జగన్ నాలుగేళ్ల పాలనలో..  సంక్షోభం తప్ప.. సంక్షేమం లేదు – బోండా ఉమా

జగన్ నాలుగేళ్ల పాలనలో.. సంక్షోభం తప్ప.. సంక్షేమం లేదు – బోండా ఉమా

విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ.. ఏపీ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నేతలు కదం తొక్కారు. వివిధ జిల్లాలోని టీడీపీ కార్యకర్తలు, నేతలు రోడ్డపైకి వచ్చి పెంచిన ఛార్జీలు తగ్గించాలంటూ ఆందోళన చేపట్టారు. నాలుగేళ్ల జగన్ పాలనలో.. 8 సార్లు ధరలు పెంచి, ప్రజలపై 57 వేల కోట్ల రూపాయల భారాన్ని మోపారని ధ్వజమెత్తారు. జగన్ కుటుంబ బినామీ కంపెనీలకు ప్రయోజనం చేకూరేలా వ్యవహరిస్తూ.. విద్యుత్ వ్యవస్థను ఛిన్నాభిన్నం చేశారని టీడీపీ నేతలు మండిపడ్డారు. జగన్ సర్కార్ .. విద్యుత్ బాదుడు ఆపాలంటూ, సబ్‌స్టేషన్ల ఎదుట ధర్నా చేపట్టారు. వైసీపీ అధికారంలోకి వచ్చి.. రాష్ట్రానికి దరిద్రం పట్టి ఈ రోజుకి 4 ఏళ్ళు అవుతోందన్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుండి విద్యుత్‌ చార్జీలను వంద రెట్లు పెంచి, పేద బడుగు బలహీన వర్గాలపై ఆర్ధికంగా భారం మోపుతూ పాలన కొనసాగిస్తున్నారని.. టీడీపీ నేతలు విమర్శించారు. అదే విధంగా విద్యుత్‌ కోతలతో ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్నారని అన్నారు

విజయవాడలో.. బొండా ఉమా ఆధ్వర్యంలో .. టీడీపీ నేతలు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. మద్యం, మైనింగ్, ఇసుక మాఫియా ద్వారా జగన్ వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు పన్నుల, ఛార్జీల భారాలతో ప్రజలను దోచేస్తున్నారని బోండా ఉమా మండిపడ్డారు. జగన్ అధికారంలోకి వచ్చన నాటి నుంచి.. ప్రజలను కరెంట్ ఛార్జీల పెంపుతో వేధిస్తూ.. పన్నుల భారాలతో బాదేస్తున్నారని బోండా ఉమా అన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక 57 వేల కోట్లు భారం మోపారన్నారు. విద్యుత్ బిల్లుల పెంపులో జగన్ దారుణంగా వ్యవహరిస్తున్నారన్నారు. ట్రూ అప్ చార్జి అంటే అసలు బిల్లు ఇచ్చే వాళ్లకైనా తెలుసా అని బోండా ఉమా ప్రశ్నించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని బోండా ఉమా డిమాండ్ చేశారు. పేద, మధ్య తరగతి ప్రజలకు భారంగా మారిన విద్యుత్ చార్జీల భారాలను తగ్గించాలన్నారు. వైసీపీ పాలనలో రాష్టంలో సంక్షోభం తప్ప సంక్షేమం లేదని, ఈ అసమర్ధ ప్రభుత్వానికి ప్రజలు రాబోవు ఎన్నికల్లో తగిన బుద్ధి చెపుతారన్నారు.

జగన్ ఒక్క రోజు సీఎంగా ఉన్నా..రాష్ట్రానికి శాపమని టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. జగన్ అవినీతి దాహం వల్లే, విద్యుత్ ఛార్జీల భారం పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ కొనుగోళ్లల్లో కమిషన్ ద్వారా 6 వేల కోట్లు దండుకున్నారని ఆరోపించారు. ఏయే శాఖల్లో ఎంత అప్పులు తెచ్చారు.. ఎంత ఖర్చు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. యూనిట్ విద్యుత్ పై 40 పైసాలు పెంచుతున్నారంటూ.. టీడీపీ నేతలు ఆరోపించారు. ప్రజలకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. జగన్ నాలుగేళ్ల పాలనలో.. విద్యుత్ ఛార్జీలు పెంచడం తప్ప.. ప్రజలకు చేసిందేమీ లేదని.. విమర్శించారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *