థాయిలాండ్‌లో చికోటి ప్రవీణ్ అరెస్ట్.. అడ్డంగా దొరికిన గ్యాంబ్లింగ్  ముఠా

థాయిలాండ్‌లో చికోటి ప్రవీణ్ అరెస్ట్.. అడ్డంగా దొరికిన గ్యాంబ్లింగ్ ముఠా

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించిన క్యాసినో నిర్వాహకుడు చికోటి ప్రవీణ్‌ థాయ్‌లాండ్‌లో అరెస్ట్ అయ్యారు. థాయ్‌లాండ్ పట్టాయాలోని ఓ విలాసవంతమైన హోటల్‌లో పెద్ద మొత్తంలో గ్యాంబ్లింగ్ జరుగుతున్నట్టు గుర్తించిన పోలీసులు..అక్కడ రైడ్ చేసి చికోటిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 93 మందిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అందులో చికోటితో పాటు 80 మంది భారతీయులు ఉన్నట్లు సమాచారం . అరెస్ట్ అయిన వారిలో 14మంది మహిళలు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. నిందితుల నుంచి భారీగా నగదు, గేమింగ్ చిప్స్‌ను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గేమింగ్ చిప్స్‌ విలువ 20 కోట్లకు పైగా ఉంటుందని స్థానిక పోలీసులు చెబుతున్నారు. చికోటి నేతృత్వంలోనే ఈ గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.

థాయిలాండ్‌లో చికోటి పట్టుబడినట్లుగా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో చికోటితో పాటు ఆయన పక్కనే పలువురు మహిళలు కూడా ఉన్నారు.ఏప్రిల్-27 నుంచి ఓ హోటల్‌లో కాన్ఫరెన్స్ హాల్‌ను అద్దెకు తీసుకుని క్యాసినో నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఈ మొత్తం వ్యవహారంలో ఓ మహిళ కీలకంగా వ్యవహరించిందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు ఆమె కూడా పోలీసుల అదుపులో ఉన్నారు. థాయ్‌లో గ్యాంబ్లింగ్ కోసం ఒక్కొక్కరి నుంచి లక్షల్లో చికోటి వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. చికోటితోపాటు పటాయా పోలీసుల అదుపులో మాధవరెడ్డి, డిసీసీబి చైర్మన్ దేవేంధర్ రెడ్డి కూడా ఉన్నారు. టాస్క్ ఫోర్స్‌ పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఈ ముఠా యత్నించగా వెంబడించి మరీ అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ చీకటి బాగోతాలు ఇటీవలే వెలుగులోకి వచ్చాయి. చికోటి ఈడీ విచారణ కూడా ఎదుర్కొన్నారు. ఆయనకు తెలుగు రాష్ట్రాల్లోని పలువురు నాయకులతో పరిచయాలున్నాయి. ఏపీలో గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నానికి చికోటి ప్రవీణ్ తో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఆయన సహకారంతోనే ఇటీవల గుడివాడలో కొడాలి నాని క్యాసినో నిర్వహించినట్లు బయటపడింది. అదే సమయంలో శంషాబాద్ పరిసరాల్లో జూపార్క్ ను తలపించేవిధంగా ఉన్న చికోటికి సంబంధించిన ఫామ్ హౌజ్ పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *