
సుమలత తనయుడి పెళ్లి..రజనీకాంత్,మోహన్ బాబు సందడి
- EntertainmentMoviesNews
- June 5, 2023
- No Comment
- 25
కర్ణాటక ఎంపీ, సీనియర్ నటి సుమలత ఇంట పెళ్లి బాజా మోగింది. సుమలత తనయుడు అభిషేక్ పెళ్లి అంగరంగవైభవంగా జరిగింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రసాద్ బిదపా కుమార్తె అవివాతో ఆయన పెళ్లి జరిగింది. బెంగళూరులోని ఓ ప్రముఖ ప్యాలెస్‌లో ఈ వివాహ వేడుక జరిగింది. పెద్ద సంఖ్యలో సినీ, రాజకీయ ప్రముఖులు వచ్చి సందడి చేశారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, రజనీకాంత్, మోహన్‌బాబు తదితరులు హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు.
చిన్న వయసులోనే సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సుమలత.. తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం, హిందీ భాషల్లో నటించింది. కన్నడ నటుడు అంబరీశ్‌ను ఆమె వివాహం చేసుకున్నారు. అంబరీశ్ మరణం తర్వాత ఆమె ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు.