హిందువుల మనోభావాలు దెబ్బతినేలా సిఎం జగన్‌ వ్యవహారం: బోండా

హిందువుల మనోభావాలు దెబ్బతినేలా సిఎం జగన్‌ వ్యవహారం: బోండా

హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. అసలు నువ్వు మీరు మతాన్ని ఆచరిస్తారు.. ఎవర్ని పూజిస్తారని ప్రశ్నించారు. ఆయనమీడియాతో మాట్లాడుతూ … ‘‘జగన్‌ నేలమాలికల్లో దాచిన డబ్బుని బయటికి తీసి మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలని చూస్తున్నాడు. జగన్మోహన్‌ రెడ్డి అవినీతితో సంపాదించిన డబ్బుతో రాజ శ్యామల యాగం చేసుకుంటే మాకు తప్పు లేదు. రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన దేవాలయాలకు సంబంధించిన డబ్బుతో రాజ్యశ్యామల యాగం చేస్తున్నాడు.

ఒక తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి రెండున్నర కోట్లు తీసుకున్నారు. జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని లూటీ చేశారు. రాష్ట్రంలో దేవాలయాల సొమ్ముకి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఒక పరిరక్షకుడు మాత్రమే. నువ్వు మరోసారి ముఖ్యమంత్రి అవడం కోసం, రాష్ట్రాన్ని దోచుకు తినడానికి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసే అధికారం నీకు ఎవరు ఇచ్చారు? ఏ దేవాలయాల నుంచి అయితే రాజశ్యామల యాగానికి డబ్బులు తెప్పించుకున్నారో అవి వెంటనే వెనక్కి జమ చేయాలి.

హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారు. అసలు నువ్వు ఏ మతాన్ని ఆచరిస్తావు.. ఎవర్ని పూజిస్తావు? తిరుమల బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి హోదాలో సతీసమేతంగా వెళ్లి బట్టలు ఇస్తారు.. గడచిన నాలుగేళ్లలో ఒక్కసారైనా దంపతులుగా మీరు తిరుమలకు వెళ్లిన దాఖలాలు లేవు. రాష్ట్రంలో ఏ గుడి కూడా సతీసమేతంగా ఎక్కడ వెళ్లలేదు. శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి చేత ఇటువంటి యాగాల్ని సొంత డబ్బులతో చేయించుకున్నావ్‌.. ఆ తర్వాత ఆయన్ను కూడా పక్కన పెట్టావు’’ అని విమర్శించారు.

సిట్‌ వ్యవహారంపై కొంత మంది పుడిరగులు బయటకు వచ్చి మాట్లాడుతున్నారని వీళ్లు నాలుగేళ్ల నుంచి ఏం చేసారని ప్రశ్నించారు. ఒక్క కేసులో కూడా చార్జిషీట్‌ వేయలేదన్నారు. రేపో ఎల్లుండో ఎంపీ అవినాష్‌ రెడ్డి అరెస్ట్‌ ఖాయమన్నారు. 50 మంది ఎమ్మెల్యేలు సీట్లు వద్దంటున్నారన్నారు. ఎమ్మెల్యేలు పారిపోతున్నారని… సమన్వయకర్తలు కాడిపడేస్తున్నారన్నారు. రాజ శ్యామల యాగం చేసే అర్హత ముఖ్యమంత్రి జగన్‌కి లేదని బోండా ఉమ పేర్కొన్నారు. హిందూ మతాన్ని నమ్మేవారే ఆ యాగం చేయాలని బోండా ఉమ పేర్కొన్నారు. జగన్‌ రెండోసారి ముఖ్యమంత్రి కావటానికి ప్రజల డబ్బుతో రాజ శ్యామల యాగం చేయటం విడ్డూరమన్నారు. వైసీపీ నేతలు యాగం చేయాలంటే వారి సొంత డబ్బుతో చేయాలన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తున్న జగన్‌ వారి ఆగ్రహానికి గురికాక తప్పదని బోండా ఉమ పేర్కొన్నారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *