వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి తండ్రి భాస్క రెడ్డి అరెస్ట్

వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి తండ్రి భాస్క రెడ్డి అరెస్ట్

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ హత్య కేసులో ప్రధాన నిందితులైన వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర రెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. ఆదివారం తెల్లవారుఝామున పులివెందులలోని భాస్కర రెడ్డి నివాసానికి సీబీఐ అధికారులు వెళ్ళారు. వైఎస్ భాస్కర రెడ్డి ఆ సమయంలో ఇంటిలోనే ఉన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు.. అరెస్టుకు సంబంధించిన మెమో అందజేసి.. ఆ తరవాత భాస్కర రెడ్డిని అరెస్టు చేశారు. 2019 మార్చి 15వ తేదీ రాత్రి పులివెందులలో వివేకానెందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్య కుట్రలో వైఎస్ భాస్కర రెడ్డి ప్రధాన నిందితుల్లో ఒకరని సీబీఐ విచారణలో తేలింది.

ఈ క్రమంలో ఒక్కో ఆధారాన్ని సేకరించి.. చివరకు భాస్కర రెడ్డిని అరెస్టు చేసింది. వైఎస్ భాస్కర రెడ్డి వివేకా హత్య కేసులో అత్యంత కీలక నిందితుడని సీబీఐ తన ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. వివేకా హత్యకు ముందు, తర్వాత నిందితులను భాస్కర్ రెడ్డి ఇంటికి పిలిచి మాట్లాడారు. హత్యకు ప్లాన్ చేశారని వెల్లడించింది. అతనిపై 120బి కుట్ర , 302 హత్య, 201 ఆధారాలను చెరిపివేయటం వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. ఇక.. వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర రెడ్డితో పాటు వైఎస్ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డిని సైతం సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని కడప తరలించారు.

భాస్కర రెడ్డి కుమారుడైన వైఎస్ అవినాష్ రెడ్డికి రైట్ హ్యాండ్ గా భావించే గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని ఇటీవల సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసింది. అతను ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్‌మెంట్ ఆధారంగా భాస్కర రెడ్డిని సీబీఐ అరెస్టు చేసినట్టు భావిస్తున్నారు. భాస్కర రెడ్డి అరెస్టు సందర్భంగా.. వైసీపీ కార్యకర్తలు సీబీఐ అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే గట్టి బందోబస్తు మధ్య ప్రత్యేక వాహనాల్లో భాస్కర రెడ్డిని హైదరాబాద్ తరలించారు. నాలుగేళ్ళుగా కొనసాగుతున్న వివేకా హత్య కేసు దర్యాప్తులో గూగుల్ టేకౌట్ ఆధారాలు కీలకంగా మారాయి. భాస్కర రెడ్డి అరెస్టులో సైతం గూగుల్ టేకౌట్ ఆధారాలు కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. మరోవైపు.. భాస్కర రెడ్డి తరువాత అత్యంత కీలక నిందితులను కూడా సీబీఐ వరుసగా అరెస్టు చేసే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది.

 

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *