టిడిపి నేతల అక్రమ అరెస్టును ఖండిరచిన చంద్రబాబు

టిడిపి నేతల అక్రమ అరెస్టును ఖండిరచిన చంద్రబాబు

అమరావతి:-రాష్ట్రంలో రోజు రోజుకూ వైసీపీ ప్రభుత్వ రాజకీయ వేధింపులు, కక్ష సాధింపులు పెరుగుతున్నాయే తప్ప…వారిలో మార్పు రావడం లేదని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రత్యర్థులను ఓడిరచడానికి పాలనను నమ్ముకోవాల్సిన ప్రభుత్వం….అక్రమ కేసులను, అరెస్టులను మాత్రమే నమ్ముకుందని చంద్రబాబు అన్నారు. తాజాగా రాజమండ్రిలో పార్టీ నేతలు ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి శ్రీనివాస్‌ల అరెస్టులు అందుకు సాక్ష్యం అని చంద్రబాబు మండిపడ్డారు.

గ్రామాల్లో ఉన్న తెలుగు దేశం కార్యకర్తల నుంచి, రాష్ట్ర స్థాయి నేతల వరకు ప్రతి ఒక్కరినీ కేసులతో, దాడులతో భయపెట్టి లొంగదీసుకోవాలనే దుష్ట ఆలోచనలు మానుకోవాలన్నారు. సిఐడి అనేది దర్యాప్తు ఏజెన్సీనా, లేక వైసీపీ వేధింపుల ఏజెన్సీనా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సిఐడి పెడుతున్న అక్రమ కేసులు, అరెస్టులపై ఇప్పటికే అనేక సార్లు కోర్టులతో చీవాట్లు తిన్నా ప్రభుత్వ బుద్ది మారకపోవడం సిఎం జగన్‌ విషపు రాజకీయ ఆలోచనలకు నిదర్శనం అన్నారు.

రాష్ట్రంలో ఎవరూ ఏ వ్యాపారం చేసుకోకూడదు అన్నట్లు సిఎం జగన్‌ వ్యవహరిస్తున్నారని, ఈ కక్షసాధింపు పాలనకు వైసీపీ ప్రభుత్వం తీవ్ర మూల్యం చెల్లిస్తుందని చంద్రబాబు నాయుడు అన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీతో ఫోన్‌లో మాట్లాడిన చంద్రబాబు నాయుడు భయపడవద్దని పార్టీ అండగా ఉంటుందని సూచించారు.

రాజకీయ విమర్శలు కాదు…ముందు రైతుల కష్టాలు చూడండి: ప్రభుత్వానికి చంద్రబాబు సూచన

ఆంధ్రప్రదేశ్‌ లో అకాల వర్షాల కారణంగా రైతాంగం నష్టపోతుంటే ఈ ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదని టిడిపి అధినేత చంద్రబాబు మండిపడ్డారు. మంత్రులు కనీసం ఒక్క చోట కూడా రైతుల దగ్గరకు, పొలాల్లోకి వెళ్లడం లేదు. అన్నదాత కష్టంపై కనీసం ఆరా తీయడం లేదన్నారు. ఇక సీఎం సంగతి సరేసరి. రజనీకాంత్‌ను తిట్టే పని కాదు.. ధాన్యం రైతుల కష్టాలు చూడాలని ఎద్దేవా చేశారు. పవన్‌ కళ్యాణ్‌ను ఆడిపోసుకోవడం కాదు, మిర్చి రైతుల బాధలు వినాలని హితువు పలికారు. ప్రతిపక్ష నేతల అరెస్టులు, దాడులు కాదు…పొలంలో అన్నదాతల దుస్థితిపై దృష్టి పెట్టాలన్నారు. కర్షకులకు భరోసా ఇవ్వండి…ప్రభుత్వం నుంచి తగిన సాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *