
తెలంగాణ బీజేపీ నేతల పాదయాత్ర
- NewsPoliticsTelangana Politics
- July 10, 2023
- No Comment
- 19
తెలంగాణలో తిరిగి గ్రాఫ్ ను పెంచుకునేందుకు బీజేపీ పాదయాత్రలకు శ్రీకారం చుడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు నుంచి పాదయాత్ర చేయాలని కమలనాథులు నిర్ణయించారు. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి , ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ఎంపీ బండి సంజయ్ పాదయాత్ర చేయనున్నారు. కిషన్ రెడ్డి.. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పాదయాత్ర చేపట్టనున్నారు.
ఇక, ఉమ్మడి కరీంనగర్, మెదక్, వరంగల్ జిల్లాల్లో ఈటల నడవనున్నారు. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో బండి పాదయాత్ర సాగనుంది. ఇప్పటికే బండి రాష్ట్రంలో ఐదు విడతలుగా ప్రజాసంగ్రామ యాత్ర చేశారు. ఎన్నికల వేళ… మరోసారి నేతలంతా కలిసి అన్ని జిల్లాలను చుట్టేయాలనే నిర్ణయానికి వచ్చారు.
ఇప్పటికే, కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాదయాత్ర చేశారు. భట్టివిక్రమార్క దాదాపు 30 నియోజకవర్గాల్లో వెయ్యి కిలోమీటర్లకు పైగా నడిచారు. అటు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల కూడా సుదీర్ఘ పాదయాత్ర చేశారు. మరోసారి ఆమె తన ప్రజాప్రస్థానం యాత్ర ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.