జగన్ సర్కార్ మెడలు వంచిన చంద్రబాబు రైతు యాత్రలు..

జగన్ సర్కార్ మెడలు వంచిన చంద్రబాబు రైతు యాత్రలు..

ఆంధ్రప్రదేశ్‌‌లో అకాల వర్షాల వల్ల పంట దెబ్బతిన్న ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన పర్యటన.. జగన్ సర్కార్ మొద్దు నిద్ర వదిలించిందా..? కనీసం గోనె సంచులకు సైతం గతిలేని స్థితిలో ఉన్న ప్రభుత్వం ఇప్పుడు ఉరుకులు.. పరుగులు పెడుతోందా..? విపక్ష నేత చంద్రబాబు నాయుడి యాత్రలకు భయపడే మంత్రులు, ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారా..? హడావుడిగా ధాన్యం కొనుగోళ్ళు చేపడుతున్నారా..? అంటే అవుననే సమాధానాలే వస్తున్నాయి. విపక్షనేత చంద్రబాబు నాయుడు సీన్‌లోకి ఎంటరవ్వటంతోనే.. జగన్ సర్కార్ డ్యామేజ్ కంట్రోల్‌కు దిగిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఆంధ్రప్రదేశ్‌లో గతంలో ఎన్నడూ లేనివిధంగా.. మే నెల ఆరంభంలోనే కుండపోత వర్షాలు కురిశాయి. కాలం కాని కాలంలో కురిసిన అకాల వర్షాలు అన్నదాతల వెన్ను విరిచాయి. అయితే.. ఏప్రిల్ నెల రెండవ వారంలోనే కోతలు మొదలై.. మే నాటికి దాదాపు ధాన్యం రాశులన్నీ రైస్ మిల్లులకు చేరాలి. కానీ.. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో గన్నీ బ్యాగులు సరఫరా చేయక పోవటం.. రవాణా సదుపాయాలను కల్పించక పోవటం వంటి కారణాలతో.. విపరీతమైన జాప్యం జరిగింది. దీంతో.. గన్నీ బ్యాగులు దొరక్క ధాన్యం రాశులన్నీ కల్లాలకు, రోడ్లకే పరిమితం అయిపోయాయి.

ఈలోగా కురిసిన అకాల వర్షాలకు రాశుల్లోని ధాన్యం పూర్తిగా తడిచిపోగా… పొలాల్లోని వరి పంట అంతా నేలకొరిగింది. ధాన్యం రాశుల్లో మొలకలు రాగా.. వరి పంట వర్షం నీటిలో నాని ఎందుకూ పనికిరాకుండా పోయింది. ఇంత జరుగుతున్నా.. జగన్ ప్రభుత్వం మాత్రం.. ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రైతన్నలు గగ్గోలు పెడుతున్నా దున్నపోతు మీద వానపడ్డ చందంగానే వ్యవహరించింది.

అయితే.. అన్నదాతల ఆక్రందనలు విన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు క్షణం కూడా ఆలస్యం చేయలేదు. భారీ వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో హుటాహుటీన పర్యటనలు మొదలు పెట్టారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లోని 75కు పైగా నియోజకవర్గాల్లోని పార్టీ శ్రేణులను అప్రమత్తం చేశారు. జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ ఎండగట్టారు. వర్షాల వల్ల దెబ్బతిన్న పంటల వివరాలను మీడియా సాక్షిగా చాటి చాటారు. దీంతో అప్పటి వరకు మొద్దు నిద్రలో జోగుతున్నజగన్ సర్కార్.. ఒక్కసారిగా షాక్ తింది.

క్షేత్ర స్థాయిలో తమ నిర్వాకాలను ఎండగడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును చూసి ఉలిక్కి పడింది. చంద్రబాబు పర్యటిస్తున్న మార్గాల్లో యుద్ధప్రాతిపదికన ధాన్యం కొనాలని.. రైతులకు గన్నీ బ్యాగులు, టార్పాలిన్ కవర్లు అందించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను అమలు చేసే బాధ్యతను..పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు అప్పగించింది. దీంతో అప్పటి వరకు ఇంటికే పరిమితం అయిన కారుమూరి.. ఆపసోపాలు పడుతూ.. పొలం బాట పట్టాల్సి వచ్చింది. కాసేపట్లో చంద్రబాబు మా ఏరియాకు వస్తున్నారు.. అర్జంటుగా గన్నీ బ్యాగులు పంపండి అంటూ.. ఆయన అధికారులను వేడుకోవటం కనిపించింది.

మొత్తంగా చూస్తే.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనల వల్లే ప్రభుత్వంలో చలనం వచ్చిందనే అభిప్రాయం రైతుల్లో వ్యక్తం అవుతోంది. చంద్రబాబు మా ఏరియాకు రాకపోతే.. ఈ ప్రభుత్వం ఇప్పటికీ స్పందించేది కాదని అనేక మంది రైతులు అంటున్నారంటే.. చంద్రబాబు టూర్ ఎఫెక్ట్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. మొత్తం మీద.. జగన్ మోహన్ రెడ్డి సర్కార్ మెడలు వంచి.. ధాన్యం కొనుగోలు చేయించిన ఘనత టీడీపీ చంద్రబాబు నాయుడికే దక్కుతుందని చెప్పుకోవచ్చు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *