నేను రైతుబిడ్డను.. రైతుకష్టం తెలిసినవాడిని అన్నదాతలతో ఆత్మీయ సమావేశంలో చంద్రబాబు

నేను రైతుబిడ్డను.. రైతుకష్టం తెలిసినవాడిని అన్నదాతలతో ఆత్మీయ సమావేశంలో చంద్రబాబు

టిడిపి మేనిఫెస్టో లో రైతుల సలహాలు, సూచనలు
వ్యవసాయంలో సాంకేతికత ఉపయోగించాలి
రైతు కల సాకారం చేసేవరకు విశ్రమించను
నరేగా పనుల్ని వ్యవసాయంతో అనుసంధానం
నా తండ్రి రైతు అయినందుకు నాకు గర్వంగా వుంది
……
నేను రైతుబిడ్డను, వ్యవసాయం తెలిసిన మనిషిని. రైతుల కష్టాలు నేరుగా చూసినవాడిని. మీకేం చేయాలో తెలిసినవాడిని. మా తండ్రి రైతు అయినందుకు నిజంగా గర్వపడుతున్నాను. ఆయన బాగా చదివించాడు కాబట్టే, ఉన్నత స్థానానికి రాగలిగాను అని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మార్కాపురం లో జరిగిన అన్నదాతల ఆత్మీయ సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులు అడిగిన పలు ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పారు. తన ఆలోచనలను రైతులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ “నేను రైతుబిడ్డను, వ్యవసాయం తెలిసినవాడిని, రైతుల కష్టాలు చూసినవాడిని. మీరు చెప్పే సలహాలు, సూచనలతో తెలుగుదేశం మేనిఫెస్టో ఉంటుంది.

పొలంబాట కార్యక్రమంతో అధికారుల్ని, ఎమ్మెల్యేలను రైతులవద్దకు పంపాను. ఈ ముఖ్యమంత్రి ఏనాడైనా ఒక్కరైతు ముఖమైనా చూశాడా? గడపదాటి బయటకు రాని ముఖ్యమంత్రి ఉండటం మన దౌర్భాగ్యం.” అని పేర్కొన్నారు. గ్రామాల్ని ప్రపంచానికి అనుసంధానం చేయడం ద్వారా రైతులు పండించే ఉత్పత్తుల్ని ఈ ట్రేడింగ్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అమ్ముకోవచ్చు. వ్యవసాయం లో సాంకేతికత ఉపయోగించాలి. భూమి ఎలాంటిది.. ఎలాంటి పంట వేయాలి.. ఎలాంటి ఎరువులు వేయాలో ఆలోచిస్తే, అలాంటి ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుంది. ప్రకృతి వ్యవసాయాన్ని రాష్ట్రంలో అమలు చేయడానికి రైతులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాము. మహారాష్ట్ర నుంచి సుభాష్ పాలేకర్ ను పిలిపించి, రైతులకు ఉపయోగపడే సూచనలు, సలహాలు ఇప్పించాము అని చెప్పారు.

రైతుల సమస్యల పై శ్రద్ధ పెట్టాను కాబట్టే, వారికి నీటివసతి కల్పించడమే ప్రధాన ఉద్దేశ మని భావించి, నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాను. వ్యవసాయ రంగం లో ఆధునికీకరణ కోసం హార్వెస్టర్లు, స్ప్రింక్లర్లు, ట్రాక్టర్లు, ఇతరత్రా యంత్రపరికరాలు సబ్సిడీ పై అందించాము. రైతులు వారి ఉత్పత్తుల్ని నిల్వ చేసుకోవడానికి కోల్డ్ స్టోరేజ్ లు ఏర్పాటు చేయించామన్నారు. యాప్ లసాయంతో ట్యాక్సీలు, బైక్ లను బుక్ చేసుకొని సురక్షితంగా గమ్య స్థానాలకు చేరినట్టే, రైతులుకూడా వారు పండించే ఉత్పత్తుల్ని మార్కెట్ చేసుకోవడానికి, మంచి ధరకు అమ్ముకోవడానికి కొనుగోలుదారులతో నేరుగా కనెక్ట్ కావొచ్చు. ఫోన్ లోని యాప్ తో మీ వద్ద ఉంటే యంత్రాలు, ట్రాక్టర్లను కూడా ఇతరులకు అద్దెకు ఇవ్వొచ్చు.

తగినరుసుం వసూలు చేయవచ్చు అని చెప్పారు. అలానే విపరీతమైన పురుగుమందుల వాడకంతో రైతులు నష్టపోతున్నారు. ఎలాప డతే అలా పురుగు మందులు పిచికారీ చేయడం వల్ల పంటలకు నష్టం కలుగుతోంది. డ్రోన్లతో పంటలకు వచ్చిన తెగుళ్లు, పురుగుల్నికనిపెట్టి, వాటిసాయంతోనే పురుగు మందుల్ని చల్లితే చాలావరకు రైతులకు మేలుకలుగుతుందన్నారు.ఏ పంట పండించాలి? ఏ నేలలో ఏ పంట అయితే బాగా పెరుగుతుంది? కాలానుగుణం గా ప్రజల అవసరాలకు తగినట్టు ఏపంటలు పండించాలనే ఆలోచన రైతులు చేయాలి . దానికి తగిన అధ్యయనంచేసి, మీకున్న భూముల్లో ఏ పంటలు వేస్తే, మీకు ఆదా యం పెరిగి మీరు సంతోషంగా ఉంటారో ఆలోచిస్తున్నాను. ఏ రైతు ఇబ్బంది పడకూడ దు అన్నదే నాఆలోచన. దానికి అనుగుణంగా మీ ఆలోచనల్లో మార్పురావాలి అని సూచించారు. ఒక పని అనుకుంటే దాన్ని సాకారం చేసేవరకు నేను నిద్రపోను. ఆ విషయం మీకు కూడా తెలుసు. హైదరాబాద్ నగరాన్ని ఎలా మార్చానో మీరుచూశారు. 25 ఏళ్లలోనే ప్రపంచంలోనే ఎక్కువ మంది కోటీశ్వరులు ఉండే నగరంగా హైదరాబాద్ మారిందంటే తెలుగుదేశం ముందుచూపే కారణం అని పేర్కొన్నారు.

మోటార్లకు మీటర్ల తో రైతుల మెడకు ఉచ్చు

మీ చుట్టూ ఉండే వారిపిల్లలే ప్రపంచంలో వివిధ రంగాల్లో రాణిస్తున్నారు. ఒకప్పుడు రోడ్లు సరిగా లేని ప్రాంతాలు నేడు అభివృద్ధి చెందాయి. కరెంట్ ఉత్పత్తికి బొగ్గు, నీరే కాకుండా ఎండను వినియోగిస్తున్నాం. అదే ఆలోచనతో మీ పొలాల్లో మీరు ఎండద్వా రా కరెంట్ ఉత్పత్తిచేసుకునేలా ఫ్రీగా సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేయించాను. కానీ మీరు ఒక్కఛాన్స్ అన్న వాడిని నమ్మి మోసపోయారు. ఇప్పుడు మీ పొలాల్లోని నీటి మోటార్ల కు మీటర్లు పెడుతున్నాడు. మీ మెడలకు ఉచ్చు బిగిస్తున్నాడు అని చంద్రబాబు హెచ్చరించారు. రైతులకు పంటలబీమా ఉండేది. దానికి సంబంధించిన సొమ్ములో కొంత కేంద్రం కడితే మిగిలింది రాష్ట్ర ప్రభుత్వం, రైతులు కట్టేవారు. పంటలు నష్టపోతే, ఆ సొమ్ము మీకు వస్తుందనే నమ్మకం ఉండేది. కానీ ఈముఖ్యమంత్రి పంటలబీమా సొమ్ముకట్టకుండా కట్టానని అసెంబ్లీ లోనే అబద్దాలు చెప్పాడు. మొట్ట మొదటి సారి రైతుల కోసం నాజీవి తంలో అసెంబ్లీలోని పోడియం వద్ద నేలపై కూర్చున్నాను.

పంటల బీమా సొమ్ము కట్ట ని ప్రభుత్వ డొల్లతనాన్ని బయటపెట్టాను. జగన్ నోరువిప్పితే అబద్ధమే. ఎవరైనా ప్రశ్నిస్తే దౌర్జన్యమే అని ఆవేదన వ్యక్తం చేశారు. 1995లో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఆదాయం లేదు. జీతాలు ఇవ్వ లేని పరిస్థితి. అలాంటిరాష్ట్రాన్ని బాగుచేయడంకోసం 9 ఏళ్లు కష్టపడ్డాను. దానిఫలితమే రాష్ట్రం విడిపోయినా, హైదరాబాద్ లాంటి నగరం మనముందు ఉంది. అమరావతి నిర్మాణం కోసం రైతులు స్వచ్ఛందంగా 34వేలఎరాలు ఇచ్చారు. దాన్ని నిర్మించడం చేతగాని ముఖ్యమంత్రి కులం, ప్రాంతం అని విద్వేషాలు రాజేశాడు. శ్మశానమని, ఎడారని, నిర్మాణాలకు పనికిరాదని విష ప్రచారం చేసి, బంగారం లాంటి నగరాన్ని నాశనం చేశాడు. ప్రజల కోసం నిర్మించాలనుకున్న ప్రజా రాజధాని అమరావతిని పాడుచేశాడు అని ఆరోపించారు.

ప్రజల కోసం, రాష్ట్రం కోసం భూములిచ్చిన రైతులపై తప్పుడు కేసులు పెట్టి, వారిని వేధిస్తున్నాడు. ప్రశ్నించిన వారిని జైళ్లకు పంపుతున్నాడు. ఆఖరికి బాబాయ్ ని చంపి, ఎన్నివిన్యాసాలు చేస్తున్నాడో చూస్తున్నారు కదా! ఏంటీ అరాచకం…ఎన్నాళ్లు ఇలా? గొర్రె కసాయిని నమ్మినట్టు నరహంతకుడిని నమ్మితే ఏమవుతారు? అని ప్రశ్నించారు. రాష్ట్రం పై రూ.10లక్షలకోట్ల అప్పుఉంది. అదంతా జగన్మోహన్ రెడ్డో, నేనో తీర్చము. మీరే తీర్చాలి. ఆ భారం మీ పైనే పడుతుంది. పరిపాలించే వాళ్లు శాశ్వతం కాదు.. సమాజం..రాష్ట్రం శాశ్వతమనే ఆలోచన లేని వ్యక్తి జగన్. అందుకే అన్నివర్గాల ప్రజ లు బాధ పడుతున్నారన్నారు. మీరు చెప్పిన ప్రతిఅంశాన్ని గుర్తుపెట్టుకుంటాను.

వచ్చే టీడీపీప్రభుత్వం రైతుకు అండగా ఉండటానికి ఏంచేయాలో అవన్నీచేస్తుందని హామీ ఇస్తున్నాను. రైతుల జీవి తాలు ఆనందంగా ఉండేలా, రైతుల రాజుల్లా బతికేలా ఏంచేయాలో చేస్తాను. మీరు కూడా చర్చించండి. నరేగాపనుల్ని వ్యవసాయానికి అనుసంధానంచేస్తే, కూలీల బాధ రైతులకు ఉండదని, కూలీలకు కూడా ఉపాధి దొరుకుతుందని ఆలోచించాను. నరేగా పనుల్ని వ్యవసాయానికి కచ్చితంగా అనుసంధానించాలి అని అభిప్రాయపడ్డారు. మీరు ఇచ్చిన సలహాలు, సూచనల్ని పరిగణనలోకి తీసుకొని ఎన్నికల మేనిఫెస్టోలో పెడతాం. మెరుగైన వ్యవసాయ విధానాలతో మీ జీవితాల్ని మార్చే బాధ్యత నాదే అని హామీ ఇచ్చారు.

అందకుండా అడ్డుకుంటున్నారు

రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయాక, రాష్ట్రం ఆర్థిక లోటులో ఉంది. అయినా కూడా రైతులకు ఒక్కొక్కకరికి రూ.లక్షా50వేల రుణమాఫీ చేసింది. ఏపీలోని రైతులకు ఒకేసారి రూ.50వేలరుణాన్ని మాఫీచేసింది తెలుగుదేశం ప్రభుత్వం. జగన్ ఈ ఐదేళ్ల లో రూ.7వేలచొప్పున మీకు ఇచ్చేది కేవలం రూ.35వేలు మాత్రమే. తొలిసారి మొత్తం రూ.50వేల రుణమాఫీచేసి, తరువాత మరలా ‘అన్నదాతా సుఖీభవ’ కింద 4, 5వ విడతల కింద ఒక్కోరైతుకి రూ.లక్షా50వేలు ఇస్తే, ఈదుర్మార్గుడు వచ్చి మీకు అంద కుండా అడ్డుకున్నాడు అని చంద్రబాబు చెప్పారు. రైతులకు భూసారపరీక్షలు అందుబాటులోకి తెచ్చాము. సబ్సిడీ పై ఎరువులు, పురుగమందులు, యంత్రపరికరాలు, డ్రిప్ పరికరాలు, ట్రాక్టర్లు ఇచ్చాము. గిట్టుబాటు ధర అమలుచేశాం. ప్రతి మంగళవారం ‘పొలంబాట’ కార్యక్రమం తో రైతుల వద్దకు అధికారుల్ని, ఎమ్మెల్యేలను పంపించాను. ఈ ముఖ్యమంత్రి ఏనాడైనా ఒక్క రైతు ముఖమైనా చూశాడా? గడపదాటి బయటకు రాని ముఖ్యమంత్రి ఉండటమే మన దౌర్భాగ్యం అని పేర్కొన్నారు.

రైతులతో ముఖాముఖి

ప్రశ్న-1 : మీనాన్నగారు రైతు. వ్యవసాయాన్ని వృత్తిగా ఎన్నుకోవాలని మీకుఎప్పుడైనా అనిపించిందా? (సత్యం- కనిగిరి)

జవాబు : ఒకప్పుడు రైతుకి గౌరవం మర్యాద ఉండేవి. రైతులు కష్టపడితేనే ప్రజల కడుపు నిండుతుంది. అప్పట్లో మెజారిటీశాతం ప్రజలు వ్యవసాయం పైనే ఆధారపడే వారు. మా నాన్న వ్యవసాయం చేసేటప్పుడు కరెంట్ కూడాలేదు. ఊటకాల్వల నుంచి వచ్చే నీటితో పంటలు పండించేవారు. అప్పట్లో రైతాంగం చాలా కష్టపడేది. మా తండ్రిగారు చెరకు పండించేవారు. ఒక్కోసారి బాగా లాభాలు వచ్చేవి, ఒక్కోసారి అసలు కొనేవారు ఉండేవారు కాదు. మాతండ్రి రైతు అయినందుకు నిజంగా గర్వ పడుతున్నాను. ఆయన బాగా చదివించాడు కాబట్టే, ఉన్నత స్థానానికి రాగలిగాను. రైతులు, రైతుకూలీలు వారిపిల్లల్ని బాగా చదివించాలి. రైతు కుటుంబంలోని వారికుండే తెలివితేటలు, శక్తి సామర్థ్యాలు, వినియోగిస్తే మనదేశం ప్రపంచం లోనే నెంబర్ 1 గా నిలుస్తుంది.

ప్రశ్న-2 : మెట్టభూముల కోసం నీటిని సద్వినియోగం చేసుకునేలా డ్రిప్ విధానాన్ని తీసుకొ చ్చారు. జగన్ వచ్చాక అది లేకుండా పోయింది. వ్యవసాయాన్ని నాశనం చేసిన దుర్మార్గుడు జగన్. వెలిగొండప్రాజెక్ట్ పూర్తి చేస్తేనే మా ప్రాంతం బాగుపడుతుంది. అపరాలు కొనేవారు లేరు సార్.. ఎరువలధరలు పెరిగాయి. పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి సార్. (కీలం ఇంద్రభూపాల్ రెడ్డి, కనిగిరి నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు)

ప్రశ్న-3 : మీరు అధికారంలోకి రాగానే వీఆర్వో వ్యవస్థను రద్దు చేయాలి సార్. ఎమ్మార్వోలు, కలెక్టర్లు నేరుగా రైతుల వద్దకు వచ్చి వారి సమస్యలు పరిష్కరించేలా చేయాలి సార్? సమస్య ల పై స్పందించే వారు లేనప్పుడు స్పందన కార్యక్రమం ఎందుకు సార్?  50 ఏళ్లుదాటిన రైతుల కు రైతు పింఛన్ ఇప్పించండి సార్. జీతాలులేకుండా కష్టపడుతున్నది రైతులు మాత్రమేసార్. మీరు అధికారంలోకి వచ్చాక ఈ ముఖ్యమంత్రి లాగా ప్రధాని ఇచ్చే సొమ్ముతో కలిపి రైతు భరోసా ఇవ్వకుండా, పెట్టుబడి రాయితీ కింద ప్రతి రైతుకి రూ.25 వేలు ఇవ్వండి సార్. (బొగ్గు రామిరెడ్డి-మార్కాపురం)

జవాబు (రెండు ప్రశ్నలకు కలిపి) : మార్కాపురం నియోజకవర్గంతో పాటు, రాష్ట్రంలోనే పాలి చ్చే గేదెను కాదనుకొని, తన్నే దున్నపోతుని తెచ్చుకున్నారు. రైతుకి 5 ఏళ్ల పాటు ప్రతిఏటా వారిఆదాయం పెంచాను. సాగునీటి రంగానికి రూ.65 వేల కోట్లు ఖర్చు పెట్టాం. రూ.1500 కోట్లతో వెలిగొండను 95 శాతం పూర్తి చేశాను. తెలుగుదేశం ప్రభుత్వం మరలా వచ్చి ఉంటే 2020 నాటికి ఈ ప్రాంతం మొత్తం సస్యశ్యామలం అయ్యేది. ఈ ప్రాంతానికి నేను 1995లో వచ్చినప్పుడు నీళ్లు కావాలని అడి గారు. మీకు ఇవ్వడానికి నీళ్లు ఎక్కడున్నాయని అడిగాను. అప్పుడు రైతులు వరదలు వచ్చినప్పుడు మీరునీళ్లిస్తే, చెరువుల్లో నింపుకుం టామన్నారు.

అందుకే వెలిగొండ నిర్మాణం ప్రారంభించాము. నేను ప్రారంభించిన వెలిగొండను ఏ ప్రభుత్వాలు పూర్తి చేయలేదు. 2014లో ముఖ్యమంత్రి అయ్యాకే, పనులు వేగంగా పూర్తి చేసి, ప్రాజెక్ట్ ను 95శాతం పూర్తి చేయించాను. అంత పని చేసిన పార్టీకి మీరు ఓటేయ లేదు. 5ఏళ్లలో 5శాతం పనులు చేయలేని దద్దమ్మను చూసి భాదపడుతున్నారు. రైతుల ఖర్చులు తగ్గి, ఆధునిక వ్యవసాయ పద్ధతులతో వారి ఆదాయం పెరగాలనే, ఇజ్రాయెల్ సాంకేతికతతో డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చాము. 90శాతం సబ్సిడీపై మైక్రోన్యూట్రియంట్స్ ఇచ్చాము. భూసార పరీక్షలు చేయించాము. జీరో బడ్జెట్ తో ప్రకృతి వ్యవసాయం ప్రోత్సహించాము. గోదావరి డెల్టా లో ఆక్వాసాగుని ప్రోత్సహించాము.

ఇప్పుడు ధాన్యం కొని రైతులకు డబ్బులు ఇవ్వడంలేదు. పంటలు నష్టపోయిన వారికి ఆర్థిక సాయం చేయడం లేదు. తాము గర్వంగా, గొప్పగా వ్యవసాయ చేయగలమని రైతులు అనుకు నేలా చేస్తాను. జగన్మోహన్ రెడ్డి అనే సైకో వచ్చాక ఏంజరుగుతుందో మీరే ఆలోచించాలి. అతని ఆదాయం పెరిగింది, రైతుల అప్పులుపెరిగాయి. రాష్ట్రంలోని ప్రతి రైతు పై రూ.2.45 లక్షల అప్పుఉంది. జగన్మోహన్ రెడ్డి తనపక్కునున్న వారిని ధనవంతుల్ని చేస్తున్నాడు. కానీ నేను పేదల్ని కోటీశ్వరుల్ని చేయాలి, రైతు రాజుగా బతకాలని ఆలోచిస్తున్నాను. హైదరాబాద్ చుట్టు పక్కల ఒకప్పుడు ఎకరం రూ.లక్షలోపు మాత్రమే ఉండేది. ఈరోజు ఎకరం రూ.100 కోట్లు అమ్ముతోంది. హైదరాబాద్ వల్లే తెలంగాణ మారుమూల ప్రాంతాల్లోని భూముల ధరలు పెరిగాయి. పరిశ్రమలు, రోడ్లు, మౌలిక వసతులు కల్పిస్తేనే భూముల ధరలు పెరుగుతాయి. అనంతపురం జిల్లాలో కియా పరిశ్రమ రాకముందు అక్కడ ఎకరం భూమిధర రూ.20వేలు, రూ.30వేలు ఉండేది. నీళ్లు తీసుకెళ్లి కియా పరిశ్రమను ఏర్పాటు చేశాక ఎకరం ధర రూ.కోటి, రూ.2కోట్లు అమ్ముతోంది. వ్యవసాయం చేయడం కాదు.. దాని కోసం రైతులకు తగిన భరోసా ఉండాలి.

పిల్లల చదువులు, వ్యవసాయంలోని కూలీలకుఎక్కువ ఖర్చు అవుతోంది. పిల్లల్ని చదివించే పరిస్థితి కూడా రైతులకులేదు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తై, నదుల అనుసంధానం జరి గి వెలిగొండ పూర్తై ఉంటే మీ జీవితాలే మారిపోయేవి. అదే అభివృద్ధి. కానీ ఈ సైకో ఏంచేశాడు ? రైతులు ఎవరైనా జగన్ ను ప్రశ్నించే స్థితిలో ఉన్నారా? రూ.12,500లు ఇస్తానన్న పెద్దమ నిషి రూ.7వేలు ఇస్తుంటే ప్రశ్నించరు. మీ సమస్యల పై నాకు అవగాహన ఉంది. మీ జీవితా ల్ని బాగు  చేసే వరకు ప్రతి రైతుకి అండగా ఉంటానని హామీ ఇస్తున్నాను.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *