బిగ్ ట్విస్ట్.. అవినాష్ అరెస్ట్ ను దాచిపెట్టిన సీబీఐ

బిగ్ ట్విస్ట్.. అవినాష్ అరెస్ట్ ను దాచిపెట్టిన సీబీఐ

వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ అరెస్ట్? విడుదల జరిగిపోయిందా? ఈ విషయాన్ని సీబీఐ, అవినాష్ అత్యంత గోప్యంగా ఉంచడంలో ఉద్దేశ్యమేంటి? ఈ దాగుడు మూతల ఆటలు ఎందుకు? వివేకా కేసులో నాటకీయ పరిణామాలు, అనూహ్య మలుపులు, కొత్త ట్విస్ట్ లు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో నిందితుడిగా ఉన్న కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని జూన్ 3నవిచారణ సందర్భంగా అరెస్ట్ చేయడం, ఆ వెంటనే విడుదల జరిగిపోయాయట. ఈ విషయాన్ని సీబీఐ దాచిపెట్టి బిగ్ ట్విస్ట్ ఇచ్చింది.

మే 31న హైకోర్టు ముంద‌స్తు బెయిల్ ఆదేశాల మేర‌కు… రూ.5 లక్షల పూచీక‌త్తుపై అవినాశ్ రెడ్డిని సీబీఐ విడుద‌ల చేసిన‌ట్లు తెలిసింది. ఆ తర్వాత అవినాశ్ని సీబీఐ ఏ8గా చేర్చడం గమనార్హం. ఇప్పటికే అరెస్ట్‌ చేసిన వైఎస్‌ భాస్కరరెడ్డిని 7వ నిందితుడిగా పేర్కొంది. వివేకా హత్య పథకాన్ని గంగిరెడ్డి, సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరిలు అమలు చేయగా.. సాక్ష్యాలను ధ్వంసం చేసి వివేకా గుండెపోటుతో మృతి చెందారని నమ్మించేందుకు… భాస్కరరెడ్డి, అవినాష్‌రెడ్డి, నిందితులు శివశంకర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డిలు కలిసి కుట్రను ముందుకు తీసుకెళ్లారని సీబీఐ కోర్టుకు నివేదించింది. అంతేకాదు, వివేకా మరణవార్తను ఆయన పీఏ చెప్పకముందే.. ఉదయం 6గంటల 15నిమిషాలకు ముందే సీఎం జగన్ కు తెలుసని సీబీఐ స్పష్టం చేసింది. దాంతో, తాడేపల్లి ప్యాలెస్ లో కలవరం మొదలైంది.

కుట్ర, సాక్ష్యాల చెరిపివేతలో అవినాశ్‌, భాస్కర్‌రెడ్డి ప్రమేయముందని.. ఇద్దరూ దర్యాప్తును పక్కదారి పట్టించారని సీబీఐ కోర్టుకు నివేదించింది. శివశంకర్రెడ్డి ఫోన్ చేసిన నిమిషంలోపే అవినాశ్‌ హత్యాస్థలికి చేరారు. ఉదయం 5గంటల20లకు ముందే అవినాశ్‌, శివశంకర్‌రెడ్డితో గంగిరెడ్డి మాట్లాడినట్లు దస్తగిరి వాంగ్మూలం ఇచ్చారు. కేసు, పోస్టుమార్టం వద్దని సీఐ శంకరయ్యకు అవినాశ్‌, శివశంకర్‌ చెప్పారు. సీబీఐకి, కోర్టుకు ఏమీ చెప్పొద్దని దస్తగిరిని ప్రలోభ పెట్టేందుకు అవినాశ్‌, భాస్కర్రెడ్డి, శివశంకర్‌ ప్రయత్నించారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో..భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డిలు కీలక పాత్రదారులని సీబీఐ తేల్చింది. అందుకే, బెయిల్ ఇస్తే, దర్యాప్తుకు విఘాతం కలుగుతోందనే ఆందోళన వ్యక్తం చేస్తోంది. విచారణలో భాస్కరరెడ్డి సహకరించలేదని, ఏప్రిల్‌ 16 నుంచి జైల్లో ఉన్నంత మాత్రాన ఆయనకు బెయిలు మంజూరు చేయాలనడం సరైంది కాదనే సంచలన విషయాలను సీబీఐ కోర్టుకు వివరించింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని భాస్కరరెడ్డి బెయిలు పిటిషన్‌ను కొట్టివేయాలని కోర్టును కోరింది.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *