
అసమానతలు తొలగించేందుకు అంబేద్కర్ కృషి : చంద్రబాబు నాయుడు
- Ap political StoryNewsPolitics
- April 15, 2023
- No Comment
- 33
సమాజంలోని అసమానతలను తొలగించడానికి అందరికీ ఆమోదయోగ్యమైన చట్టాలను రాజ్యాంగంలో పొందుపరిచిన మేధావి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితోనే తెలుగుదేశం పార్టీ దళితులకు అన్ని విధాలా ప్రాముఖ్యతనిచ్చింది. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులర్పించారు.
అంబేద్కర్ గొప్పదనాన్ని భావితరాలకు తెలియజేయాలనే ఆలోచనతో అమరావతిలోని దళితులు ఎక్కువగా వున్న శాఖమూరుని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దుతూ రూ.100 కోట్లతో 20 ఎకరాల్లో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం, లైబ్రరీ, పార్కుతో కూడిన అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటుకు ఆనాడు శ్రీకారం చుట్టాం పేద విద్యార్ధులకు విదేశీ విద్య అందించేందుకు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకాన్ని తీసుకొచ్చాం. ఏ ఊరిలో అభివృద్ధి పనులు చేపట్టినా వాటిని మొదటగా దళితవాడ నుంచి మొదలెట్టే సంప్రదాయాన్ని తెచ్చాం. ఇకముందు కూడా అంబేద్కర్ స్పూర్తితో దళిత సంక్షేమానికి టీడీపీ ఎప్పుడూ కట్టుబడి వుంటామని చెప్పారు.