4 రాష్ట్రాల్లో గెలుపు కోసం బీజేపీ పాట్లు

4 రాష్ట్రాల్లో గెలుపు కోసం బీజేపీ పాట్లు

ప్రధాని మోదీ .. త్వరలో మళ్లీ ఒక అగ్ని పరీక్షను ఎదుర్కోనున్నారు. నాలుగేళ్లపాటు మోదీ పరిపాలనపై విమర్శలు తలెత్తినా.. బీజీపీ సీనియర్ నాయకత్వం.. అంతగా సీరియస్ గా తీసుకోలేదు. కాని.. రానున్న.. రాష్ట్రాల ఎన్నికల సమరంలో తప్పక గెలవాల్సి సమయం ఆసన్నమైంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన బీజేపీకి.. అసలైన ఛాలెంజ్ ఎదురు కాబోతుంది. నాలుగు రాష్ట్రాల్లో కనీసం రెండింటిలోనైనా గెలిచి.. సత్తా చూపకుంటే.. దేశ సార్వత్రిక ఎన్నికల్లో .. తమ పరిస్థితి ఏంటని.. బీజీపీ నాయకత్వంలో అంతర్మథనం మొదలైంది. అందుకే.. దేశ రాజకీయాలను సీరియస్ గా తీసుకుంటూ.. తన మార్క్. రాజకీయానికి .. బీజేపీ కసరత్తు మొదలు పెట్టింది.

దేశంలో .. గత 9 ఏళ్లుగా.. తమదైన మార్క్ చూపించి.. రాజకీయాలను బీజేపీ శాసిస్తోంది. అతి త్వరలో .. నాలుగు రాష్ట్రాలు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ గెలిచి తీరాల్సిన పరిస్థితి.. లేకుంటే .. తమ ప్రత్యర్థి పార్టీలైన.. కాంగ్రెస్, ఆప్, టీఎమ్ సీ, బీఆర్ఎస్ పార్టీలు ఆధిపత్యం సాధిస్తాయి. అందుకే.. సీరియస్ గా .. దేశ రాజకీయాలవైపు బీజేపీ దృష్టి సారించింది. అమెరికా, ఈజిప్ట్ పర్యటనలు ముగించుకుని వచ్చిన తరువాత .. ప్రధాని మోదీ దేశీయ వ్యవహారాలు, రాజకీయ వ్యవహారాలపై పూర్తి ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలోనే మోదీ తన ఇంట్లో పార్టీ ముఖ్యులతో భేటీ అయ్యారు. అమిత్ షా, జేపీ నడ్డా, బీఎల్ సంతోష్, రాజ్ నాథ్ సింగ్, నిర్మలా వంటి అతి కొద్ది మంది .. సీనియర్ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికలు జరగనున్న నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలం ఎలా ఉంది.. బలహీనంగా ఉన్న విషయాల్లో.. ఎలా పటిష్టం చేసుకోవాలన్న అంశాలపై నేతలు చర్చించారు.

2024 లోక్ సభ ఎన్నికల్లో గెలవాలంటే .. అంత ఆషామాషి కాదని.. కర్ణాటక ఎన్నికల ఫలితాల ద్వారా బీజేపీకి అర్థమైంది. అందుకే.. నాలుగు రాష్ట్రాల్లో .. సంస్థాగతమైన మార్పులు చేయడం,కేంద్ర కేబినెట్లో మార్పులు, చేర్పులు చేయడంపై .. బీజీపీ సీనియర్ నేతలు సీరియస్ గా చర్చించారని పార్టీ నేతులు అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో .. బీజేపీ బలోపేతంపైనా చర్చించినట్లు సమాచారం. తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నాయకత్వం, పనితీరుపై .. కొందరు నేరుగా విమర్శలు చేయడంతో.. కొంత పట్టు కోల్పోయే స్థితికి వచ్చింది. ఇంతవరకు తెలంగాణలో దూకుడు మీదున్న బీజీపీ.. కొంచెం వెనుకబడిందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ స్థానంలో.. కిషన్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించే అవకాశం ఉంది. రాష్ట్ర సారధ్య బాధ్యతలు తీసుకునే విషయంలో కిషన్ రెడ్డి వెనక్కి తగ్గినా.. రేసులో ఎవరున్నారనేది సస్సెన్స్ గా మారింది. తెలంగాణలో బీజేపీ వ్యూహం ఏంటనేది.. కొద్ది రోజుల్లోనే తేలనుంది.

రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలను .. కూడా .. గెలవాలన్నది ఇప్పుడు బీజేపీ టార్గెట్. మరోవైపు ఛత్తీస్ గఢ్ లో కూడా గెలిచే అవకాశాలపై.. బీజేపీ అధిష్టానం ఫుల్ గా ఫోకస్ పెట్టింది. ఛత్తీస్ గఢ్‌లో కాంగ్రెస్ బలంగా ఉండగా.. ఇక అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్‌లో వర్గ విభేదాలు, కాంగ్రెస్ కూడా బలం పుంజుకుంటున్నట్లు.. బీజేపీ అంచనా వేసింది. అందుకే.. గతంలో ఎన్నికల సందర్భంగా .. కర్ణాటక రాష్ట్రానికి ప్రకటించిన ఎన్నికల ప్యాకేజీల వంటివి.. ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లకు ఇచ్చేలా బీజీపీ వ్యూహం రచిస్తోంది. అవసరమైతే.. ఆయా రాష్ట్రాల నేతలకు.. కేంద్ర కేబినెట్ లో కూడా స్థానం కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

గత 20 ఏళ్లుగా .. ఆంధ్రప్రదేశ్ లో.. బీజేపీ ఉనికి చాటాలని యత్నించినా.. సాధ్యం కాలేదు. ప్రస్తుతం జగన్ పాలనపై.. అడపాదడపా.. బీజేపీ సీనియర్ నేతలు.. వచ్చి.. తప్పులను ఎత్తి చూపినా.. రాష్ట్ర నేతలు సీరియస్ గా లేరు. స్వయంగా అమిత్ షా, జేపీ నడ్డా.. ఏపీ ప్రభుత్వం, జగన్ పై తీవ్ర విమర్శలు చేసినా.. జీవీఎల్, సోము వీర్రాజు మాత్రం అసలేం పట్టించుకోలేదు. అందుకే.. ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జీవీఎల్ పై కేంద్ర నాయకత్వం.. ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. ఒకవేళ.. సీరియస్ గా .. ఏపీ రాజకీయాలపై .. బీజేపీ దృష్టి సారిస్తే మాత్రం.. తదనుగుణంగా.. తెలంగాణతో పాటు.. ఏపీలో రాష్ట్ర అధ్యక్షుడిని మార్చే అవకాశం ఉంది.

త్వరలో ఎన్నికలు జరగనున్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, తెలంగాణల్లో కనీసం రెండు రాష్ట్రాలలో గెలవాలని బీజేపీ ప్లాన్. నాలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో.. ఒక్కటే బీజేపీ పాలన ఉంది. 2024లో సార్వత్రిక ఎన్నికలు దృష్టిలో ఉంచుకుని.. రాజకీయ వ్యూహాలతో.. అస్త్రశస్త్రాలను సంధించి.. గెలిచేందుకు .. బీజేపీ విశ్వప్రయత్నాలు మొదలు పెట్టింది. నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. వచ్చే దేశ సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం చూపుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *