చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్ల దాడి దారుణం: నక్కా ఆనంద్‌బాబు

చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్ల దాడి దారుణం: నక్కా ఆనంద్‌బాబు

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో టీడీపీ అధినేత చంద్రబాబు కాన్వాయ్‌పై వైసీపీ కార్యకర్తల రాళ్ల దాడి ఘటనపై మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఆదిమూలపు సురేష్‌ వీధి రౌడీలా ప్రవర్తించడం బాధాకరమన్నారు. దాడులు జరుగుతాయి అని ముందే పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోకపోవడం దారుణమని మండిపడ్డారు.

ఎన్‌ఎస్‌జీ కమెండోలు అడ్డులేకపోతే చంద్రబాబు నాయుడు మీద రాళ్ల దాడి జరిగేదని.. కామండో తలకి గాయం పోలీసులు, ప్రభుత్వ వైఫల్యమని విమర్శించారు.దళితులను లోకేష్‌ అవమానించారని అసత్య ఆరోపణలతో మంత్రి ఆదిమూలపు సురేష్‌ తన అధికారాన్ని అడ్డుపెట్టుకొని వీధి రౌడీల ప్రవర్తించారని మండిపడ్డారు. తక్షణమే మంత్రి పదవి నుంచి సురేష్‌ను గవర్నర్‌ బర్తరఫ్‌ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ఒక బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి చొక్కా విప్పి రోడ్డుపై వీరంగం చేయడం శోచనీయమన్నారు. ఈ కుట్రలో పోలీసులు కూడా భాగాస్వామీలే అని ఆరోపించారు. తెలుగుదేశం నాయకులను హౌస్‌ అరెస్టులు చేసి హడావిడి చేసే పోలీసులు మంత్రిని మాత్రం దగ్గర ఉండి దాడి చేయించారంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇదంతా వివేకా హత్య కేసులను పక్క దారి పట్టించే డైవర్షన్‌ పాలిటిక్స్‌ అని వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రిపై సాక్షాత్తు రాష్ట్ర మంత్రి దాడి చేయడం ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? అని ప్రశ్నించారు. ఈ దాడిని ప్రజాస్వామ్య వాదులు, ప్రజాసంఘాలు ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో ఖండిరచాలని నక్కా ఆనంద బాబు పిలుపునిచ్చారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *