జగనే రాష్ట్ర దరిద్రం నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు పార్టీ శ్రేణులకు ఆదేశం

జగనే రాష్ట్ర దరిద్రం నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు పార్టీ శ్రేణులకు ఆదేశం

జగనే మానమ్మకం అనిగానీ, జగనే మా భవిషత్ అని గానీ ఎవరూనమ్మకండి. జగనే రాష్ట్ర దరిద్రం అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లండి. అని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. జగన్ తీసుకొచ్చిన గంజా యి, గన్ కల్చర్ తో రాష్ట్రం ఎటుపోతోందో ఆలోచించండి. యువత జీవితాలు, మద్యా నికి బానిసలైన వారి జీవితాలు ఏపని చేయడానికి పనికిరాకుండా పోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరులో శుక్రవారం జరిగిన జోన్ 4 సమావేశంలో చంద్రబాబు ప్రసంగించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడుతో పాటు ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు చెందిన పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి. చంద్రబాబు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ “జగనే మా నమ్మకం కాదు. జగనే మా భవిష్యత్ కాదు, జగనే రాష్ట్ర దరిద్రం. జగనే ప్రజలకు పట్టిన శని, జగన్ ఒక క్యాన్సర్ గడ్డ. ముందు ఎన్నికలు వస్తే ఈ శని విరగడ అవుతుంది. ఏ గ్రహాల చుట్టూ తిరిగినా కూడా జగన్ అనే శనివదలదు” అని విమర్శించారు. జగన్ కు ఈరోజే నేను సెల్ఫీ ఛాలెంజ్ విసిరాను. నెల్లూరులో పేదలకోసం బ్రహ్మండంగా కట్టిన టిడ్కోఇళ్లముందు నిలబడి ఆ ఇళ్లు ఎందుకు పేదలకు ఇవ్వలేదని జగన్ ని నిలదీస్తున్నాను. అధికారంలోకి వచ్చాక ఎవరైనా పేదల్ని దృష్టిలోపెట్టుకొని పని చేయాలి. 2.50లక్షల ఇళ్లను టీడీపీప్రభుత్వం పూర్తిచేస్తే వాటి ని పేదలకు ఇవ్వడానికి మనసురాని రాక్షసమనస్తత్వం జగన్ ది. పేదలకోసం నిర్మిం చిన టిడ్కోఇళ్లు దయ్యాల కొంపలుగా ఎందుకు మార్చాడో జగన్ సమాధానం చెప్పాలి అని చంద్రబాబు డిమాండ్ చేశారు.

ఈ ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో ప్రజలకోసం, రాష్ట్రంకోసం ఏంచేసిందో నిలదీస్తూ మీరు కూడా సెల్ఫీ ఛాలెంజ్ లు విసరాలి. ఇదేంఖర్మ మనరాష్ట్రానికి కార్యక్రమంలో ప్రజల్ని చైతన్యంచేయడానికి సెల్ఫీ ఛాలెంజ్ లు వినియోగించుకోవాలి అని పార్టీ శ్రేణులకు సూచించారు. రాష్ట్రంపై రూ.10.50 లక్షలకోట్ల అప్పులభారం మోపిన ఏకైక ముఖ్యమంత్రి జగనే. ప్రతి ఒక్కరిపై తలసరి అప్పు రూ.2లక్షలు ఉంది. మరోపక్క బాదుడేబాదుడు. నాలుగేళ్లలో 7సార్లు విద్యుత్ ఛార్జీలు, 3సార్లు ఆర్టీసీఛార్జీలు పెంచాడు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలోనే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాడు. ఇంటిపన్నుతోసహా అన్నిపన్నులు పెంచాడు. ఆఖ రికి చెత్తపై పన్నువేసిన చెత్త ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ధ్వజమెత్తారు. సంక్షేమానికి బీజంవేసింది తెలుగుదేశంపార్టీ. పక్కాఇళ్లు, జనతావస్త్రాల పంపిణీ, రూ.2కే కిలోబియ్యం వంటి అనేకమంచిపథకాల్ని ప్రారంభించిన వ్యక్తి ఎన్టీఆర్. టీడీపీ ప్రభుత్వాల హయాంలో ప్రజల జీవనప్రమాణాలు పెరిగాయని చెప్పారు. జగన్ ఇస్తున్నది 10 రూపాయలు..లాక్కుంటున్నది 100రూపాయలు. జగన్ వచ్చాక ఖర్చులుపెరిగి, ప్ర జల ఆదాయం తగ్గింది. ప్రభుత్వానికి వస్తున్నఆదాయం ఎటుపోతోందో తెలియడం లేదన్నారు.

2014-19 మధ్య భారీగా సంక్షేమ కార్యక్రమాలు

దేశంలో ఎక్కడాలేనన్ని సంక్షేమ కార్యక్రమాల్ని టీడీపీప్ర భుత్వం 2014-19 మధ్య అమలుచేసిందని చంద్రబాబు చెప్పారు. చంద్రన్నబీమాద్వారా రూ.5లక్షలు అందించాము. రూ.200ల పింఛ న్ ని రూ.2వేలకు పెంచాము. పండుగల కోసం సంక్రాంతికానుక, రంజాన్ తోఫా అం దించాం. పేదలకడుపు నింపడానికి అన్నక్యాంటీన్లు. గ్రామాల్లో 25వేల కిలోమీటర్ల సీ సీరోడ్లు. విదేశీవిద్య కింద దళితులు, బీసీలకు ఆర్థికసాయం అందించినట్టు వివరించారు. తిరుమలలో గంజాయి, పులివెందులలో గన్ కల్చర్. రాష్ట్రంలో మద్యంఏరులై పారుతోంది. రూ.50లు అమ్మే నాసిరకం మద్యాన్నిరూ.200కి అమ్ముతున్నారు. వైసీపీనేతలే గంజాయిపండిస్తున్నారు. అక్రమమద్యాన్ని అమ్ముతున్నారు. గంజాయి నాసిరకం మద్యానికి వైసీపీనేతలు చిరునామాగా మారితే, వారికి తాడేపల్లి ప్యాలెస్ అండగా ఉంటోంది. జే బ్రాండ్ మద్యం అమ్మకాలతో దోపిడీకి శ్రీకారంచుట్టారు. ఇదేనా మద్యపాననిషేధం. మద్యం అమ్మకాలను తాకట్టుపెట్టి అప్పులు తీసుకొచ్చిన చేతగానిప్రభుత్వం జగన్ ప్రభుత్వం. మద్యంఅమ్మకాలు, నాసిరకం మద్యంపై ప్రశ్నించాడని పుంగనూరులో ఓం ప్రతాప్ అనే దళితయువకుడిని దారుణంగా చంపేశారు. అతని ఫోన్ కనిపించకుండా చేశారు. పోస్ట్ మార్టమ్ కూడా చేయకుండా అంత్యక్రియలు చేసే పరిస్థితికి వచ్చారు అని చెప్పారు. ఇసుక బంగారం కంటే ఖరీదైంది. పశ్చిమగోదావరి జిల్లాలో ఇసుక కాంట్రాక్ట్ పొందిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కి కప్పంకట్టలేక ఆత్మహత్య చేసుకున్నాడు. విశాఖపట్నంలో రూ.45వేలకోట్ల ఆస్తులుకబ్జాచేశారు. గెలాక్సీ గ్రానైట్, నెల్లూరులోని సిలికాను ఎవరు దోచుకుంటున్నారు. 78 మంది సిలికా లీజుదారులపై రూ.300కోట్ల పెనాల్టీవేశారు. లీ జుదారులకు టన్నుకి రూ.100లుఇస్తూ, దాన్ని రూ.1485కు అమ్ముకుంటున్నారు. రూ.700 కుఅమ్ముతున్నట్లు లెక్కల్లో చూపుతూ జీఎస్టీ ఎగ్గొడుతున్నారు. రూ.3వే లకోట్ల సిలికా శాండ్ కుంభకోణంపై జగన్మోహన్ రెడ్డి సమాధానంచెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. గెలాక్సీ గ్రానైట్ ను నేను కాపాడితే, ఇష్టానుసారం దోచేస్తున్నారు. స్వర్ణ ముఖి నది ఇసుక చెన్నైకి, బెంగుళూరుకు ఎలాపోతోందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కృష్ణపట్నంపోర్టుతో పాటు, చెన్నై పోర్టు రామాయపట్నం పోర్టులు ఇక్కడ అందుబా టులో ఉన్నాయి. మూడుపోర్టులతో మూడు విమానాశ్రయాలు ఏర్పాటుచేయాలని చూశాం. తిరుపతి, కావలి లో విమానాశ్రాయలు ఏర్పాటుచేసి చెన్నై విమానాశ్రయా నికి అనుసంధానించి బ్రహ్మండమైన అభివృద్ధిచేయాలని భావించాం. తిరుపతిని హార్డ్ వేర్ హబ్ గా, నెల్లూరుని పోర్టు ఆధారిత కేంద్రంగా అభివృద్ధిచేసి, ఇక్కడ పిల్లలు బయ టకు పోకుండా ఉద్యోగాలు ఇవ్వాలని చూశామని వివరించారు. నెల్లూరు ధాన్యానికి దేశవ్యా ప్తంగా మంచిపేరుంది. నెల్లూరులో ధాన్యం కొనుగోళ్లు నిలిపే శారు. ధాన్యంకొన్నా రైతులకు డబ్బులు ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

వైసీపీ నేతల అనుమతులు కావాలా?

మంత్రికాకాణికి ల్యాండ్ మాఫియా, ఇసుకమాఫియా, లిక్కర్ మాఫియానే తెలుసు. 2014కు ముందు గోవానుంచి చీప్ లిక్కర్ తెచ్చి అమ్మినవ్యక్తి, ఆఖరికి కోర్టులోని ఫైల్స్ ను మాయంచేసిన వ్యక్తికూడా మాట్లాడుతున్నాడు. సిగ్గు, భయంలేకుండా ఇష్టానుసారం ప్రవర్తిస్తూ భూములు నొక్కేస్తున్నాడు. పొదలకూరులో 300ఎకరాల భూమికొన్నాడు. వెంకటాచలం మండలంలో రూ.400కోట్ల భూ కుంభకోణానికి పాల్ప డ్డాడు. చిల్లకూరులో ఈయన సాగించిన భూకుంభకోణం దెబ్బకు స్థానిక ఎమ్మార్వో బలిపశువు అయ్యింది. ఉదయగిరి నారాయణను వేధించి చంపేశారు. అతని మృతిపై ఎస్సీకమిషన్ కు, హ్యూమన్ రైట్స్ కమిషన్ కు ఫిర్యాదుచేసిన టీడీపీ నేతల్ని అభినందిస్తున్నాను. మరోఎస్సీ యువకుడిని టీడీపీనే కాపాడింది. రిజిస్ట్రేషన్ భూములు కొనడానికి, అమ్మడానికి వైసీపీనేతల అనుమతు లు కావాలా? అని చంద్రబాబు ప్రశ్నించారు. పలమనేరులో గ్రానైట్ వ్యాపారమంతా వైసీపీఎమ్మెల్యేదే. సత్యవేడు ఎమ్మెల్యే అక్కడి ఇసుకను చెన్నైకి తరలిస్తున్నాడు. కాళహస్తి ఎమ్మెల్యే పెద్దఎలుగుబంటి. ఆయనకు రూ.2వేలకోట్లఆస్తి ఉందంటే ఎక్కడి నుంచి వచ్చిందా అని నాకే అర్థంకాలేదు. స్వర్ణముఖిలో ఇసుకదోపిడీ, మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ ను భూమి కబ్జాచేయడం, రేణిగుం ట మండలం అనాసపల్లిలో ప్రభుత్వభూమి కబ్జాచేయడం. ఇవీఆయన ఘనతలుఅని ఆరోపించారు. జగన్ పెద్ద తిమింగలం. వైసీపీ ఎమ్మెల్యేలు చిన్నతిమింగలాలు. జగన్ మనపై 4గు రు పోలీసుల్ని పంపితే, మనకార్యకర్తలు 4వేలమంది వస్తారని వెల్లడించారు. హవాలాసొమ్ము తరలిస్తూ పట్టుబడిన వ్యక్తి కూడా నీతి, నిజాయితీ గురించి మాట్లాడ తాడు. గ్రానైట్ పరిశ్రమనుంచి అక్రమవసూళ్లు చేయడం, భూకబ్జాలు. సుబ్బారావు గుప్తా అనే వ్యక్తి ఒంగోలు ఎమ్మెల్యే చేసేదితప్పు అంటే అతనిపై తప్పుడుకేసులు పెట్టారు. ఆఖరికి గంజాయి కేసుపెట్టి వేధించారు. మనం ఏదో అవినీతిచేశామని జగన్ 4ఏళ్లుగా తవ్వుతున్నాడు. కొండను తవ్వితవ్వి ఎలుకను కాదుకదా, ఎలుకతోకలోని బొచ్చుకూడా పట్టుకోలేకపోయాడు అని ఎద్దేవ చేశారు. పుంగనూరు పుడింగి మంత్రి .. కాంట్రాక్టర్. గ్రానైట్, మైనింగ్, ఎర్రచందనం అన్ని దోపి డీలు ఆయనవే. ఇలానే రెచ్చిపోయి ఆటలాడేవారిని ఎవరినీ వదిలిపెట్టను. రేపు మేం రాగానే అందరినీ బోనుఎక్కిస్తాం. వైనాట్ కుప్పం అంటున్నారు.. కుప్పంలో లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తామని ఛాలెంజ్ చేసిచెబుతున్నాం. వైనాట్ పులివెందుల అని ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో నిరూపించాం. తల్లిని చెల్లిని ఏంచేశాడు. సొంత పిన్నమ్మ పుస్తెలు తెంపి, బాబాయ్ ని చంపి బాత్రూమ్ లో పడుకోబెట్టాడు అని ఆరోపించారు.

రైతు ఆత్మహత్యల్లో 3వ స్థానం

రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం 3వస్థానంలోఉంది. దేశంలో రైతుల తలసరి అప్పు రూ.75వేలు అయితే, ఆంధ్రప్రదేశ్ లో రైతులతలసరి అప్పు రూ.2.45లక్షలకుచేరింది . కౌలురైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం 2వస్థానంలోఉంది. ఇన్నిజరిగినా రైతుల విద్యుత్ మోటార్లకు మీటర్లు పెట్టేందుకు సిద్ధమయ్యారు. ప్రశ్నించినవారిపై తప్పుడుకేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారు అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. నాడు-నేడు పేరుతో పాఠశాలలకు రంగులేసి, విద్యాప్రమాణాలు దిగజార్చి, రాష్ట్రాన్ని 19వస్థానానికి దిగజార్చారు. 10వేలకోర్టు ధిక్కరణకేసులు ఈప్రభుత్వంపై ఉన్నాయి. రూ.64వేలకోట్లతో టీడీపీ ప్రభుత్వం 62ప్రాజెక్టులనిర్మాణంచేపట్టి, 24ప్రాజెక్ట్ లని పూర్తి చేసింది. నెల్లూరు సంగంబ్యారేజీనిర్మాణం టీడీపీ పూర్తిచేస్తే జగన్ రిబ్బన్ కత్తిరించాడు. 5 సంవత్సరాల్లో రూ.8,291కోట్లు రాయలసీమలోని ఇరిగేషన్ ప్రాజెక్ట్ లకు టీడీపీ ప్రభుత్వం ఖర్చుపెట్టింది. జగన్ నాలుగేళ్లలో రాయలసీమలో పెట్టిన ఖర్చు రూ.2వేల కోట్లు. అప్పర్ భద్ర ప్రాజెక్ట్ నిర్మిస్తుంటే నోరెత్తలేని అసమర్థుడు జగన్. రాయలసీమకు తెలుగుగంగ తీసుకొచ్చి, పెన్నా-కృష్ణా నదుల్ని అనుసంధానంచేసిన మహానుభావు డు స్వర్గీయఎన్టీఆర్. గోదావరి వరదనీరు 2,500టీఎంసీలు సముద్రంపాలు అవుతోం ది. ఆ నీటిని సక్రమంగా వినియోగించుకుంటే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది అని చంద్రబాబు వివరించారు. 2014లో గెలిచిన వెంటనే 7ముంపు మండలాలు ఏపీలోకలపాలని పట్టుబట్టి, ప్రధానితో మాట్లాడి సాధించాను. మండలాలు ఏపీలో కలపకపోతే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయననిచెప్పాను. తరువాత పోలవరం ప్రాజెక్ట్ ను 72శాతం పూర్తి చేశాం. పోలవరాన్ని పూర్తిచేసి, గోదావరి నీటిని కృష్ణానదికి అనుసంధానంచేసి, అదే నీటిని పెన్నానదికి తీసుకొచ్చేలా ప్రణాళికలు వేశాం. నాగార్జున సాగర్ నుంచి నల్లమ ల అటవీప్రాంతంలో ఒకటన్నెల్ తవ్వి, కృష్ణానీటిని బనకచెర్ల రిజర్వాయర్ కు తీసుకు రావాలని చూశాం. బనకచెర్ల నుంచి తెలుగుగంగద్వారా అన్నిప్రాంతాలకు నీళ్లు వచ్చేవని చెప్పారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చాక పోలవరాన్ని గోదావరిలో ముంచేశాడు. రివర్స్ టెం డరింగ్ పేరుతో రాష్ట్రానికి ఉన్న సువర్ణ అవకాశాన్నినాశనంచేశాడు. ప్రజావేదికతో విధ్వంసపాలన ప్రారంభించి, ప్రతిఒక్కరినీ భయపెడుతున్నాడు. మాట్లాడేవారిపై, ప్ర శ్నించేవారిపై తప్పుడుకేసులుపెట్టి జైళ్లకు పంపుతున్నాడు. నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబంతో సహా బలవన్మరణానికి పాల్పడ్డాడు. డాక్టర్ సుధాకర్ ని చంపేశా డు. అందుకే జగన్ బిడ్డ పెద్ద క్యాన్సర్ గడ్డ అంటున్నాం.”అని విమర్శించారు.

Related post

నెల్లూరులో నారాయణ పూజలు

నెల్లూరులో నారాయణ పూజలు

నెల్లూరు నగరంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నగర ఇన్‌చార్జ్‌ ,మాజీమంత్రి పొంగూరు నారాయణ, సతీమణి రమాదేవి కలిసి పలు చోట్ల.. వినాయక స్వామివారిని…
పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

టీడీపీ ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంది. కానీ, వాటన్నంటినీ ఎదుర్కొని పార్టీని సమర్థవంతంగా ముందుండి నడిపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. కానీ, ఇప్పుడు ఆయనకే కష్టం వచ్చింది. అక్రమ అరెస్ట్…
చంద్ర‌బాబుకు అండ‌గా నిలుద్దాం..  విడుదల అయ్యేంత వరకు పోరాటం

చంద్ర‌బాబుకు అండ‌గా నిలుద్దాం.. విడుదల అయ్యేంత వరకు పోరాటం

నాలుగున్నర దశాబ్దాల పాటు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవినీతికి తావు లేకుండా.. టీడీపీ అధినేత చంద్రబాబు పరిపాలన చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం.. నిరంతరం అభివద్ధే ధ్యేయంగా పని చేసిన చంద్రబాబుపై…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *