మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డుగా పెడతాను కార్యకర్తలకు చంద్రబాబు భరోసా

మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డుగా పెడతాను కార్యకర్తలకు చంద్రబాబు భరోసా

వీరారెడ్డి వంటి నాయకులు గర్వకారణం
కడప జిల్లాలో మూటాలను అణచివేసింది టిడిపి
వీరారెడ్డి, ఆనం కుటుంబాలు రాజకీయ చరిత్ర సృష్టించాయి
తప్పు చేసిన వారిని చట్టప్రకారం శిక్షిస్తాం
పత్రికా స్వేచ్ఛానూ హరిస్తున్నారు

టీడీపీలో పని చేసిన ఏ ఒక్క కార్యకర్తకు ఇబ్బందులు వచ్చినా చూసుకుంటాం. మీ బంధువులు మీకు అండగా ఉన్నా, లేకపోయినా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. ప్రతి ఒక్క కార్యకర్త గట్టిగా పోరాడాలి. మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డుగా పెడతాను అని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో బుధవారం జరిగిన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. బద్వేల్ లో వీరారెడ్డి లాంటి నాయకులు ఉండటం గర్వకారణం. ఆయన ఎంతో మంది నాయకులకు స్పూర్తిదాయం. 1953లో చెన్నంపల్లి పంచాయితీ బోర్డు సభ్యుడిగా వీరారెడ్డి రాజకీయ ప్రవేశం చేశారు. 1967లో మొదటి సారిగా బద్వేల్ ఎమ్మెల్యే అయ్యారు. అప్పటి నుంచి 6 సార్లు ఎమ్మెల్యే అయిన ఏకైక వ్యక్తి వీరా రెడ్డి.

1983లో ఎన్నికలు అయిన తరువాత వచ్చిన సంక్షోభంలో వీరా రెడ్డి ఇండిపెండెంట్ గా గెలిచి ఎన్టీఆర్ పిలుపుతో టీడీపీలో చేశారు. 1984లో వ్యవసాయ మంత్రిగా పని చేశారు. బద్దేల్ అంటే వీరా రెడ్డి గుర్తుకు వస్తాయి. ఆయన ఏ పని తలపెట్టినా ఎట్టి పరిస్థితుల్లో సాధించేవారు అని చంద్రబాబు వివరించారు. కడప జిల్లాలో ముఠాలను అణచివేసిన పార్టీ టీడీపీ. వీరా రెడ్డికి ముఠాలు లేవు. ముఠానాయకులను ఓడించిన ఘనత ఆయనది అని పేర్కొన్నారు. వీరా రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి కుటుంబాలు రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన కుటుంబాలు అని ప్రశంసించారు. జగన్ ముఖ్యమంత్రిగా కొనసాగితే మన భవిష్యత్ తో పాటు భావితరాల భవిష్యత్ అంథకారం అవుతుందన్నారు. తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తేవడానికి ప్రతి ఒక్క కార్యకర్త పని చేయాలి. మీ యూనిట్ లో ఎక్కువ ఓట్లు సాధించిన వ్యక్తులకు అండగా నేను ఉంటాను అని హామీ ఇచ్చారు. ఏ నాయకుడైన సరే నన్ను వెతుక్కొని రావాల్సిన పని లేదు. మీరు కష్టపడి పని చేస్తే నేనే మీ వద్దకు వస్తాను. ప్రజలకు అండగా మీరు ఉంటే పార్టీ మీకు అండగా ఉంటుంది అని చెప్పారు.

టిడిపికి ముందు తర్వాత

తెలుగు జాతి గురించి చెప్పాంటే తెలుగుదేశం పార్టీ ముందు, తరువాత అని చెప్పాల్సిన పరిస్థితి అని చంద్రబాబు పేర్కొన్నారు. తెలుగు జాతి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి ఎన్టీఆర్. రూ.2 కేజీ బియ్యం తెచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు అని చెప్పారు.నేతలను ఆదుకున్నారు, రైతులకు అండగా నిలిచారు. 4 ముఖ్యమంత్రులను ఒప్పించి తెలుగు గంగకు శ్రీకారం చుట్టారు. నేరుగా శ్రీశైలం నుంచి రాయలసీమకు నీళ్లు ఇచ్చిన తరువాతే తమిళనాడుకు నీళ్లు తీసుకుపోవాలని పట్టుబట్టి సాధించిన వ్యక్తి ఎన్టీఆర్. హంద్రీ నీవా, గండి కోట, గాలేరు నగరి, కండలేరు ఇలా రాయలసీమలో ప్రతి ఒక్క ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఎన్టీఆరే అని వివరించారు. నేను ముఖ్యమంత్రి అయిన తరువాత తెలుగు రాష్ట్రాన్ని నెక్ట్స్ లెవల్ కు తీసుకువెళ్లాం.

హైటెక్ సిటి. ఔటర్ రింగ్ రోడ్డు, శంషాబాద్ ఎయిర్ పోర్టు, జీనోమ్ వ్యాలీలు తీసుకువచ్చాం. కరోనాకు మందును జీనోమ్ వ్యాలీ నుంచి తీసుకువచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ ఘనత. వాజ్ పాయ్ ను ఒప్పించి జాతీయ హైవీల కోసం మొదటి సారిగా చెన్సై నుంచి నెల్లూరుకు వేయించిన ఘనత టీడీపీదే. తెలుగుజాతి యువతకు ఐటీని ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పారు. ఒక దుర్మార్గుడు పాలిస్తే రాష్ట్రం ఎలాగా ఉంటుందో అందుకు ఏపీనే ఉదాహరణ. నాడు మనం చేసిన పనులకు నేడు తెలంగాణ రాష్ట్రం అన్నింటిలో ముందుంది. మనం తెచ్చిన పాలసీలు కొనసాగించారు. కాని ఇక్కడ ముఖ్యమంత్రి మాత్రం మనం తెచ్చిన పాలసీలు, చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కక్షపూరితంగా నిలిపివేశారు అని ఆవేదన వ్యక్తం చేశారు.

సాక్షాత్తు బాబాయ్ ని చంపి రోజు రోజుకు ట్విస్ట్ లు పెడుతున్నారు. బాబాయ్ ను చంపిన వ్యక్తికి మామూలు ప్రజలు ఒక లెక్కా? బద్వేల్ లో ఎస్సీల ఆస్తుల భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. ప్రభుత్వాలు ఎస్సీలకు ఇచ్చిన భూములను కబ్జాలకు గురి చేశారు. అన్యాక్రాంతం చేసిన వారిని ట్రిబ్యునల్ పెట్టి తప్పు చేసిన వారిని జైల్లో పెట్టిస్తాం. తప్పు చేసిన వారిని ఎవరినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని హెచ్చరించారు. టీడీపీ హయాంలో సర్పంచ్ లు అందరికి రాజవైభోగం. అందరితో పనులు చేయించాం కాబట్టి గ్రామాల్లో 25వేల కి.మీ. రోడ్లు వేయించాం, లైట్లు పెట్టించాం, వంట గ్యాస్ అందించాం. అన్నా క్యాంటీన్, విదేశీ విద్య, చంద్రన్న బీమా, సబ్ ప్లాన్, రంజాన్ తోఫాలను ఇచ్చాం. కాని నేడు సర్పంచ్ ల నిధులు దారి మళ్లించి రోడ్డుకీడ్చారు. ఇష్టానుసారంగా పన్నులు పెంచేసుకున్నారన్నారు. ఇచ్చేది రూ.10 కాని దోచుకునేది రూ.100. ఆటోడ్రైవర్ కు రూ.10వేలు ఇస్తూ మద్యంలో రూ.60వేలు దోచుకుంటున్నారు. రోడ్లు సరిగ్గా లేకపోవడంతో ఆటో మరమ్మత్తులు పెరిగిపోయాయి.

ట్రాన్స్ పోర్టు వాళ్లు ఫైన్లు పెంచేశారు. బటన్ నొక్కుడు ద్వారా రూ2లక్ష ల కోట్లు దోచేశారు. ల్యాండ్, శాండ్, వైన్ మైన్ లో దోచుకుంటున్నారు. రూ. 2లక్షల కోట్లు ఎమ్మెల్యేలు, వైసీపీ నాయకులు దోచుకొని రూ.5 లక్షల కోట్ల భారం వేశారు. అభివృద్ధి సున్నా, ఏ ఒక్కడికి ఉద్యోగం లేదు. అందుకే జాబు కావాలంటే బాబు రావాలని అంటున్నారు. చదువుకున్న పట్టభద్రుల్లో 36 శాతం నిరుద్యోగులు ఉన్నారు అని వివరించారు. అందుకే గ్రాడ్యువేట్ ఎన్నికల్లో రాంభూపాల్ రెడ్డిని గెలిపించారు. జగన్ రెడ్డిని పులివెందుల పిల్లిగా చేసిన పులి రాంభూపాల్ రెడ్డి. ప్రజలకు జరుగుతన్న అన్యాయాన్ని తెలియజేయాలి. నిత్యావసర ధరలు, పన్నుల పెంపు, జీవనాధారం భారమైవ్వడంతో కొంత మందికి ఏం చేయాలో తెలియక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దేశంలో ఒక్కో రైతుపై రూ.74వేల తలసరి అప్పు ఉంటే అదే ఏపీలో రూ.2,45,000 అప్పు అంటే 5 రెట్లు ఎక్కువ. ఒక వైపు బాధుడే బాదుడు మరో వైపు ఇదేంఖర్మ. నేరం, కరప్షన్ ఇష్టానుసారంగా పెరిగిపోయింది. ఎంతో మందిని పొట్టన పెట్టుకున్నారు అని ఆరోపించారు.

కార్యకర్తల్ని ఆదుకుంటాం

ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో అవినీతి జరిగిందని చెప్పిన పాపానికి మండవ సుబ్బయ్యను కిరాతకంగా చంపేశారు. వారి కుటుంబాన్ని ఆదుకొని నిలబెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీదీ. కమలాపురం ఐటీడీపీ కార్యకర్త చనిపోతే రూ.9 లక్షల ఆర్ధిక సాయంతో పాటు, ఆయన భార్యకు ఉద్యోగం కల్పించి, కూతును ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ లో చదివిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. టీడీపీలో పని చేసిన ఏ ఒక్క కార్యకర్తకు ఇబ్బందులు వచ్చినా చూసుకుంటాం. మీ బంధువులు మీకు అండగా ఉన్నా, లేకపోయినా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. కార్యకర్తల కోసమే ఎన్టీఆర్ ట్రస్ట్ ను పెట్టాం. రూ.100 కోట్లు తెలుగుదేశం కార్యకర్తలు చనిపోతే ఇన్య్సురెన్స్ ఇచ్చి ఆదుకుంటున్నాం. పార్టీకి రూ.5వేలు డొనేషన్ ఇస్తే శాశ్వత మెంబర్లుగా ఇస్తున్నాం అని వెల్లడించారు. వివేకానందరెడ్డి హత్యలో జరిగినన్ని ట్విస్ట్ లు సినిమాలో కూడా చూసి ఉండం. న్యాయవాదులు, పోలీసులకు వివేకా హత్య ఒక కేస్ స్టడీ. ఒక ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని రాజకీయాన్ని అధికారాన్ని పణంగా పెట్టి దాడులు చేయిస్తున్నారు అని చెప్పారు.

జగన్ వల్ల ఎవ్వరికి లాభం లేదు. నరేగాలో పని చేసిన కూలీలను మోసం చేశారు. పేద వాళ్ల రక్తాన్ని జలగలా తాగుతున్నారు. ప్రజాస్వామ్యానికి అవమానం ఈ ముఖ్యమంత్రి, రాష్ట్రానికి అరిష్టం వైసీపీ. మీరు పని చేయకుండా కూర్చుంటే రాష్ట్రానికి ప్రమాదం వస్తుంది అని హెచ్చరించారు. రాయలసీమలో జలవనరులకు రూ.8,500 కోట్లు ఖర్చు పెట్టిన ఘనత టీడీపీది. రాయలసీమకు నీళ్లిచ్చి రత్నాలు సీమగా మార్చాం. వాణిజ్యపంటలకు అనువైన ప్రదేశం రాయలసీమ ప్రాంతం. ఎస్సీలను చంపి డెడ్ బాడీని ఇంటికి పంపించారు. హంతకుడిని, కిరాతకుడిని అవసరమైతే అలాంటి వ్యక్తికి ఉరిశిక్ష, జీవితకాలం శిక్ష వేయించాల్సిన ప్రభుత్వం ఆయనను ఊరేగింపుతో తీసుకువచ్చారు. గంజాయి, గన్ కల్చర్ వచ్చింది. ఎవరైనా ఎదురుతిరిగితే చంపేస్తున్నారు. పత్రికా స్వేచ్చ హరించివేస్తున్నారు. ఏమైనా రాస్తే వెంటనే పోలీసులు వచ్చి అరెస్ట్ లు చేస్తున్నారు అని ఆరోపించారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *