అవినాష్ ను  ఎందుకు కాపాడుతున్నారు..?

అవినాష్ ను ఎందుకు కాపాడుతున్నారు..?

వైఎస్ వివేకా హత్య కేసులో.. ఏపీలో జరుగుతున్న సంఘటనలు దేశ ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయని.. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ అన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ .. వైఎస్ అవినాష్ కోసం .. ప్రజాస్వామ్యాన్ని మొత్తాన్ని పణంగా ఎందుకు పెట్టారని.. ఆ చిదంబర రహస్యమేంటో .. ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని.. విజయ్ ప్రశ్నించారు. వైఎస్ వివేకా.. హత్య కేసులో నిందితుడిగా .. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఉంటే.. సీబీఐ అరెస్ట్ చేయాలంటే.. తల్లికి అస్వస్థతగా ఉందని.. నాటకాలు ఆడుతున్నదెవరో ప్రజలు తెలుసుకోవాలన్నారు.

వైఎస్ వివేకా హత్య కేసులో.. వాస్తవాలు బయటకు రాకుండా.. ప్రజలకు ఎన్ని కట్టుకథలు చెబుతున్నారో.. అందరికీ అర్థమవుతుందని చింతకాయల విజయ్ అన్నారు. క్రిమినల్ ఐడియాలజీ ఉంటే తప్పు.. ఇలా.. దారుణంగా వ్యవహరించరని.. చింతకాయల విజయ్ అన్నారు. కర్నూలులోని.. బంధువుల ఆస్పత్రిలో.. వైఎస్ అవినాష్.. తన తల్లిని చేర్పించి.. ఆరోగ్యం బాగా లేదంటూ.. బయట వైసీపీ కార్యకర్తలను పెట్టి.. సీబీఐ ను కూడా బెదిరిస్తున్నారన్నారు. వైఎస్ అవినాష్ రెడ్డి ఆడుతున్న డ్రామాకు .. ఏపీ పోలీసులు వంత పాడటం విడ్డూరం విజయ్ అన్నారు. ఇది కచ్చితంగా .. తమ చేతుల్లో అధికారం ఉంది కదా.. అని.. ఏదైనా చేయడానికి .. వైసీపీ ప్రభుత్వం .. డిసైడ్ అయ్యారంటే.. ప్రజాస్వామ్యానికి ఎంత హాని ఉందో.. అర్థం చేసుకోవచ్చని విజయ్ అన్నారు.

వైఎస్ అవినాష్ రెడ్డి.. నిజంగా.. నిర్దోషి అయితే.. సీబీఐ విచారణకు ఎందుకు సహకరించడం లేదని.. ఎందుకు బెదిరిస్తున్నారని.. మీడియాపై ఎందుకు దాడులు చేస్తున్నారని.. చింతకాయల విజయ్ ప్రశ్నించారు. గతంలో జరిగిన కోడికత్తి కేసులో కూడా.. సాక్షాత్తూ జగన్ రెడ్డి విచారణకు హాజరుకాలేదన్నారు. సీఎం జగన్ సహా.. వైసీపీ నేతలకు .. రాజ్యాంగ వ్యవస్థలపై నమ్మకం లేదన్నారు. వైఎస్ వివేక హత్య కేసులోని ట్విస్టులను చూస్తే.. ఒక హాలీవుడ్ సినిమా కూడా పనికిరాదని విజయ్ అన్నారు.జగన్ .. తన తమ్ముడి కోసం.. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను పణంగా పెట్టి.. ఒక నిందితుడికి సహకరించడం అంటే .. ప్రజాస్వామ్యం .. సిగ్గుతో తలదించుకున్నట్లేనని విజయ్ వ్యాఖ్యానించారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *