సమిష్టి కృషితో రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దుదాం బీసీల ఆత్మీయ సమావేశంలో చంద్రబాబు పిలుపు

సమిష్టి కృషితో రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దుదాం బీసీల ఆత్మీయ సమావేశంలో చంద్రబాబు పిలుపు

పేదల కలల్ని నిజం చేయటమే నా ధ్యేయం
బీసీలు లేకపోతే టిడిపి లేదు
సిఎం భజనకే పరిమితం అయిన ఫెడరేషన్ లు
బిసిల్లోని 140 కమిటీలకు రాజకీయ, ఆర్ధిక ప్రాధాన్యత
వైసీపీని, జగన్ ని ఇంటింటికి తిరిగి ఉతికి ఆరేయాలి

వెనుకబడిన తరగతుల వారు ఎవరూ అధైర్యపడవద్దు. తెలుగుదేశంపార్టీ మీకు ఎప్పుడూ అండగా ఉంటుంది. సమిష్టిగా పనిచేసి మనరాష్ట్రాన్ని నంబర్-1గా నిలుపుదాం. పేదల్ని ధనికుల్ని చేయాలన్న నా ఆలోచనలో నా మొదటి ప్రాధాన్యత వెనుకబడినవర్గాలకే అని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా సత్తెనపల్లిలో గురువారం నిర్వహించిన బడుగు బలహీన వర్గాల ఆత్మీయ సమావేశంలో చంద్రబాబు ప్రసంగించారు. పలువురు బీసీ సంఘాల నాయకులు సమావేశంలో వారి సమస్యలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. బీసీ ల సమస్యలపై చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. పేదల్ని ధనికుల్నిచేయాలన్న నా ఆలోచన నిజం చేస్తాను. దానికోసమే ‘ పి-4’ విధానం తీసుకొచ్చాను. ‘ పి-4’ లోని నాలుగు ‘పీ’ లు ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థలు, ప్రైవేట్ వ్యక్తులు, ప్రజలు. వీరి పార్టనర్ షిప్ తోనే పేదరికనిర్మూలన సాధ్యం. ప్రతివ్యక్తిని కోటీశ్వరుడిని చేయాలన్నది నాకల. తాముకూడా అందరితో సమానంగా పైకిరావాలని పేదలు కలలు కంటారు. ఆ కలలు నిజంకాకూడదా? అని చంద్రబాబు ప్రశ్నించారు.

తెలుగుదేశంపార్టీ పెట్టక ముందు, పెట్టాక బీసీల పరిస్థితి ఏమిటో మీరే ఒకసారి మనస్ఫూర్తిగా బేరీజు వేసుకోవాలి. బీసీలను రాజకీయంగా వృద్ధిలోకి తీసుకొచ్చింది ఎన్టీఆర్. బీసీలకు 24శాతం రిజర్వేషన్లు ఇచ్చి, వారిని రాజకీయంగా ప్రోత్సహించారని చెప్పారు. తెలుగుదేశంపార్టీకి బడుగు, బలహీన వర్గాలే వెన్నెముక అనడంలో ఎలాంటి సందేహంలేదు. ఎంతమంది వచ్చి ఎన్నిమాయమాటలుచెప్పి, కుప్పిగంతులు వేసి నా చివరకు బీసీల్ని ఆదుకునేది, వారికి అండగా ఉండేది తెలుగుదేశమే అని స్పష్టం చేశారు. కింజరాపు ఎర్రన్నాయుడి నుంచి దేవేందర్ గౌడ్, కే.ఈ.కృష్ణమూర్తి, యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, రామ్మోహన్ నాయుడు, కొల్లు రవీంద్ర లాంటి వందలకొద్దీ నాయకుల్ని తయారుచేసింది తెలుగుదేశంపార్టీనే అని చెప్పారు.

సబ్ ప్లాన్ తీసుకొచ్చి వెనుకబడిన వర్గాలకు రూ.36వేలకోట్లు ఖర్చుపెట్టింది తెలుగుదేశం పార్టీ. సబ్ ప్లాన్ కాకుండా, కులవృత్తులు, చేతివృత్తులకు అండగా నిలవడానికి ఆదరణ పథకం తీసుకొచ్చాము. ఆధునికమైన పనిముట్లు, యంత్రాలు అందించామన్నారు. వెనుకబడిన వర్గాలు లేకపోతే తెలుగుదేశంపార్టీ లేదు. జనాభాలో 50శాతం కంటే ఎక్కువ ఉన్న బీసీలకోసం తెలుగుదేశం అనునిత్యం పనిచేస్తుంది. కొల్లురవీంద్రను టీడీపీ బీసీసెల్ అధ్యక్షుడిగా నియమించాం. కులాలవారీగా సాధికారకమిటీలు వేశామన్నారు. వైసీపీ వేసిన కార్పొరేషన్లు ఎవరికోసమో, ఎందుకు పనికొస్తాయో చెప్పాలని సవాల్ చేస్తున్నా. 5ఏళ్లల్లో ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి తానువేసిన ఫెడరేషన్లతో ఎంతమంది బీసీల తలసరి ఆదాయంపెంచాడో చెప్పాలని సవాల్ చేస్తున్నా. తెలుగుదేశం ప్రభుత్వం బీసీలకు ఇవ్వడానికి తీసుకొచ్చిన పనిముట్లు, పరికరాలు, యంత్రాలను తుప్పుపట్టేలా చేసిన పార్టీ వైసీపీ. వైసీపీ ప్రభుత్వం వేసిన ఫెడరేషన్లు ముఖ్యమంత్రి భజనకే పరిమితమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలోని ఆస్తులన్నీ దోచుకొని తానొక్కడే లక్షలకోట్లు సంపాదించుకోవాలన్నదే జగన్ ఫిలాసఫీ. ఆయన వేసే ఎంగిలిమెతుకులకోసం ప్రజలు ప్రతిరోజు ఎదురు చూడాలి. ఇదెక్కడి న్యాయం? 2004లో జగన్ ఆస్తిఎంత? 2023లో ఆయన ఆస్తి ఎంత? రూ.43వేలకోట్లు దోచుకుంటే సీబీఐ, ఈడీలు ఛార్జ్ షీట్లు వేశాయి. అంతచేసి కనీసం ఇప్పటికీ మారలేదు. పేదవాళ్ల అవకాశాలు, వారిసంపద దోచుకునే వ్యక్తి జగన్ అని చంద్రబాబు విమర్శించారు. బీసీల్లో చాలామంది నిర్మాణరంగంపై ఆధారపడి బతుకుతున్నారు. జగన్ కొత్త ఇసుక పాలసీ వల్ల 50లక్షల కుటుంబాలు రోడ్డునపడ్డాయి. సమాధానం చెప్పే ధైర్యం ఈ ముఖ్యమంత్రికి ఉందా? దేవుడిచ్చిన సహజవనరుల్నికూడా దోచేస్తున్న వ్యక్తి జగన్. 5ఏళ్లలో భూదోపిడీ, ఇసుకదోపిడీ, మద్యంపైదోపిడీ. అవిచాలవన్నట్టు ప్రజల ఆస్తులు రాయించుకునే స్థితికి వచ్చాడు. తుపాకీ చూపి బెదిరించి ఆస్తులుకొట్టేస్తున్నారని ఆరోపించారు. రూ.510కోట్లతో దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రిగా జగన్ నిలిచాడు.

ఆయన పాలనలో బీసీల ఆస్తులు, ఆదాయం పెరిగిందా? రూ.5లక్షలకోట్ల భారాన్ని బాదుడేబాదుడు అంటూ ప్రజలపై వేశాడు. రూ.10లక్షలకోట్లఅప్పులు రాష్ట్రంపై వేశా డు. అమ్మఒడి, వసతిదీవెన, విద్యాదీవెన కంటే మెరుగ్గా నాన్నబుడ్డి అమలు చేస్తున్నాడని విమర్శించారు. మీ పిల్లల్ని చదువులకోసం ఉద్యోగాలకోసం విదేశాలకుపంపించిన ఘనత తెలుగుదేశానిదే. సత్యనాదెళ్ల తండ్రి యుగంధర్ నావద్ద పనిచేశాడు. మీ పిల్లలు సత్యనాదెళ్లలా మారాలి అని అంటే సరిపోదు. చేతల్లో చూపించాలి. తెలుగువాడికి నేను ఇచ్చిన ఆయుధం ఐటీ. ఆ ఐటీరంగాన్ని నమ్ముకునే సత్యనాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈవో అయ్యా డని చెప్పారు.

ఎవరు ఔనన్నా, కాదన్నా సైబరాబాద్ నిర్మించి, హైదరాబాద్ ను ప్రపంచపటంలో నిలిపింది తెలుగుదేశంపార్టీనే. దానికంటే మంచి విజన్ తో ఇక్కడి వనరుల్ని ఉపయోగించుకొని అభివృద్ధి చేయాలని చూశాను. అమరావతి, పోలవరంతో పాటు ప్రపంచమంతా తిరిగి పరిశ్రమలు తీసుకొచ్చాను. కానీ మీరు కసాయివాడిని నమ్మి, రాష్ట్రాన్ని దుర్మార్గుడికి అప్పగించారు. తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ 1 గా ఉంటే, ఏపీ ఆఖరిస్థానంలోఉంది అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. 54 సాధికారకమిటీలు, 144కులాలు, కులసంఘాలు, కులసంఘాల నేతలు అందరూ ఆలోచించాలి.

ఎక్కడికి వెళ్లినా ఈ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూనే, నాఆలోచనల్ని అందరితో పంచుకోండి. మీ ఆలోచనలు నాతో పంచుకోండి. రాష్ట్రానికి, ప్రజలకు సంపదసృష్టించి, అభివృద్ధి చేయడమే నాకు తృప్తినిస్తుంది. జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని దోచుకొని ధనవంతుడు కావాలి అనుకుంటున్నాడు. మిమ్మల్ని ధనవంతుల్ని చేయాలని నేను అనుకుంటున్నాను. ప్రజలు బాగుండాలనే తపన నాయకుడికి ఉంటేనే మీరు బాగుపడతారు. బీసీల్లోని 140 కమిటీలకు రాజకీయంగా, ఆర్థికంగా ప్రాధాన్యత ఇచ్చేబాధ్యత నాదిఅని చంద్రబాబు హామీ ఇచ్చారు.

చెరువుల్లో బట్టలుఉతుక్కునేలా చేయడమేగాక, ప్రత్యేకంగా దోబీఘాట్ లు ఏర్పాటు చేసింది తెలుగుదేశంపార్టీ. మంచి ఆధునికమైన లాండ్రీలు ఇచ్చి, ఉచిత విద్యుత్ అం దించాము. రజకుల చెరువుల్ని ఆక్రమించిన వారిని వదిలిపెట్టను. వాటిని తిరిగి వారికే అప్పగిస్తాం. బట్టల మురికి ఎలాగైతే తొలగిస్తారో, వైసీపీని, జగన్ ని ఇంటింటికీ తిరిగి ఉతికి ఆరేయండి. ఆడబిడ్డలపై దాడులు, అత్యాచారాలు జరక్కుండా కఠినంగా వ్యవహరిస్తాను అని చంద్రబాబు హామీ ఇచ్చారు.

తెలుగుదేశం ప్రభుత్వం 36,90,412 మందికి బీసీ విద్యార్థులకు, రూ.5,842కోట్ల స్కాల ర్ షిప్పులు ఇచ్చింది. 2,816 మంది యువతకు సివిల్ కోచింగ్ కోసం రూ.33 కోట్ల ఆర్థికసాయం చేశాము. ఆదరణ పథకంకింద 4,02,500 మందికి రూ.964కోట్లు ఖర్చుపెట్టాము. విదేశీవిద్యకింద 1975మందికి రూ.195కోట్లు అందించాము. 4,24, 432 మందికి రూ.2,074కోట్ల స్వయంఉపాధి రుణాలు అందించాము. 1,11,142 మందికి పెళ్లికానుక పథకం కింద రూ.39కోట్లు, స్కిల్ డెవలప్ మెంట్ కింద 31 వేలమంది యువతీ,యువకులకు రూ.45కోట్లు, విదేశీవిద్య పథకం కింద 470 మందికి రూ.47కోట్లు అందించాము. సివిల్ కోచింగ్ కింద 1443మందికి రూ.12కోట్లు, 8,30,000 మందికి రూ.2,068కోట్ల స్కాలర్ షిప్పులు అందించాము. ఇదీ తెలుగుదేశంప్రభుత్వం వెనుకబడిన వర్గాలకు అందించిన ఆర్థికసాయం అని చంద్రబాబు వివరించారు.

మీరు ఈ సమావేశంలో చెప్పినవాటిని నేను రికార్డ్ చేసుకున్నాను. మీరు ఇప్పుడు చెప్పినవాటినే సాధికారకమిటీల్లో చర్చించండి. సాధికారకమిటీలు ఇచ్చిన రికమండే షన్లు అమలుచేసే బాధ్యత తెలుగుదేశానిది. జనాభాదామాషా ప్రకారం వెనుకబడిన వర్గాలను ఆర్థికంగా, రాజకీయంగా న్యాయంచేసే బాధ్యత తీసుకుంటాను అని వెల్లడించారు.మీ ఎమ్మెల్యే ఆంబోతు అడ్డదిడ్డంగా మాట్లాడతాడు. ఒక బీసీ యువకుడుచనిపోతే అతనికి ప్రభుత్వమిచ్చిన రూ.5 లక్షల పరిహారంలో రూ.2.50లక్షలు అడగడం శవాల పై మరమరాలు ఏరుకోవడం కాదా? మట్టిపనులుచేసుకునే వ్యక్తిని లంచం అడుగుతా రా? అతని కూతుర్ని ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చదివిస్తాం. ఆకుటుంబానికి ఇప్పుడు పార్టీ తరుపున రూ.2లక్షలు ఆర్థికసాయం చేశామని
చంద్రబాబు చెప్పారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *