నాయకుడు అంటే ….

నాయకుడు అంటే ….

వైసీపీ మహిళా రైతుకు చంద్రబాబు సహాయం
వైసీపీని గెలిపించి తప్పుచేశానని విలపించిన మహిళా రైతు
ఆడబిడ్డ చదువుకోసమే సాయం చేశానన్న చంద్రబాబు
టిడిపి అధికారంలో వుంటే ఇంత కష్టం వచ్చేది కాదు
ఉంగుటూరు నియోజకవర్గంలో పంటపొలాలు పరిశీలన

నాయకుడు అంటే కేవలం రాజకీయాలలో అధికారం అనుభవించే వాడే కాదు. అధికారంతో నిమిత్తం లేకుండా ప్రజల కష్ట సుఖాలలో పాలుపంచుకునే వాడే అసలైన నాయకుడు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి ‘ నాయకుడు ‘ అన్న పదానికి నిలువెత్తు నిదర్శనంలా నిలిచారు. అకాల వర్షానికి పంట మొత్తం కోల్పోయి రోడ్డున పడ్డ వైసీపీ కార్యకర్తకు చంద్రబాబు చేయూత నిచ్చిన వైనం అందర్నీ కదిలించివేసింది. వైసీపీ కి చెందిన మహిళా రైతు ప్రభావతి చంద్రబాబు ముందు తన ఆవేదన వెళ్లబోసుకుంది. ఆరుగాలం కష్టించి పండించిన పంట అంతా అకాల వర్షాలకు నాశనం అయిందని, ధాన్యం తడచి పోయిందని, రేపు తన కుమార్తెకు పరీక్ష వున్నదని, చేతిలో చిల్లిగవ్వ లేదని ప్రభావతి, చంద్రబాబు ముందు ఆవేదన వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మేల్యేలు ధాన్యం తడిచిపోయినా తమను పట్టించుకోలేదని ఆమె చెప్పారు. ఆ మహిళా రైతు కష్టాన్ని చూసి చలించిన చంద్రబాబు అక్కడికక్కడే రూ. 2.30 లక్షల ఆర్ధిక సహాయం అందచేశారు. ఊహించని విధంగా చంద్రబాబు తనకు అక్కడికక్కడే సహాయం చేయటంతో ఆ మహిళా రైతుకు నోటివెంట మాట రాలేదు. వైసీపీ గెలుపుకోసం కృషిచేసి తాను తప్పు చేశానని ప్రభావతి కన్నీటి పర్యంతం అయ్యారు. చంద్రబాబు చేసిన సాయానికి తాను వైసీపీ కండువాను తీసేసి తక్షణమే తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకుంటానని ప్రభావతి వెల్లడించారు.

నేను పార్టీలు చూడను .. చందబాబు

“సాయం చేసేప్పుడు నేను పార్టీలు చూడను. జూలపల్లి ప్రభావతి గతంలో వైసీపీ కోసం ప్రయత్నం చేసింది. అయినా ఆడబిడ్డ చదువుకోసం నేను సాయం చేశాను.” అని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఒక ప్రభుత్వం బాధ్యత గా ఉండాలి. కానీ ఈ ప్రభుత్వం ఇలాగేనా వ్యవహరించేది. నిండా మునిగాను ఆదుకోండి అని ప్రభావతి అడిగింది అని చెప్పారు. టీడీపీ అధికారం లో ఉండి ఉంటే ఇంత కష్టం ఉండేది కాదన్నారు. వర్షాలపై అలెర్ట్ చేసేందుకు ప్రభుత్వ శాఖలు ఉన్నాయి.

అసమర్థ దద్దమ్మ సీఎం ఉంటే పరిస్థితి ఇలాగే ఉంటుంది. నాడు హుద్ హూద్ వస్తే హైదరాబాద్ నుంచి నేరుగా వెళ్ళాను. ఫ్లైట్ వెళ్లదు అంటే రోడ్డు మార్గం లో విశాఖ వెళ్ళాను. అది నా పట్టుదల. సీఎంగా నేడు జగన్ కు బాధ్యత లేదా ఎందుకు రైతుల దగ్గరకు సీఎం రాలేదు. అని చంద్రబాబు ప్రశ్నించారు. సివిల్ సప్లై కార్పొరేషన్ కొత్తగా పెట్టమా? ఏప్రిల్ మొదటి నుంచే ధాన్యం సేకరణ జరగాలి, కానీ జరగలేదు. రైతులకు గోనె సంచులు ఇవ్వలేని అసమర్ద ప్రభుత్వం ఎందుకు? ఈ సీఎం ఒక్క పొలంలో అయినా దిగాడా? ఈ సీఎం సిగ్గులేకుండా 5 ఏళ్ల క్రితం మేం చేసిన వాటికి మళ్లీ శంకుస్ధాపన చేస్తున్నారు అని చంద్రబాబు ధ్వజమెత్తారు.

అకాలవర్షాలకు దెబ్బతిన్న పంటపొలాలను పరిశీలించేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికి చంద్రబాబు గురువారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు వెళ్ళి ఉంగుటూరు నియోజకవర్గంలో రైతులను స్వయంగా పరామర్శించారు. రైతులంతా చందబాబు ను చూడగానే ఒక్కసారి కన్నీటి పర్యంతమై తమ బాధనంతా చెప్పుకున్నారు. తడిచిన ధాన్యాన్ని చంద్రబాబుకు చూపుతూ భోరున విలపించారు. ధాన్యం సేకరణకు సంచులు సైతం ఇవ్వలేదని రైతులు ఆరోపించారు.

Related post

నెల్లూరులో నారాయణ పూజలు

నెల్లూరులో నారాయణ పూజలు

నెల్లూరు నగరంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నగర ఇన్‌చార్జ్‌ ,మాజీమంత్రి పొంగూరు నారాయణ, సతీమణి రమాదేవి కలిసి పలు చోట్ల.. వినాయక స్వామివారిని…
పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

టీడీపీ ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంది. కానీ, వాటన్నంటినీ ఎదుర్కొని పార్టీని సమర్థవంతంగా ముందుండి నడిపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. కానీ, ఇప్పుడు ఆయనకే కష్టం వచ్చింది. అక్రమ అరెస్ట్…
చంద్ర‌బాబుకు అండ‌గా నిలుద్దాం..  విడుదల అయ్యేంత వరకు పోరాటం

చంద్ర‌బాబుకు అండ‌గా నిలుద్దాం.. విడుదల అయ్యేంత వరకు పోరాటం

నాలుగున్నర దశాబ్దాల పాటు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవినీతికి తావు లేకుండా.. టీడీపీ అధినేత చంద్రబాబు పరిపాలన చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం.. నిరంతరం అభివద్ధే ధ్యేయంగా పని చేసిన చంద్రబాబుపై…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *