టీడీపీ అధికారంలోకి వస్తేనే సర్పంచ్ లకు పూర్వ వైభవం

టీడీపీ అధికారంలోకి వస్తేనే సర్పంచ్ లకు పూర్వ వైభవం

ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పంచాయితీరాజ్ వ్యవస్ధను నిర్వీర్యం చేశారని, సర్పంచ్ ల నిధులు, విధులు లాక్కుని ఉత్సవ విగ్రహాలుగా మార్చారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ద్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో సర్పంచ్ లతో చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ పంచాయితీ వ్యవస్ధను జగన్ రెడ్డి నిర్వీర్యం చేశారు. వైసీపీ సర్పంచులు, ఎంపీటీసీలకు కూడా గౌరవం లేదు, చేసిన పనులకు బిల్లులు లేవు. వైసీపీ పాలన అంతమవ్వాలని వైసీపీ సర్పంచులే అంటున్నారు. ప్రకాశం జిల్లాలో ఓ సర్పంచి జగన్ ని గెలిపించి పెద్ద తప్పు చేశామని బహిరంగంగా మీడియా ముందు చెప్పుతో కొట్టుకున్నాడు.

సర్పంచ్ లు తమ హక్కుల కోసం పోరాడాలి, లేదంటే ఆ పదవికి అన్యాయం చేసినవారవుతారు. జగన్ ఒక సైకో ఆ సైకోకు భయపడిపోతే రాష్ట్ర్రం నాశనమవుతుంది, ఎదురు తిరిగి పోరాటం చేస్తే ప్రజలు మీకు అండగా ఉంటారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కుల కోసం సర్పంచ్ లు పోరాటం చేయాలి,అక్రమ కేసులకు భయపడొద్దు, టీడీపీ మీకు అన్ని విధాల అండగా ఉంటుంది. టీడీపీ అధికారంలోకి వస్తే సర్పంచ్ లకు పూర్వ వైభవం తీసుకొస్తాం, నిధులు, విధులు ఇచ్చి మీ హక్కులు కాపాడుతాం. గ్రామంలో ఉన్న సహజవనరుల్ని కాపాడుకోవటం సర్పంచ్ ల బాధ్యత వైసీపీ నేతలు అక్రమంగా మైనింగ్ , ఇసుక తవ్వకాలు జరిపితే ఎక్కడిక్కడ అడ్డుకోవాలి. ఇష్టానుసారం ఇసుక తవ్వితే భూగర్జ జలాలు ఎండిపోయి పర్యావరణం ప్రమాదంలో పడుతుంది తద్వారా భవిష్యత్ తరాలు నష్టపోతాయి.

టీడీపీ హయాంలో పంచాయితీరాజ్ కి నరేగా నిధులు అనుసంధానం చేసి గ్రామాల్లో పంట కుంటలు తవ్వి భూగర్బజలాలు పెంచాం. వైసీపీ పంచాయితీ వ్యవస్ధను ఎలా దుర్వినియోగం చేసిందో ప్రజలను చైతన్యం చేయాలి. సర్పంచ్ లకు అన్ని విధాల అండగా ఉంటాం, టీడీపీ అధికారంలోకి రాగానే అన్ని పనులు చేయిస్తాం, పెండింగ్ బిల్లులు, నిధులు విడుదల చేస్తాం. వైసీపీ సర్పంచుల్ని కలుపుకుని ఛలో అమరావతి, ఛలో డిల్లీ, కలెక్టరేట్ల ముట్టడి వంటి కార్యక్రమాలు నిర్వహించండి. జగన్ రెడ్డి పంచాయితీ వ్యవస్ధను దుర్వినియోగం తీరు ప్రజలకు వివరించండి.

టీడీపీ వాలంటీర్లకు వ్యతిరేకం కాదు, వాలంటీర్లు ప్రజా సేవ చేస్తే స్వాగతిస్తాం, కానీ ప్రజాధనం జీతంగా తీసుకుంటూ వైసీపీకి సేవ చేయటం ఏంటి? అనుమతి లేకుండా ప్రజల ఇళ్లకు , ప్రవేట్ ఆస్తులు స్టిక్కర్లు అంటించటం నేరం. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న వాలంటీర్లు ఆ పని చేయటం ఇంకా పెద్ద నేరం. వాలంటీర్లు వైసీపీ స్టిక్కర్లు అంటిస్తే వీడియోలు తీసి ఎంపీడీవో, కలెక్టర్లకు ఫిర్యాదు చేయండి.

జగన్ వల్ల లాభపడినవారు వందల సంఖ్యలో ఉంటే నష్టపోయిన వారు కోట్ల సంఖ్యలో ఉన్నారు. నాలుగేళ్ల పాలనలో అన్ని వర్గాలు, అన్ని కులాల ప్రజలు నష్టపోయారు. జగన్ ఒక పెద్ద సైకో, ఆ సైకో మరికొంతమంది సైకోలను తయారు చేశారు. చైతన్య రధం పత్రికకు సీఐడీ నోటిలిచ్చారు, అసలు సీఐడీకీ ఏం సంబందం? పాదయాత్రలో మాట్లాడొద్దంటూ లోకేశ్ కి తాడిపత్రి డీఎస్సీ నోటిసులిస్తారా? ఎంత దుర్మార్గం. అడిగే వాళ్లు లేరని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రం అంధకారం కాకుండా ఉండేందుకు, రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు నేను పోరాటం చేస్తున్నా. వైసీపీ గ్రాఫ్ పడిపోయి టీడీపీ గ్రాఫ్ పెరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికలతోనే ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది పులివెందుల్లో సైతం రామ్ గోపాల్ భారీ మెజార్టీతో గెలిచారు. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేల్లోనే జగన్ పట్ల తిరుగుబాటు ప్రారంభమైందని, వచ్చే ఎన్నికల్లో టీడీపీదే విజయమని చంద్రబాబు నాయుడు అన్నారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *