నాలుగు రాష్ట్రాలకు బీజేపీ కొత్త ఇంఛార్జ్ లు

నాలుగు రాష్ట్రాలకు బీజేపీ కొత్త ఇంఛార్జ్ లు

అసెంబ్లీ ఎన్నికలున్న రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ, పార్టీలో సంస్థాగత మార్పులు చేపట్టింది. ఇప్పటికే తెలంగాణ, ఏపీ సహా పలు రాష్ట్రాలకు అధ్యక్షులను ప్రకటించిన అధిష్టానం… తాజాగా తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల ఇన్‌చార్జ్‌లను నియమించింది. తెలంగాణ ఎన్నికల ఇన్‌చార్జిగా ప్రకాష్ జవదేకర్‌ నియమితులయ్యారు. రాజస్థాన్ ఎన్నికల ఇంఛార్జ్ గా బాధ్యతలను ప్రహ్లాద్ జోషికి, ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ఇన్‌చార్జి బాధ్యతలను ఓం ప్రకాష్ మాధుర్‌కు అప్పగించింది. మధ్యప్రదేశ్ ఎన్నికల ఇన్‌చార్జిగా భూపేంద్ర యాదవ్‌ను నియమించింది.

తెలంగాణలో ప్రకాష్ జవదేకర్‌కు కో-ఇన్‌చార్జిగా సునీల్ బన్సాల్ వ్యవహరిస్తారు. రాజస్థాన్‌లో నితిన్ పటేల్, కుల్దీప్ బిష్ణోయ్ కో-ఎలక్షన్ ఇన్‌చార్జులుగా, ఛత్తీస్‌గఢ్‌కు డాక్టర్ మన్షుఖ్ మాండవీయ కో-ఇన్‌చార్జిగా వ్యవహరిస్తారు. మధ్యప్రదేశ్‌లో అశ్విన్ వైష్ణవ్ కో-ఇన్‌చార్జిగా ఉంటారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *