ఏపీలోకి బీఆర్ఎస్ ఎంట్రీకి కేటీఆర్ మాస్టర్ ప్లాన్

ఏపీలోకి బీఆర్ఎస్ ఎంట్రీకి కేటీఆర్ మాస్టర్ ప్లాన్

తెలంగాణ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ద్వారా జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాక, మంత్రి కేటీఆర్ తెలంగాణ వ్యవహారాలన్నీ చక్కబెడుతున్నారు.తెలంగాణకు సంబంధించిన సమస్యలపై మోడీ సర్కార్ ను టార్గెట్ చేస్తూ ఈ మధ్యకాలంలో తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. పూర్తిగా తెలంగాణకే అంకితమైన కేటీఆర్, బీజేపీని తూలనాడూతూ ఏపీ రాజకీయాల్లోనూ వేలు పెట్టారు.స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలంటూ కేటీఆర్ కేంద్రానికి రాసిన లేఖ సంచలనం రేపుతోంది. లక్షన్నర కోట్ల రూపాయల విలువ గల స్టీల్ ప్లాంట్ ను అప్పనంగా ప్రవేట్ పరం చేసే కుట్రలను కట్టిపెట్టాలని కేంద్రానికి లేఖ ద్వారా కేటీఆర్ డిమాండ్ చేశారు.అయితే, కేటీఆర్ స్టీల్ ప్లాంట్ కామెంట్స్ వెనుక పెద్ద వ్యూహమే ఉందని తెలుస్తోంది. బీజేపీని ఇరుకునపెట్టడంతో పాటు, ఏపీలో బీఆర్ఎస్ కు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకునే ఉద్దేశంతోనే కేటీఆర్ స్టీల్ ప్లాంట్ ఇష్యూ రైజ్ చేసినట్టుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

నష్టాలను సాకుగా చూపించి తన కార్పొరేట్ కంపెనీల మిత్రులకు 12.5 లక్షల కోట్ల రూపాయలను రద్దు చేసిన ప్రధానమంత్రి మోడీకి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కనీసం కనికరం ఎందుకు ఉండడం లేదని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ తెలుగు ప్రజల హక్కు అని, దాన్ని కాపాడుకోవడం మన బాధ్యత అంటూ సెంటిమెంట్ పండించారు. ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, లక్షలాదిమంది కార్మికుల శ్రేయస్సు కోసం వారితో కలిసి నడిచేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉంటుందన్నారు. ఈ దిశగా తమతో కలిసి రావాలని ప్రభుత్వ రంగ సంస్థల కార్మికులకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు, కార్మిక సంఘాలను కలిసి వారికి సంఘీభావం తెలియజేయాలని ఏపీ బీఆర్ఎస్ శాఖ అధ్యక్షులు తోట చంద్రశేఖర్‌కు కేటీఆర్ సూచించారు.

అయితే, కేటీఆర్ రాసిన లేఖ అనేక సందేహాలను లేవనెత్తుతోంది. స్టీల్ ప్లాంట్ విషయంలో ఏపీ సర్కార్ ను ఎక్కడా లాగేందుకు ప్రయత్నించలేదు కేటీఆర్. కేవలం మోడీని లక్ష్యంగా చేసుకొని, బీఆర్ఎస్ ఎంట్రీకి స్టీల్ ప్లాంట్ ను వేదికగా ఎంచుకున్నట్లుగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పరోక్షంగా మాత్రం జగన్ చేతగాని తనాన్ని కూడా బయటపెట్టినట్లైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతునన్నాయి. స్టీల్ ప్లాంట్ విషయంలో జగన్ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందనే విమర్శలు ఉన్నాయి. బీజేపీతో అంటకాగుతోన్న జగన్, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో పూర్తిగా రాజీ పడిపోయారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వ్యక్తిగత సమస్యలను పరిష్కరిస్తే చాలన్నట్లుగా ఆయన వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నాయి.అయితే, తెలంగాణ విషయానికొస్తే రాజకీయ సమీకరణాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. కేసీఆర్ సర్కార్ మోడీపై కొట్లాడుతోంది. ఈక్రమంలోనే కేటీఆర్ పోరాడేదెంతో గానీ, లేఖల ద్వారా రాజకీయ ప్రయోజనాలు చూసుకుంటున్నారు.

ఇక, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామంటూ ముందుకొచ్చినన కేటీఆర్‌కు ఏపీ ప్రజానీకం నుంచి అనేక ప్రశ్నలు ఎదురు వస్తున్నాయి.విభజన జరిగి తొమ్మిదేళ్లు అవుతున్నా ఆంధ్రా హక్కులను ఎందుకు కాలరాస్తున్నారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఏపీకి న్యాయపరంగా రావాల్సిన ఉమ్మడి ఆస్తుల్ని ఎందుకు పంచి ఇవ్వడం లేదని పలువురు నిలదీస్తున్నారు. స్టీల్ ప్లాంట్ పై బీఆర్ఎస్ కు ఉన్నది కపట ప్రేమేనని , తన రాజకీయ ప్రయోజనాల కోసం జగన్ తో కుమ్మక్కై ఏపీ ప్రజలను మోసగించే కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడుతున్నారు. మొత్తం మీద.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై.. తెలంగాణ మంత్రి కేటీఆర్ గేమ్ ప్లాన్ పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ గా మారింది.

Related post

కేసీఆర్‌పై తిరుగుబాటు.. పార్టీ వీడనున్న ఆ నేతలు?

కేసీఆర్‌పై తిరుగుబాటు.. పార్టీ వీడనున్న ఆ నేతలు?

గులాబీ పార్టీలో టిక్కెట్ దక్కని నేతలంతా తిరుగుబాటు చేస్తున్నారు. అధినేత తమకు అన్యాయం చేశారంటూ కొందరు బోరున ఏడుస్తుంటే.. మరికొందరు తమ దారి తాము చూసుకునే పనిలో ఉన్నారు.…
కమ్యూనిస్టులను దెబ్బకొట్టిన కేసీఆర్..కాంగ్రెస్సే దిక్కు?

కమ్యూనిస్టులను దెబ్బకొట్టిన కేసీఆర్..కాంగ్రెస్సే దిక్కు?

కమ్యూనిస్టులను కేసీఆర్ క్రాస్ రోడ్డులో పడేయడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. మునుగోడు ఉపఎన్నిక నాటి పొత్తు కంటిన్యూ అవుతుందని ఆశగా ఎదురుచూస్తున్న వారికి షాక్ ఇచ్చారు గులాబీ బాస్.…
తగ్గేదేలే అంటోన్న మైనంపల్లి

తగ్గేదేలే అంటోన్న మైనంపల్లి

తెలంగాణ రాజకీయాల్లో మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు హాట్ టాపిక్ గా మారారు. రెండు చోట్ల సీటు ఆశించిన మైనంపల్లికి నిరాశే ఎదురైంది. దీంతో, ఆయన పార్టీ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *