ఎత్తుకుని సందడిగా వెళుతున్న దృశ్యాలు కూడా .. సాంగ్ లో కలర్ ఫుల్ గా వున్నాయి. ఈ పాటలో.. విక్టరీ వెంకటేష్, భూమిక, సల్మాన్ ఖాన్ కూడా కనిపిస్తారు. ఈ బతుకమ్మ సాంగ్ ఆద్యంతం.. అందరికీ ఆకట్టుకునే రీతిలో సాగింది. వెంకటేష్ భార్య పాత్రలో భూమిక నటించారు. హీరోయిన్ పూజా హెగ్డేను హైదరాబాదీ అమ్మాయిగా చూపించారు. చాలా సంవత్సరాల తర్వాత.. హిందీ చిత్రం అనారి తరువాత వెంకటేష్ నటిస్తున్న బాలీవుడ్ మూవీ కావడంతో తెలుగు వారికి కూడా ఈ సినిమా మీద ప్రత్యేక ఆసక్తి పెరిగింది. ఈ సాంగ్ లో సింహ భాగం తెలుగు లిరిక్స్ ఉండగా.. అక్కడక్కడా.. కొన్ని హిందీ పదాలను చేర్చారు.

తెలంగాణ సాంప్రదాయాలను.. ఒక హిందీ సినిమాలో.. తెలుగు సాంగ్ ద్వారా ప్రమోట్ చేయడం చాలా గొప్ప విశేషం. ఈ విషయంలో బాలీవుడ్ దర్శక నిర్మాతలను అభినందించాలి. సల్మాన్‌ ఖాన్‌ సినిమాలో బతుకమ్మ పాటను చిత్రీకరించడంపై ఎమ్మెల్సీ కవిత హర్షం వ్యక్తం చేశారు. ఇప్పుడు బతుకమ్మ క్రేజ్‌ పాన్‌ ఇండియాకు చేరిందని ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. ఒక హిందీ చిత్రంలో.. బతుకమ్మ పాటను తీసుకోవడం.. తెలంగాణ ప్రజలకు గర్వకారణమని కవిత అన్నారు. ఈ మూవీకి ఏకంగా ఏడుగురు సంగీత దర్శకులు పని చేయగా .. బతుకమ్మ పాటను కేజీఎఫ్ కంపోజర్ రవి బస్రూర్ కంపోజ్ చేశారు. సల్మాన్ ఖాన్ హీరోగా నటించే ఈ సినిమాలో.. ప్రముఖ నటుడు జగపతిబాబుతో పాటు భాగ్యశ్రీ, మాలవిక శర్మ, అభిమన్యు సింగ్ వంటి వారు ఇతర కీలకపాత్రలలో నటిస్తున్నారు.

Related post

శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయకుని క్షేత్రం

శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయకుని క్షేత్రం

హిందువులకు అత్యంత ముఖ్యమైన ఆరాధ్య దైవం విఘ్నేశ్వరుడు. సకల శుభంకరుడు.. సకల గణాలకు నాయకుడు గణేశుడు. అంతే కాదు.. లయకారుకుడైన ఆదిశంకరుడు, జగన్మాతల ముద్దుబిడ్డ వినాయకుడు. శివుని ఆదేశాలతో…
పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

టీడీపీ ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంది. కానీ, వాటన్నంటినీ ఎదుర్కొని పార్టీని సమర్థవంతంగా ముందుండి నడిపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. కానీ, ఇప్పుడు ఆయనకే కష్టం వచ్చింది. అక్రమ అరెస్ట్…
ఫొటోస్ : పూజ హెగ్డే గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : పూజ హెగ్డే గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : పూజ హెగ్డే గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *