నాలెడ్జ్ ఎకానమీలో తెలుగువారిదే అగ్రస్థానం : చంద్రబాబు వెల్లడి

నాలెడ్జ్ ఎకానమీలో తెలుగువారిదే అగ్రస్థానం : చంద్రబాబు వెల్లడి

తెలుగువారంతా సంపన్నులు కావాలన్నదే టిడిపి ధ్యేయం
తెలంగాణలో పాలకులు ఎపిలో మాదిరి విధ్వంసం చేయలేదు
టిటిడిపి నాయకులు బాగా పనిచేస్తున్నారు
తెలుగువారి స్థాయి పెంచింది తెలుగుదేశమే
టిడిపి కారణంగానే దేశంలో నంబర్ వన్ గా తెలంగాణ
……
హైదరాబాద్ అభివృద్ధిలో అడుగడుగునా టిడిపి కృషి వుంది. నేను ప్రారంభించిన ఐటి, నాలెడ్జ్ ఎకానమీకి వెన్నెముక గా నిలిచింది. నాలెడ్జ్ ఎకానమీ లో తెలుగువారు నంబరు వన్ స్థానంలో వున్నారు. ప్రతి తెలుగువాడు సంపన్నుడు కావాలన్నదే తెలుగుదేశం పార్టీ లక్ష్యం. అని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ లో మంగళవారం పార్టీ శ్రేణులను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షునిగా ఎన్నికైన సందర్భంగా టిటిడిపి ఆధ్వర్యంలో చంద్రబాబును ఘనంగా సన్మానించారు.

అనంతరం పార్టీ శ్రేణులను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ తెలంగాణాలో సైతం టిడిపి బలమైన పార్టీగా తయారవుతుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ లో పాలకులు విధ్వంసం చేయలేదు. కానీ ఏపీ లో సిఎం జగన్ విధ్వంసానికి పాల్పడ్డారు అని చంద్రబాబు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ హైదరాబాద్ లోనే స్థాపించారన్నారు. తెలుగు ప్రజల గుండెల్లో టిడిపి ఎప్పుడూ వుంటుందని చెప్పారు. ఎన్టీఆర్ శతజయంతి వుత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహించామని తెలిపారు. 1995 నుంచి ఇప్పటివరకు వరుసగా 28 సంవత్సరాల పాటు పార్టీ అధ్యక్షునిగా తనకు అవకాశం ఇచ్చిన కార్యక్ర్తలకు ధన్యవాదాలు తెలిపారు. తాను ఎప్పటికీ తెలుగు ప్రజలకు ఋణపడి వుంటానని చెప్పారు.

టిడిపి వచ్చిన అనంతరం తెలుగువారి స్థాయి పెరిగిందన్నారు. తెలుగుదేశం పార్టీకి వచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రజల కోసమే వినియోగించినట్టు తెలిపారు. తెలంగాణ లో తెలుగుదేశం పార్టీ నాయకులు బాగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కార్యకర్తలతో మళ్ళీ సందడిగా మారటం శుభసూచకమన్నారు. ఇంటింటికి తెలుగుదేశం కారక్రమం నిర్వహించటంతో పాటు, అన్ని నియోజకవర్గాలలో వేశారు అని చంద్రబాబు టిటిడిపి నాయకులను అభినందించారు. తెలుగుజాతి కోసమే ఎన్టీఆర్ టిడిపి పెట్టారని చెప్పారు. ఎన్టీఆర్, పీవీ నరసింహారావులు దేశానికి ధాసా, దిశ చూపించారు అని పేర్కొన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్ గా వుండటానికి తెలుగుదేశం పార్టీ చేసిన కృషే కారణమని చంద్రబాబు వెల్లడించారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *