తీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవు  బ్లూ మీడియాకు చంద్రబాబు హెచ్చరిక

తీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవు బ్లూ మీడియాకు చంద్రబాబు హెచ్చరిక

ప్రజాసమస్యలు గాలికి వదిలి బ్లూ మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది. బ్లూ మీడియా తీరు మార్చుకోకుంటే టిడిపి అధికారంలోకి వచ్చాక చర్యలు తప్పవు. అని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. నిజం నిప్పు లాంటిది. ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది. తప్పుడు పనులు చేసేవారికి వడ్డీ తో సహా తిరిగి చెల్లిస్తాం అని చంద్రబాబు పేర్కొన్నారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో వున్న టిడిపి నాయకులు ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి వాసు లను శుక్రవారం ములాఖత్ లో చంద్రబాబు కలుసుకున్నారు.

అనంతరం రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ గృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ఆదిరెడ్డి కుటుంబానికి పార్టీ అన్నివిధాల అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నాయకులు, కార్యకర్తలు ధైర్యంగా వుండాలని కోరారు. జగన్ పాలనపై ప్రజలలో తిరుగుబాటు మొదలైందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు తిరుగుబాటుకు సూచిక అని పేర్కొన్నారు. దుర్మార్గపు పనులు చేస్తున్న జగన్ చరిత్రహీనుడుగా మిగిలిపోతారన్నారు. కష్టపడి రాజకీయాలలో ఎదిగిన బిసినేత ఎర్రంనాయుడు కుమార్తెను అక్రమ కేసులతో వేధిస్తున్నారని ఆరోపించారు. మేయరు గా, ఎమ్మెల్యే గా ఆదిరెడ్డి కుటుంబ సభ్యులు రాజమండ్రి ప్రజలకు విశేష సేవలందించారన్నారు.

ఆదిరెడ్డి కుటుంబం నీతి,నిజాయితీగా ఎన్నో ఏళ్ల నుంచి వ్యాపారం చేస్తున్నదని, డిపాజిట్ దారులెవరూ ఫిర్యాదు చేయకుండానే జగజ్జననీ చిట్ ఫండ్ పై అక్రమకేసులు నమోదు చేశారని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు భవానీ పై పార్టీ మారాలని ఒత్తిడి తెచ్చారని, పార్టీ మారక పోవటంతో అక్రమ కేసులతో వేధిస్తున్నారన్నారు. 8 వ తరగతి చదివే పిల్లవాడిని సైతం పోలీసులు బెదిరించడం సైకో పాలనకు పరాకాష్ట అని ఆరోపించారు. టిడిపి 22 ఏళ్ల పాటు అధికారంలో వున్నప్పటికీ ఏనాడూ ఏవిధమైన దుర్మార్గపు పనులు చేయలేదని చెప్పారు.

ఆదిరెడ్డి కుటుంబం చేసిన తప్పు ఏమిటి? అని ప్రశ్నించారు. జగన్ పాలనలో బిసిలు చిన్న చిన్న వ్యాపారాలు చేయకూడదా? ఒక మహిళ అని చూడకుండా ఎమ్మెల్యే భవానీ పై సోషల్ మీడియా లో అసభ్యకరంగా పోస్టులు పెట్టి మానసికంగా వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు.

రాజారావుకు అభినందనలు

అప్పారావు, వాసు లను కలిసేందుకు తనకు అనుమతి ఇచ్చిన సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాజారావు ను ట్రాన్స్ఫర్ చేస్తారా? అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మా నేతల్ని మేము పరామర్శించ కూడదా? జగన్ 16 నెలలు జైల్లో వుంటే ఎవర్నీ కలవలేదా? అని ప్రశ్నించారు. ఎస్టీ కుటుంబం నుంచి కష్టపడి పోలీసు అయిన రాజారావు నిజాయితీగా పనిచేస్తే ట్రాన్స్ఫర్ చేస్తారా? రాజారావు ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. పోలీసులు రాజారావు ను స్ఫూర్తిగా తీసుకోవాలి అని చంద్రబాబు కోరారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *