మే 11న ఎస్‌.కోటకు చంద్రబాబు

మే 11న ఎస్‌.కోటకు చంద్రబాబు

శృంగవరపుకోట నియోజకవర్గములో ‘’ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’’ కార్యక్రమంలో నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారని శృంగవరపుకోట నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జ్‌ కోళ్ల లలిత కుమారి ప్రెస్‌ మీట్‌ ద్వారా తెలియజేశారు. ఉత్తరాంధ్ర నియోజకవర్గ ఇంఛార్జ్‌ బుద్ధా వెంకన్న మరియు విశాఖ టీడీపీ పార్లమెంట్‌ ఇంఛార్జ్‌ నిమ్మకాయల చినరాజప్ప ఇచ్చిన సమాచారం మేరకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మే నెల 11న శృంగవరపుకోట నియోజకవర్గంలో పర్యటించనున్నారని తెలిపారు.

కావున శృంగవరపుకోట నియోజకవర్గములోని ఐదు మండలాల్లో ఉన్న వివిధ హోదాల్లో ఉన్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కుటుంబసభ్యులు, అభిమానులు, మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా టీడీపీ శ్రేణులకు కోళ్ల లలిత కుమారి పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మాజీ వైస్‌ ఎంపీపీ నానిగిరి రమణాజీ, విశాఖ టీడీపీ పార్లమెంట్‌ కార్యనిర్వాహక కార్యదర్శి కాపుగంటి శ్రీనివాసు, రాష్ట్ర ఐటీడీపీ కార్యదర్శి చెక్కా కిరణ్‌ కుమార్‌, నియోజకవర్గ ఐటీడీపీ కార్యదర్శి అనకాపల్లి చెల్లయ్య, నియోజకవర్గ తెలుగుయువత అధ్యక్షులు వాకాడ బాల ఈశ్వర్‌ భరత్‌ (బాలు), బీశెట్టి అరుణ, వార్డు మెంబర్‌ యలమంచిలి అక్కునాయుడు, సరిపల్లి రామకృష్ణ, గనివాడ బంగారు నాయుడు, టీడీపీ సీనియర్‌ నాయకులు పెదగాడ రాజు, వసంత సత్యారావు, మోపాడ చిన్ని కృష్ణ, ఎస్‌. టి. ఆర్‌, శిలపరశెట్టి శేఖర్‌, బాలి రామకృష్ణ, వసంత వెంకటరమణ, బుర్రు అప్పారావు, వల్లయ్య, చిన్నా, అంబటి శ్రీను, టీడీపీ కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *