పదేళ్ళు కష్టపడితే రాష్ట్రంలో పేదరికమే వుండదు – అంబేద్కర్ జయంత్యోత్సవాలలో చంద్రబాబు

పదేళ్ళు కష్టపడితే రాష్ట్రంలో పేదరికమే వుండదు – అంబేద్కర్ జయంత్యోత్సవాలలో చంద్రబాబు

పేదల ఆర్ధికాభివృద్ధికి టిడిపి కృషి
భాగస్వాములు కావాలని ప్రవాసులకు పిలుపు
సంపద సృష్టి టిడిపికే సాధ్యం
అంబేద్కర్ కలను నిజం చేసిన ఎన్టీఆర్
జగన్ హయాంలో దళితులపై దాడులు
…..
రానున్న టీడీపీ ప్రభుత్వం జన్మభూమి స్ఫూర్తితో పేదల ఆర్థికాభివృద్ధి కోసం పనిచేస్తుంది. ఆ మహత్తర కార్యక్రమంలో దేశ విదేశాల్లో ఉన్నతస్థానాల్లో ఉన్న తెలుగువారు, భాగస్వాములు కావాలని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. దానంగా డబ్బులివ్వకుండా తెలివితేటలు, చేయూతతో వారిని పైకి తీసుకురావడానికి 10 ఏళ్లుపనిచేస్తే రాష్ట్రంలో పేదరికమే ఉండదని చెప్పారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం గుడివాడలో జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు ప్రసంగించారు. పేదలు ఆర్థికంగా పేదరికంలో ఉండొచ్చుకానీ, శక్తిసామర్థ్యాలు తెలివితేటల్లో పేదలు కారు. ఎస్సీలు ఎవరికీ తీసిపోరు అనడానికి కే.ఆర్.నారాయణన్, ప్రతిభా భారతి, బాలయోగి వంటివారే నిదర్శనం. తెలుగు దేశంపార్టీ ఎప్పుడూ భావితరాలకు ఏది అవసరమో దాని గురించే ఆలోచిస్తుంది.

తెలుగుదేశం పార్టీ తెలుగు జాతికోసం, తెలుగుభాష కోసం, పేదలకోసమే పనిచేస్తుంది. పేదరికంలేని సమాజమే తెలుగు దేశం లక్ష్యం. అంబేద్కర్ మహాశయుడి స్ఫూర్తితో, ఎన్టీఆర్ బాటలో తెలుగుదేశంపార్టీ పేదల సేవలోనే తరిస్తుంది అని చంద్రబాబు వెల్లడించారు. పేదల్లోని ఆర్థికఅసమానతలు రూపుమాపేందుకు తెలుగుదేశం పార్టీ కృషిచేస్తుంది. డబ్బులున్నవారు సమాజంలో రాణిస్తారు… ముందుకెళ్తారు. పేదలు, మరీముఖ్యంగా నిరుపేదల్లో ఆనందంచూడటమే తెలుగుదేశం పార్టీకి సార్థకత అని ఆయన పేర్కొన్నారు. అంబేద్కర్ ఆలోచనలు ఆచరణలో నిజంచేయాలన్నా, ఆ మహానుభావుడు రాసిన రాజ్యాంగం సమర్థవంతంగా అమలు కావాలంటే, దాని ఫలితాలు చివరివ్యక్తికి అందాలి. అప్పుడే అంబేద్కర్ కు నిజమైన నివాళులు అర్పించినట్టు అవుతుంది. అంబేద్కర్ 132వ జయంతితోపాటు, ఎన్టీఆర్ శతజయంతి జరుపుకోవడం అరుదైన అనుభవం, నిజంగా తెలుగు జాతి సంతోషించాల్సిన విషయమన్నారు. పేదలకు అండగా ఉండేది, వారిని అదుకునేది తెలుగుదేశం పార్టీనే. అభివృద్ధిచేసి, ప్రజలసంపద సృష్టికి ఆలోచించేంది తెలుగుదేశం పార్టీనే. సంక్షేమంతో అన్నివర్గాలకు మేలుచేసేది తెలుగుదేశం మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు.

అంబేద్కర్ చరిత్ర స్ఫూర్తిదాయకం

మహానుభావుడు డాక్టర్ భీమ్ రావు అంబేద్కర్ గురించి నేటి యువత తెలుసు కోవాలి. 132సంవత్సరాలకు ముందుపుట్టిన వ్యక్తిని దేవుడితో సమానంగా దేశంలోని ప్రజలంతా కొలుస్తున్నారు. ఆయనచరిత్ర నేటి యువతకు స్ఫూర్తినిచ్చేది. సాధారణ కుటుంబంలో పుట్టి, అసాధారణ శక్తిగా ఎదిగిన మహాను భావుడు అంబేద్కర్. ఆయన చరిత్రతోపాటు ప్రజాహితం కోసంపనిచేసిన గొప్పవాళ్ల గురించి యువత కచ్చితంగా తెలుసుకోవాలి . మహారాష్ట్రలో 1891 ఏప్రియల్ 14న అంబేద్కర్ గారు జన్మించారు అని చంద్రబాబు చెప్పారు. బడుగు బలహీనవర్గాలు దళితుల్ని ఆర్థికంగా, సామాజికంగా చైతన్య వంతుల్ని చేయడానికి, వారిలో ధైర్యం నూరిపోయడానికి, తాను అంబేద్కర్ మార్గాన్నే ఎంచు కొని, ఆయనచూపిన బాటలోనే నడిచానని స్వర్గీయ ఎన్టీఆర్ ఒక సందర్భంలో చెప్పారని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు.

ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి, సమాజంలో చిన్నచూపుకు గురవుతున్న వర్గాలను ఆదుకోవడానికి వారికి అంబేద్కర్ రిజర్వేషన్లు కల్పించారు. అంబేద్కర్ మహాశయుడు కేవలం ఎస్సీ, ఎస్టీవర్గాలకు చెందిన వాడనే దురభిప్రాయాన్ని వీడండి. అంబేద్కర్ ప్రజల మనిషి. భారతదేశఆస్తి. ఎక్కువమంది పేదలు ఎస్సీలు, ఎస్టీల్లో ఉన్నారని భావించే వారికోసం రిజర్వేషన్లు తీసుకొచ్చారు అని వివరించారు. రాజ్యాంగం రాసిన తర్వాత అంబేద్కర్ నెహ్రూ కేబినెట్లో మంత్రిగా చేరారు. ఆ సమయంలో మహిళలకు ఆస్తిలో సమానహక్కుఇవ్వాలని ప్రతిపాదించారు. కానీ ఆనాడు ఆబిల్లు చట్టసభల్లో పాస్ కాలేదు. ఆనాటి అంబేద్కర్ కలను ఎన్టీఆర్ నిజం చేశారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక మహిళలకు ఆస్తిలో సమానహక్కు కల్పించి, అంబేద్కర్ కు నిజమైన వారసుడిగా పేరుపొందారు. వారసులు అంటే మహాను భావు ల ఆశయాల్ని నిజంచేసి, వారిసిద్ధాంతాల్ని ఆచరణలో అమలుచేసేవారు.

ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ ఛైర్మన్ అయ్యాకే అంబేద్కర్ గారికి ‘భారతరత్న’ ఇప్పించారని చంద్రబాబు చెప్పారు. అంబేద్కర్ విగ్రహాన్ని పార్లమెంట్ లో ప్రతిష్టించేందుకు తెలుగుదేశం పార్టీ ఎనలేని కృషి చేసింది. పేదల్ని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా పైకి తీసుకొచ్చేందుకు ఎన్టీ ఆర్ పాటుపడ్డారు. ఇళ్లనిర్మాణంలో నూటికి 50శాతం రిజర్వేషన్లు ఎస్సీ,ఎస్టీలకు అమలుచేసిన ఘనత నందమూరి తారకరామారావుదే. ఎస్సీఎస్టీలకు నాణ్యమైన ఉచితవిద్య అందించేందుకు రెసిడెన్షియల్, గురుకుల పాఠశాలలతో సరికొత్త విద్యా వ్యవస్థకు శ్రీకారంచుట్టింది ఎన్టీఆరే అని వివరించారు.

ఎన్.డీ.ఏ కన్వీనర్ గా ఉన్నప్పుడు నేను కే.ఆర్.నారాయణన్ ను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రతిపాదించి, ఆయన్ని గెలిపించేందుకు కృషిచేశాం. జీ.ఎం.సీ. బాలయోగిని లోక్ సభ స్పీకర్నిచేసింది తెలుగుదేశంపార్టీ. సమర్థుడైన కాకిమాధవరావుని చీఫ్ సెక్రటరీగా చేసింది తెలుగుదేశంపార్టీదే. మహేంద్రనాథ్ ను తొలిసారి రాష్ట్ర ఆర్థికమంత్రిని చేయడంతో పాటు, ప్రతిభాభారతిని శాసనసభస్పీకర్ గా నియమించింది తెలుగుదేశం పార్టీనే అని చంద్రబాబు చెప్పారు. అంటరానితనం నిర్మూలనకు టీడీపీప్రభుత్వం చేసిన కృషి మరేప్రభుత్వం చేయలేదు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జస్టిస్ పున్నయ్య కమిషన్ వేసి, సదరు కమిషన్ ఇచ్చిన 42 ప్రతిపాదనలు ఆమోదించి, దళితులపై వివక్ష చూపేవారిపై ఎస్సీఎస్టీ యాక్ట్ కింద కేసులునమోదుచేసి, జైళ్లకు పంపాము. 23 స్పెషల్ కోర్టులు పెట్టి అక్కడి కక్కడే శిక్షలు పడేలాచేసి, అంటరానితనం నిర్మూలనకు టీడీపీ ఎనలేని కృషిచేసింది అని చంద్రబాబు వివరించారు. 125 అడుగులు అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించి, అమరావతిలోని స్మృతివనం నిర్మా ణానికి అంకురార్పణ చేశాం. టీడీపీ ప్రభుత్వం అమరావతి లో ప్రారంభించిన స్మృతివ నంప్రాజెక్ట్ ను ఈప్రభుత్వం పూర్తిగా అటకెక్కించింది. రివర్స్ పాలన వల్ల 15ఎకరాల్లో, రూ.100 కోట్లతో నిర్మించతలపెట్టిన అంబేద్కర్ స్మృతివనం ప్రాజెక్ట్ కు జగన్ ప్రభుత్వం తిలోదకాలు ఇచ్చింది అని ఆవేదన వ్యక్తం చేశారు.

సబ్ ప్లాన్ ప్రకారమే ఎస్సీలకు నిధులు

సబ్ ప్లాన్ ప్రకారం ఎస్సీలకు నిధులుకేటాయించాలి. ఆసొమ్ముని వారిసంక్షేమానికే వినియోగించాలి. కానీ ఇప్పుడు రాష్ట్రంలో అది అమలవుతోందా? అని చంద్రబాబు ప్రశ్నించారు. చట్టపరంగా ఎస్సీలకు దక్కాల్సిన హక్కులు, న్యాయాన్నికూడా లేకుండాచేశారు. ఒక్కఛాన్స్ అని అధికారంలోకి వచ్చి, ఎస్సీలకు తీరనిద్రోహం చేసిన వ్యక్తిగా జగన్ చరిత్రలో నిలిచిపోతాడు . ఎస్సీకుటుంబాల్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే, అందరినీ ఉన్నతవిద్యా వంతుల్ని చేసింది తెలుగుదేశంపార్టీనే. ఒక కుటుంబంలో ఇద్దరు పిల్లలుంటే, జగన్ అమ్మఒడి ఒక్కరికే ఇస్తూ, మరొకరి చదువుకు అడ్డుపడుతున్నాడు అని ఆరోపించారు. టీడీపీ హాయాంలో ఎస్సీలకోసం 27 ప్రత్యేకపథకాలు అమలుచేశాం.

జగన్ ముఖ్యమంత్రి కాగానే వాటన్నింటినీ రద్దుచేశాడు. ఆర్థికంగా వెనుకబడిన వారిని కులాలకు అతీతంగా ఆదుకుంటేనే ఆర్థిక అసమానతలు తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. రూ.33వేలకోట్ల సబ్ ప్లాన్ నిధుల్ని జగన్ ప్రభుత్వం రద్దుచేసింది. అంబేద్కర్ విదేశీ విద్య, బెస్ట్ అవైలబుల్ స్కూళ్లు, కులాంతరవివాహం చేసుకునేవారికి ఇచ్చే ఆర్థిక ప్రోత్సాహం వంటివాటిని రద్దుచేశారు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీలకు 150యూనిట్ల ఉచితవిద్యుత్ అందించాను. దాన్నికూడా జగన్ రద్దుచేశాడు. 4ఏళ్లల్లో విద్యుత్ ఛార్జీలు దారుణంగాపెంచాడు. విద్యుత్ ఎక్కువ వాడుతున్నారని పింఛన్లు, రేషన్ కార్డులు తీసేస్తున్నాడు అని ఆరోపించారు. చరిత్రలో ఎప్పుడూలేని విధంగా జగన్ ప్రభుత్వంలోనే దళితులపై దాడులు ఎక్కువయ్యాయి. ఇలాంటి వ్యక్తులు పాలకులు అవుతారని అంబేద్కర్ కు తెలిసుంటే, రాజ్యాంగం రాసినప్పుడే జగన్ లాంటి వాళ్లు అధికారంలోకి రాకుండా చేసేవారు అని చెప్పారు.

డాక్టర్ సుధాకర్ చేసిన తప్పేంటి? మాస్క్ అడగడమే ఆయనచేసిన నేరమా? అని చంద్రబాబు ప్రశ్నించారు. సుధాకర్ హత్య ముమ్మాటికీ జగన్ ప్రభుత్వహత్యే.  వైసీపీఎమ్మెల్సీ అనంతబాబు దళి తుడైన సుబ్రహ్మణ్యాన్ని చంపేసి, అతని మృతదేహాన్ని డోర్ డెలివరీచేశాడు. ఎంత అ అహంకారముంటే అనంతబాబు ఆపనిచేస్తాడు? దళితుణ్ణి చంపి జైలుకెళ్లిన సుబ్రహ్మణ్యానికి వైసీపీనేతలు సిగ్గులేకుండా ఘన స్వాగతాలు పలుకుతారా? అని విమర్శించారు. డాక్టర్ అచ్చెన్నను పైఅధికారులు వేధించడంతో అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దళితుడైన అచ్చెన్న ఆత్మహత్య చేసుకుంటే, ఈ ముఖ్యమంత్రి నోరెత్తలేదు. వైసీపీ ప్రభుత్వంలో ఎస్సీలపై 6వేలకు పైగా దాడులు, వేధింపులు, అత్యాచారాలు, అఘాయి త్యాలు జరిగాయి. వీటన్నింటినీ చూశాక పాముతన పిల్లలను తానే తిన్నట్టు జగన్, అతని ప్రభుత్వం దళితుల్ని బలితీసుకుంటోంది అని చెప్పక తప్పదు అని చంద్రబాబు పేర్కొన్నారు.

Related post

నెల్లూరులో నారాయణ పూజలు

నెల్లూరులో నారాయణ పూజలు

నెల్లూరు నగరంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నగర ఇన్‌చార్జ్‌ ,మాజీమంత్రి పొంగూరు నారాయణ, సతీమణి రమాదేవి కలిసి పలు చోట్ల.. వినాయక స్వామివారిని…
పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

టీడీపీ ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంది. కానీ, వాటన్నంటినీ ఎదుర్కొని పార్టీని సమర్థవంతంగా ముందుండి నడిపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. కానీ, ఇప్పుడు ఆయనకే కష్టం వచ్చింది. అక్రమ అరెస్ట్…
చంద్ర‌బాబుకు అండ‌గా నిలుద్దాం..  విడుదల అయ్యేంత వరకు పోరాటం

చంద్ర‌బాబుకు అండ‌గా నిలుద్దాం.. విడుదల అయ్యేంత వరకు పోరాటం

నాలుగున్నర దశాబ్దాల పాటు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవినీతికి తావు లేకుండా.. టీడీపీ అధినేత చంద్రబాబు పరిపాలన చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం.. నిరంతరం అభివద్ధే ధ్యేయంగా పని చేసిన చంద్రబాబుపై…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *