
సమస్యలు తీరాలంటే చంద్రబాబు రావాలి
- Ap political StoryNewsPolitics
- May 5, 2023
- No Comment
- 36
పుట్టపర్తి నియోజకవర్గం మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆదేశాలు మేరకు ‘ఇదేం కర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం కొత్తచెరువు మండల కేంద్రంలోని కొండ కింద ఏరియాలో గురువారం నిర్వహించారు. ప్రతిఇంటికి వెళ్లి వారి సమస్యలను తెలుసుకొని 9261292612 ఈ నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇప్పించారు. రేషన్ బియ్యం సరిగా అందకపోవడం, డ్రైనేజీ సమస్య, పెన్షన్లు తొలగించడం, స్మశానాల సమస్యలను నేతల దృష్టికి స్థానికులు తీసుకొచ్చారు.
ఈ సమస్యలన్నీ పరిష్కరించడానికి రాబోయే 2024 ఎన్నికలలో నారా చంద్రబాబు నాయుడు గెలిపించాలని, అదేవిధంగా పుట్టపర్తి నియోజకవర్గంలో డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డిని గెలిపించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సాలక్క వెంకటరమణప్ప, మాజీ సర్పంచ్ శివప్ప, టౌన్ కన్వీనర్ ఒలిపి శ్రీనివాసులు, మండలం మైనార్టీ నాయకుడు సైకిల్ షాప్ బాబా, హిందూపురం పార్లమెంట్ ఎస్టీ సెల్ నాగమణి, అగ్రిగోల్డ్ మునీర్, బాలాజీ, మాజీ టీచర్ నాగేంద్ర ప్రసాద్ సార్, మైలేపల్లి శివ, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.