వైసీపీ అరాచకాలపై ప్రశ్నించండి..

వైసీపీ అరాచకాలపై ప్రశ్నించండి..

నాలుగేళ్ల జగన్ రెడ్డి పాలనపై టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన విమర్శలు చేశారు. వైసీపీ పాలనా వైఫల్యాలను ప్రజల్లో ఎండగొట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రజల సమస్యల గురించి వైసీపీ మంత్రులు అసలు పట్టించుకోలేదన్నారు. మంగళగిరిలోని .. టీడీపీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ఐ-టీడీపీ సదస్సుకు హాజరైన చంద్రబాబు.. వైసీపీ మంత్రులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. టీడీపీ నేతలను తిట్టడం.. వారిపై దౌర్జన్యాలు చేయడం తప్ప.. వైసీపీ మంత్రులు ఏమీ చేయలేదన్నారు. ఇదే వైసీపీ మంత్రుల ఒరిజినాలిటీ అని.. ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలని.. కార్యకర్తలకు.. చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

తన సొంత నియోజకవర్గంలో ఒక పిల్ల కాల్వ తవ్వలేని వాడు ఇరిగేషన్ శాఖా మంత్రి అని చంద్రబాబు విమర్శించారు. పట్టుమని పది ఇళ్లు కట్టించలేని వ్యక్తి.. హౌసింగ్ శాఖా మంత్రి అని, ఇండస్ట్రీల గురించి అడిగితే కోడిగుడ్డు కథ చెప్పే మంత్రి ఇంకొకరని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఏపీ కేబినెట్ లో ఉన్నది ఆర్థికశాఖా మంత్రి కాదని, అప్పుల శాఖా మంత్రి అని బుగ్గనపై పరోక్షంగా పంచ్ లు వేశారు. నిద్రలేచినప్పటి నుంచి ఏది తాకట్టు పెట్టాలనే ఆలోచన తప్ప సంపద క్రియేట్ చేద్దామనే ఆలోచన .. వైసీపీ మంత్రులకు లేదన్నారు. ఏపీలో చివరకు రైతు బజార్లు కూడా తాకట్టు పెట్టి.. డబ్బులు తెచ్చిన మంత్రి ఇంకొకరంటూ.. చంద్రబాబు నిప్పులు చెరిగారు.

ఏపీ విద్యార్థుల జీవితాలు నాశనం చేసిన వారు.. విద్యా శాఖా మంత్రి అని, ఇటువంటి మంత్రుల గురించి కావాల్సినంత మ్యాటర్ ఉందని.. ఈ అంశాలు ప్రజలకు వివరించాలని.. ఐ-టీడీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అమరావతి రాజధాని ఎక్కడికీ పోదని, ఆందోళన వద్దని చంద్రబాబు అన్నారు. మరో 9 నెలల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని, అమరావతి పనులను పరుగులు పెట్టిస్తామని అన్నారు. అమరావతి రాజధాని కోసం.. రైతులు త్యాగాలు చేశారని.. నాపై విశ్వాసం ఉంచి.. 33 వేల ఎకరాలు భూములు ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి.. అలాంటి అద్భుతమైన .. అమరావతిని చెడగొట్టడానికి ఎలా బుద్ధి పుట్టిందో అర్థం కావడంలేదని చంద్రబాబు విమర్శించారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *