
చేతగాని దద్దమ్మ.. రాష్ట్రాన్ని పాలిస్తున్నారు – చంద్రబాబు
- Ap political StoryNewsPolitics
- May 5, 2023
- No Comment
- 36
ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నాచుగుంటలో అకాల వర్షాలకు తడిసి దెబ్బతిన్న, మొలకల వచ్చిన ధాన్యాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు పరిశలించారు. అకాల వర్షాలతో.. పంట నష్టపోయిన రైతులను చంద్రబాబు పరామర్శించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. మొలకలు వచ్చిన ధాన్యాన్ని రైతులు.. చంద్రబాబు చూపి.. తమ ఆవేదన వెలిబుచ్చారు.
తమ కష్టాలను వివరించి.. తమకు చిరిగిన సంచులు ఇచ్చారంటూ వాపోయారు. ఎక్కడ చూసినా ధాన్యం మొలకలొచ్చిందని చంద్రబాబు వెల్లడించారు. 60 శాతానికి పైగా ధాన్యం పొలాల్లోనే ఉందని.. రైతుల ఆవేదన చూస్తుంటే .. బాధేస్తుందటూ.. చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు.
ఒక చేతకాని దద్దమ్మ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారని చంద్రబాబు ఘాటుగా విమర్శించారు. ధాన్యం సంచులు కూడా ఇవ్వలేని ప్రభుత్వాన్ని ఏమనాలని చంద్రబాబు మండిపడ్డారు. నాలుగేళ్లలో.. ఎప్పుడైనా.. రైతుల సమస్యలను పట్టించుకున్నారా.. అని చంద్రబాబు ప్రశ్నించారు.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల్లో వర్షంతో దెబ్బతిన్న పంటలను రైతులను పరామర్శిస్తున్నారు. చేతికొచ్చిన పంట నోటిదాక వెళ్లకపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో చంద్రబాబు ఉదారత చాటుకున్నారు. వైసీపీ చెందిన మహిళా రైతు ప్రభావతికి చంద్రబాబు ఆర్థికసాయం చేశారు.
ప్రభావతికి రెండు లక్షల 30 వేల రూపాయలను.. చంద్రబాబు అందజేశారు. ప్రభావతి కుమార్తె కాలేజ్ ఫీజుకుగాను రూ.2.30 లక్షలు సాయం చేసినట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. రైతుల కన్నీళ్లకు సీఎం జగన్ కారణమన్నారు. జగన్ ప్రభుత్వం.. ఏప్రిల్ మొదటి తేదీన ధాన్యాన్ని సేకరించాల్సి ఉన్నా.. ఇప్పటివరకు ఆ ఊసే లేదు. రైతులను జగన్ నిండా ముంచారని.. చంద్రబాబు తెలిపారు.
ఓవైపు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో .. ఎయిర్ పోర్టుకు శంకుస్థాపనా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అది కూడా.. గతంలో శంకుస్థాపన చేసిన దానికే మళ్లీ చేస్తున్నారు అంటూ విమర్శించారు. రాష్ట్రంలో చెత్త వ్యవస్థలను తీసుకొచ్చారంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. రైతు భరోసా కేంద్రాలు కాదు… రైతు దగా కేంద్రాలు అని అన్నారు. రైతులకు న్యాయం జరిగేంత వరకు అండగా ఉంటానని చంద్రబాబు భరోసా ఇచ్చారు.