27పథకాలు.. వేల కోట్ల నిధులతో దళితులకు ఎనలేని మేలు చేసిన బాబు..!

27పథకాలు.. వేల కోట్ల నిధులతో దళితులకు ఎనలేని మేలు చేసిన బాబు..!

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలకు విశేష స్పందన వస్తోంది. మరోవైపు యువనేత నారాలోకేష్ పాదయాత్రకు సైతం జనం పోటెత్తుతున్నారు. ఇదే సమయంలో అధికార వైసీపీ కేసులు, ప్రభుత్వ వ్యతిరేకతతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. దీంతో సీఎం జగన్ రెడ్డి మరోసారి దళిత కార్డును బయటకు తీశారు. విపక్షాలపైకి దళితులను ఉసిగొల్పే దుశ్చర్యలకు పాల్పడతున్నారు. ఈ క్రమంలో దళితులకు పంగనామాలు పెట్టింది ఎవరు..? అసలైన మేలు చేసింది ఎవరు..? అనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. గతంలో చంద్రబాబు అమలు చేసిన పథకాలను.. ప్రస్తుతం జగన్ రెడ్డి పెడుతున్న కోతలను బేరీజు వేసుకుంటున్నారు. దీంతో అసలైన దళిత ద్రోహి ఎవరనే ప్రశ్నకు.. సమాధానంగా అన్ని వేళ్ళూ జగన్ వైపే చూపిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో గత నాలుగేళ్లుగా అధికారంలో ఉన్న జగన్ రెడ్డి ప్రభుత్వం.. గత ఎన్నికల్లో దళిత ఓటు బ్యాంకు అండతోనే గద్దెనెక్కింది. మొత్తం 29 అసెంబ్లీ రిజర్వుడు స్థానాలు ఉండగా.. జగన్ రెడ్డి మాయ మాటలను నమ్మిన దళితులు మెజార్టీ స్థానాల్లో వైసీపీని గెలిపించారు. అయితే.. అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం జగన్ రెడ్డి వ్యవహారశైలి.. “ఏరు దాటాక.. తెప్ప తగలేసిన” చందంగా తయారైందని దళితులు అభిప్రాయ పడుతున్నారు. జగన్ మోహన్ రెడ్డిని నమ్మి ఓట్లేసి నందుకు.. నట్టేట ముంచారనే అవేదన ఎస్సీల నుంచి వ్యక్తం అవుతోంది. వాస్తవానికి ఏపీ జనాభాలో సుమారు 17 శాతం వరకు అంటే సుమారు 1.50 కోట్ల మంది దళితులు ఉన్నారు. అయితే.. సామాజికంగా, ఆర్ధికంగా వెనుకబాటుకు గురైన దళితుల కోసం…గత నాలుగేళ్లుగా జగన్ రెడ్డి సర్కార్ నాయాపైసా ఖర్చు పెట్టలేదు. పైగా.. టీడీపీ హయాం నుంచి అమలౌతున్న పథకాలన్నింటికీ కోతలు పెట్టిన జగన్ రెడ్డి దళితుల ఉసురు పోసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే.. చంద్రబాబు హయాంలో అమలైన పథకాలను.. జగన్ రెడ్డి పెట్టిన కోతలను జనం పోల్చి చూసుకుంటున్నారు.

వాస్తవానికి.. తెలుగుదేశం పార్టీకి బీసీలు, దళితులే మొదటి నుంచి అండగా ఉంటూ వస్తున్నారు. దీంతో.. అన్న ఎన్టీఆర్ హయాం నుంచి చంద్రబాబు వరకు.. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికే తొలి ప్రాధాన్యం ఇచ్చిన విషయం తెలిసిందే. వీటిలో ముఖ్యంగా ఎస్సీ సబ్ ప్లాన్ ప్రకారం పెద్ద మొత్తంలో నిధుల కేటాయింపు.. అభివృద్ధి కార్యక్రమాల అమలు జరిగేది. దళిత వాడల్లో విద్య, వైద్యం, ఆరోగ్యం, మౌలిక సదుపాయాల కల్పనకు చంద్రబాబు పెద్దపీట వేశారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో వేలాది కిలోమీటర్ల సిమెంట్ రోడ్లను దళితవాడల్లో వేయించారు. కమ్యూనిటీ హాల్స్, తాగునీటి పైపులు, బోర్లకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇలా నూటికి నూరు శాతం ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను దళిత వాడల అభ్యున్నతికే ఖర్చు పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడికే దక్కుతుంది. కానీ ప్రస్తుతం సీఎం జగన్ రెడ్డి ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను సైతం దారి మళ్ళిస్తున్నారు. కాకుల్ని కొట్టి గద్దలకు వేసిన చందంగా.. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను బటన్ నొక్కుడు పథకాలకు వినియోగిస్తుండటంతో.. దళితవాడల్లో ప్రజలకు కనీస మౌలిక సదుపాయాల కల్పన కూడా జరగటం లేదు.

ఇక.. ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల సద్వినియోగంతో పాటు చంద్రబాబు పాలనలో ఎస్సీల అభ్యున్నతి కోసం ఏకంగా 27 సంక్షేమ పథకాలను అమలు చేశారు. ఇది జాతీయ స్థాయిలోనే ఓ రికార్డుగా చెబుతారు. దళిత చిన్నారులకు మెరుగైన విద్య కోసం ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూళ్ళను, గురుకుల పాఠశాలలను చంద్రబాబు ఏర్పాటు చేశారు. అదే విధంగా బెస్ట్ అవైలబుల్ స్కూళ్ళను తెరిచి.. దళిత విద్యార్ధులకు అత్యున్నత ప్రమాణాలతో విద్యా బోధన జరిగేలా చూశారు. కానీ జగన్ రెడ్డి వచ్చాక.. వీటన్నింటిన మూయించిన సంగతి తెలిసిందే. బెస్ట్ అవైలబూల్ స్కూళ్ళ‌ను భారంగా భావించిన జగన్ సర్కార్.. దళిత విద్యార్ధులకు నాణ్యమైన విద్యను దూరం చేసింది. అలాగే.. చంద్రబాబు హయాంలో అంబేద్కర్ విదేశీ విద్యా పథకం విజయవంతంగా అమలైంది. ఉన్నత విద్యావకాశాల కోసం విదేశాలకు వెళ్ళే దళిత విద్యార్ధులకు ఈ పథకం..ఓ సంజీవినిలా ఉపయోగ పడింది. అయితే..అధికారంలోకి వచ్చాక.. అంబేద్కర్ విదేశీ విద్యా పథకానికి సైతం జగన్ రెడ్డి మంగళం పాడేశారు. దళిత విద్యార్దులు విదేశాలకు వెళ్ళి ఉన్నత విద్యను అభ్యసించకుండా.. జగన్ రెడ్డి ఆటంకాలు సృష్టించారు.

విద్యావంతులైన దళిత నిరుద్యోగ యువతకే కాదు.. స్వయం ఉపాధికోసం చూసే పేద దళితులందరికీ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వందల కోట్ల రూపాయల రుణాలను చంద్రబాబు ప్రభుత్వం అందించేది. ప్రస్తుతం ఎస్సీ కార్పొరేషన్ ఏమైందో..? స్వయం ఉపాధి రుణాల సంగతి ఎటు పోయిందో..? జగన్ రెడ్డికే తెలియాలి. ఎస్సీ కార్పొరేషన్ ను పూర్తిగా నిర్వీర్యం చేసిన జగన్ రెడ్డి.. దళిత యువతను నడిరోడ్డుపై నిలబెట్టారు. ఉద్యోగాలు, ఉపాథి లేక దళిత యువత అలమటించేలా చేసిన ఘనుడు.. జగన్ రెడ్డి అని ఇప్పుడు దళితులు తలలు పట్టుకుంటున్నారు. కేవలం ఎస్సీ కార్పొరేషన్ రుణాలనే కాదు.. చంద్రబాబు హయాంలో దళిత యువతకు ఇన్నోవా కార్లు ఇచ్చి.. వారి స్వయం ఉపాధికి బాటలు వేశారు. కానీ.. ఇప్పుడు కార్ల మాట దేవుడెరుగు.. నయా పైసా రుణానికి కూడా దిక్కులేని స్థితికి జగన్ రెడ్డి తీసుకు వచ్చారు. మొత్తం ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను.. ఎస్సీ కార్పొరేషన్ నిధులను.. ప్రభుత్వ ఖజానాకు మళ్ళించేస్తున్నారు. బటన్ నొక్కుడు పథకాలతో దళితుల సొమ్మును ఇతరులకు సంతర్పణ చేస్తున్నారు.

ఇక…ఎడాపెడా విద్యుత్ ఛార్జీలను జగన్ సర్కార్ పెంచేస్తుండగా.. చంద్రబాబు హయాంలో ఎస్సీల ఇళ్ళకు 150 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చే పథకాన్ని అమలు చేశారు. అలాగే కులాంతర వివాహాలు చేసుకునే దళితులకు క్రమం తప్పకుండా ఆర్ధిక ప్రోత్సాహాలను అందించే వారు. ఇళ్ల నిర్మాణంలో అదనంగా 50 వేల రూపాయల నగదు ఇవ్వటమే కాకుండా.. టిడ్కో ఇళ్ళ కేటాయింపులో సైతం దళితులకే పెద్ద పీట వేసిన ఘనత చంద్రబాబు నాయుడుకు దక్కుతుంది. అంతే కాదు ఎస్సీల కోసం భూమి కొనుగోలు పథకాన్ని చంద్రబాబు అమలు చేశారు. నేషనల్ షెడ్యూల్డ్ కాస్ట్స్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా.. దళితులకు అనేక ప్రాయోజిత పథకాలు అందించారు. అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ ద్వారా యువతకు దళిత యువతకు మెరుగైన శిక్షణ అందించే వారు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులను క్రమం తప్పకుండా భర్తీ చేసేవారు. అలాగే ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు చనిపోతే కారుణ్య నియామకాలు చేపట్టే వారు. 27కు పైగా పథకాలను కేవలం దళితుల కోసమే ప్రత్యేకంగా అమలు చేసేవారు. అయితే జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత వీటన్నింటీనీ రద్దు చేసేశారు. దళితులకు తీవ్ర అన్యాయం చేశారు. తన తప్పులను కప్పి పుచ్చటానికి చంద్రబాబు పై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు.

మొత్తం మీద.. దళితుల అభివృద్ధి కోసం 27 పథకాలను.. వేల కోట్ల రూపాయల నిధులను అందించిన ఘనత చంద్రబాబు నాయుడికే దక్కుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో దళితులకు లబ్ది చేకూరిందంటే.. అది చంద్రబాబు హాయంలో జరిగిందనే భావన దళిత సామాజిక వర్గాల్లో వ్యక్తం అవుతోంది.

 

Related post

నెల్లూరులో నారాయణ పూజలు

నెల్లూరులో నారాయణ పూజలు

నెల్లూరు నగరంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నగర ఇన్‌చార్జ్‌ ,మాజీమంత్రి పొంగూరు నారాయణ, సతీమణి రమాదేవి కలిసి పలు చోట్ల.. వినాయక స్వామివారిని…
పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

టీడీపీ ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంది. కానీ, వాటన్నంటినీ ఎదుర్కొని పార్టీని సమర్థవంతంగా ముందుండి నడిపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. కానీ, ఇప్పుడు ఆయనకే కష్టం వచ్చింది. అక్రమ అరెస్ట్…
చంద్ర‌బాబుకు అండ‌గా నిలుద్దాం..  విడుదల అయ్యేంత వరకు పోరాటం

చంద్ర‌బాబుకు అండ‌గా నిలుద్దాం.. విడుదల అయ్యేంత వరకు పోరాటం

నాలుగున్నర దశాబ్దాల పాటు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవినీతికి తావు లేకుండా.. టీడీపీ అధినేత చంద్రబాబు పరిపాలన చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం.. నిరంతరం అభివద్ధే ధ్యేయంగా పని చేసిన చంద్రబాబుపై…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *