72 గంటల్లోగా ధాన్యం కొనుగోలు చేయాలి  ప్రభుత్వానికి చంద్రబాబు డెడ్ లైన్

72 గంటల్లోగా ధాన్యం కొనుగోలు చేయాలి ప్రభుత్వానికి చంద్రబాబు డెడ్ లైన్

స్పందించకుంటే పోరుబాట
9వ తేదీన ఎమ్మార్వో కార్యాలయాల్లో వినతిపత్రాలు
13వ తేదీన నిరసనదీక్ష
టిడిపి అధికారంలోకి రాగానే ధాన్యం ఆరబెట్టేందుకు ప్రత్యేక ప్లాట్ ఫారంలు
రైతులు చైతన్యవంతులై పోరాడాలని పిలుపు

అకాలవర్షాల కారణంగా దెబ్బతిన్న ధాన్యాన్ని రాష్ట్రప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చందబాబు నాయుడు డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వానికి 72
గంటల గడువు విధించారు. మళ్ళీ తుఫాను వచ్చే అవకాశం వున్న కారణంగా ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలన్నారు. గడువులోగా ధాన్యం కొనుగోలు చేయకపోతే 9 వ తేదీన ఎమ్మార్వో ఆఫీసుల
వద్ద మెమోరాండం లు అందించటం జరుగుతుందని, మా పంట మునిగింది.

పరిహారం ఇవ్వండి అనే నినాదంతో పోరాటం చేస్తామని ప్రకటింహారు. అప్పటికి ప్రభుత్వం స్పందించని పక్షంలో 13 వ తేదీన నిరసన దీక్ష చేపడతామని, ఆ దీక్షలో తాను స్వయంగా పాల్గొంటానని చంద్రబాబు వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లాలో అకాలవర్షాలకు పంట దెబ్బతిన్న ప్రాంతాలలో శుక్రవారం చంద్రబాబు పర్యటించారు.

అనంతరం రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ అకాల వర్షాల కారణం దాదాపు 70 నియోజకవర్గాల్లో పంటలకు నష్టం జరిగిందన్నారు.రెండు రోజుల
పాటు పలు నియోజకవర్గాల్లో పర్యటించాను. రైతులతో మాట్లాడాను. వారి బాధలు చూశాను.నేను పర్యటన పెట్టుకున్న తరువాత ప్రభుత్వం నుంచి స్పందన మొదలైంది.

ప్రభుత్వ అధికారులు ప్రెస్ మీట్ పెట్టి మేం ఆదుకుంటామని ప్రకటనలు మాత్రం ఇచ్చారని చెప్పారు. నిర్థిష్టంగా ఏం చేస్తాం అనేది చెప్పకుండా అధికారులు కేవలం ప్రకటనలకే పరిమితమయ్యారన్నారు. అన్నదాతలు కష్టాల్లో ఉంటే సిఎం వచ్చి పరామర్శించాల్సిన బాధ్యత లేదా?

సిఎం రాలేదు. మంత్రులు కదలలేదు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.ప్రభుత్వం రైతుల పంటలకు బీమా చేయించలేదు. ప్రీమియం చెల్లించలేదురైతు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి ప్రీమియం చెల్లించి ఇన్ స్యూరెన్స్ కల్పిస్తారు.రబీకి ఈ ప్రభుత్వం ఇన్ స్యూరెన్స్ కట్టలేదు. అంటే పరిహారం అంతా ఈ ప్రభుత్వమే చెల్లించాలన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుంది. 40 నుంచి 50 శాతంపంట ఇంకా పొలాల్లో ఉంది. వచ్చిన పంటలో 15 నుంచి 20 శాతం కొన్నారు. మిగిలిన పంట కల్లాల్లోనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నేను వచ్చాను అని ప్రభుత్వం ఇప్పుడు సేకరణ అంటూ అధికారులను పంపుతోందని విమర్శించారు.

పొలంలో ఉన్న దెబ్బతిన్న పంటకు 40 శాతం పరిహారం ఇవ్వాలి, ఇన్స్యూరెన్స్ ఉంటే ఎంత పరిహారం వస్తుందో అంత పరిహారం ఇవ్వాలని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలు అని పెట్టి వ్యవస్థను చిన్నా భిన్నం చేసింది.

రైతుల ధాన్యాన్ని ప్రభుత్వం తమకు కావాల్సిన మిల్లులకే పంపుతుంది. దగ్గరలో మిల్లులు ఉన్నా, తమకు కావాల్సిన మిల్లులకే పంపి రైతుల్ని దోచుకుంటోందినూక వస్తుందని మిల్లర్లు రైతుల నుంచి మండే డబ్బులు వసూలు చేస్తున్నారు.

రైతు భరోసా కేంద్రాల్లో తూకం వేసిన తరువాత మళ్లీ మిల్లు దగ్గర బస్తాకు 5 కేజీలు తరుగు తీస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఇలా రకరకాల విధానాల వల్ల బస్తాకు రైతు రూ. 300 రూపాయాలు నష్టపోతున్నాడు.

ప్రభుత్వం చెప్పినట్లు బస్తాకు రూ.1530 రావడం లేదు. ప్రభుత్వం సకాలంలో సేకరణ చేయలేకపోయింది. కనీసం గోతాలు కూడా ఇవ్వలేకపోయారు. రంద్రాలు పడ్డ గోతాలు ఇవ్వడం వల్ల కూడా రైతులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. నేడు రాష్ట్రంలో 75 నుంచి 80 శాతం కౌలు రైతులు ఉన్నారు. కౌలు రైతుల్లో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీ కాపులు వీరంతా పేద వర్గాలు అని చెప్పారు. పంట పొలంలో ఉంటేనే పరిహారం ఇస్తామంటున్నారు, ఏప్రిల్ 1న సేకరణ ప్రారంభించి ఉంటే ఇప్పుడు ఈ నష్టం ఉండేది కాదు. ధాన్యం అకాల వర్షాల భారిన పడేది కాదు.

ఈ సమస్యకు పూర్తి కారణం సిఎం జగన్ రెడ్డి. రోమ్ తగలబడుతుంటే చక్రవర్తి పిడేల్ వాయించినట్టు జగన్ వైఖరి ఉంది. కష్టాల్లో ఉన్న రైతుల్ని గాలికొదిలి, ఇంట్లో కూర్చుని వివేకా హత్య హంతకులను కాపాడే పనిలో జగన్ బిజీగా ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. హుద్ హుద్ తుఫాను వచ్చినప్పుడు పరిహారం పెంచి జీవోలు ఇచ్చాను. నాడు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి పరిహారం అందజేశామని చెప్పారు. ప్రభుత్వం వెంటనే చేలో ఉండే పంటకు పరిహారం ఇవ్వాలి, ఎంత పరిహారం ఇస్తారో చెప్పాలి.

కోసిన పంట వర్షాలకు దెబ్బతింది. వాటిని పూర్తిగా సేకరిస్తారా లేదా చెప్పాలి ?

ధాన్యం రవాణా ఉచితంగా చేయాలి. చేస్తారా చెయ్యరా? అని ప్రశ్నించారు. మిల్లర్లు రైతు దగ్గర ధాన్యం విరిగిపోతుంది అని డబ్బులు వసూలు చేస్తున్నారు.

ప్రభుత్వ వైఖరితో ఒక్కో బస్తాపై రైతు రూ. 300 నష్టపోతున్నాడు.

రాష్ట్రంలో వరితో పాటు మొక్కజోన్న, వాణిజ్య పంటలకు నష్టం జరిగింది.

వాణిజ్య పంటలకు సాగుపెట్టుబడి లక్ష రూపాయలు అవుతుంది. వారికి జరిగిన నష్టాన్ని ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎప్పటిలోపు ఈ ధాన్యం కొంటారో స్పష్టమైన ప్రకటన చేయాలి. వర్షాలకు నష్టపోయిన రైతులకు ఏం సాయం చేస్తారో ప్రత్యేకంగా ఉత్తర్వులు ఇవ్వాలన్నారు.

రైతులు కదలిరావాలి

రైతులు కూడా కదలి రావాలి. చైతన్యంతో ముందుకు రావాలి. పోరాడాలి. అని చందబాబు పిలుపునిచ్చారు. లేకపోతే ఈ ప్రభుత్వం స్పందించదన్నారు. రైతులు తమ సమస్యలు…ధాన్యం అమ్మకంలో పడుతున్న ఇబ్బందులపై వీడియోలు, ఫోటోలు పెట్టండి. ప్రభుత్వం బాధ్యత గుర్తుచేద్దాం.

మిల్లర్లు ఎలా డబ్బు అడుగుతున్నారు. ఎంత అడుగుతున్నారు అనే వీడియోలు పెట్టండి అని సూచించారు. రైతులు మిల్లర్లకు డబ్బు కట్టాల్సి వస్తుంది. మిల్లర్లకు కట్టిన డబ్బుల వివరాలు కూడా రైతులు పలు చోట్ల నాకు చూపించారు.

వైసీపీ నేతలు సైతం ఈ ప్రభుత్వం చర్యలను తప్పుపడుతున్నారు. ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం డబ్బు వస్తే అప్పులు తీర్చవచ్చు. అవసరాలకు ఉపయోగపడతాయి అని భావించారు. కానీ అందుకు విరుద్దమైన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు దగ్గర తీసుకున్న డబ్బు ఎవరు బొక్కుతున్నారో తేలాలన్నారు. నందమూరులో స్మశానంలో ధాన్యం ఆరబెట్టుకున్నారు, మేం అధికారంలోకి వచ్చిన తరువాత రైతులు ధాన్యం ఆరబెట్టుకోవడానికి ప్రత్యేకంగా ఫ్లాట్ ఫామ్స్ కడతాం.

రైతులు మోసపోకుండా, పకడ్బందీగా ప్రణాళికలు అమలు చేస్తామని చందబాబు వెల్లడించారు. సిఎం ఎందుకు రైతుల సమస్యలపై అధ్యయనం చేయలేదు, ఎసి రూంలో ఉంటే సమస్యలు
తెలుస్తాయా? క్షేత్ర స్థాయిలో ఉంటేనే సమస్యలు తెలుస్తాయి. సిఎం ఇంటి నుంచి ఎందుకు బయటకు రావటం లేదు ?

హుద్ హుద్, తిత్లీ సమయంలో ప్రత్యేక జీవోలు ఇచ్చి మరీ పరిహారం అందజేశాం. పెరిగిన ఖర్చులకు అనుగుణంగా నాడు పరిహారం పెంచి ఇచ్చాం. ఇలాంటి స్పష్టత ఈ ప్రభుత్వం దగ్గర ఉందా? ఈ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయింది అని ప్రశ్నించారు. మామిడి, పామాయిల్ వంటి పంటలకు కూడా నాడు సాయం చేశాం, నేడు వైసీపీ ప్రభుత్వ విధానాల వల్ల ఆక్వా కల్చర్ కూడా నాశనం అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుకు కష్టం వచ్చినప్పుడు ఆదుకుంటే రైతులు నిలబడతారు, ప్రభుత్వాలు చేయాల్సింది ఇదే అని చంద్రబాబు స్పష్టం చేశారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *