
ఏపీలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా.. టీడీపీదే విజయం
- Ap political StoryNewsPolitics
- April 4, 2023
- No Comment
- 25
రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా .. టీడీపీ సిద్ధంగా ఉందని.. పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. టీడీపీపై మాట్లాడేముందు, పేర్నినాని వచ్చేఎన్నికల్లో ఎందుకు పోటీచేయనంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. 175 నియోజకవర్గాల్లో వైసీపీ తరపున బరిలో నిలిచే అభ్యర్థులే లేరు.. అందుకే పదే పదే సమావేశాలు పెట్టుకుని.. అభ్యర్థులను బతిమిలాడుకునే స్థితిలో వైసీపీ ఉందనని బోండా ఉమా విమర్శించారు. 175 సీట్లలో పోటీ చేసే అభ్యర్థులను.. చెప్పుకునే దమ్ము, ధైర్యం జగన్, పేర్నినానికి ఉన్నాయా? అని బోండా ప్రశ్నించారు.
వైసీపీ నేత పేర్నినానికి డిపాజిట్లు రావని గతంలోనే చెప్పానని.. కొడాలి నానికి దమ్ముంటే ప్రజాక్షేత్రంలో టీడీపీతో తేల్చుకోవాలని బోండా ఉమ సవాల్ చేశారు. వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు దక్కవన్న భయంతోనే పేర్నినాని, ధర్మాన , చెవిరెడ్డి లాంటి వాళ్లు పోటీ చేయమంటున్నారని.. 87 శాతం హామీల అమలు జరిగిందనేది బోగస్ అని బోండా ఉమా అన్నారు. డ్వాక్రామహిళలకు విడుదల చేసిన నిధులు.. ఒక్క మహిళ ఖాతాలో పడలేదన్నారు. ప్రతిపథకంలో వైసీపీ సర్కార్ .. రాష్ట్ర ప్రజలను మోసం చేస్తోందని బోండా ఉమా మండిపడ్డారు.
నాలుగేళ్లలో జగన్ మాట్లాడిన ప్రతి మాట.. మోసం అని తేలిపోయిందని.. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ .. ఓడిపోయిందని.. బోండా ఉమా అన్నారు. అవినీతి కేసులు, బాబాయ్ హత్యకేసు నుంచి బయటపడటానికి జగన్ … ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని బోండా ఉమా విమర్శించారు. నాలుగేళ్లలో మద్యం అమ్మకాలతోనే.. డబ్బులు రాబట్టడమేనా జగన్ అమలుచేసిన మద్యపాన నిషేధం? అంటూ బోండా ఉమ ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా జగన్‌ను, వైసీపీని విశ్వసించడం లేదని ఐప్యాక్ సర్వే తేల్చిందన్నారు. ఐప్యాక్ సర్వే చూశాక జగన్‌ను నమ్మి ఎన్నికల బరిలో నిలవడానికి .. ఆ పార్టీలోని వారే.. ఎవరూ సాహసించడంలేదన్నారు.