చిరుకు జోడిగా 12మంది హీరోయిన్స్‌

చిరుకు జోడిగా 12మంది హీరోయిన్స్‌

మెగాస్టార్‌ రిఎంట్రీ తరువాత దూకుడు మాములుగా లేదు. యమ స్పీడ్‌గా దూసుకుపోతున్నాడు. చకచక కథలు వింటు టకటక ఫైనల్‌ చేస్తున్నాడు. యంగ్‌ డైరెక్టర్లలకు భోళశంకరుడుగా మారిపోయాడు. ఫస్ట్‌ సినిమా హిట్‌ కొడితే డైరెక్ట్‌ మెగాస్టార్‌కు స్టోరీ చెప్పడానికి గేట్‌ ఓపెన్‌గా ఉంటున్నాయి. బింబిసారాతో బ్లాక్‌బస్టర్‌ కొట్టిన యంగ్‌ డైరెక్టర్‌ వశిష్ట చిరు కథ కోసం కసరత్తులు చేస్తున్నాడు. రిసెంట్‌గా మెగాస్టార్‌కు తన స్టైల్‌లో ఫాంటాసీ స్టోరీ లైన్‌ని చెప్పాడట. అది చిరంజీవికు పిచ్చి పిచ్చిగా నచ్చిందట. మెగాస్టార్‌ ఆర్ధ్వర్యంలోనే స్టోరీని డెలప్‌ చేస్తున్నాడట వశిష్ట.

బింబిసారా మాదిరిగానే ఈ మూవీ కూడా టైమ్‌ ట్రావెలర్‌ కాన్సెప్ట్‌తోనే రెడీ చేశాడు వశిష్ట. ఇందులో చిరుకు జోడిగా 12మంది హీరోయిన్స్‌గా నటిస్తారట. నార్మల్‌గా ఇంతమంది బ్యూటీస్‌ అంటే స్పెషల్‌ సాంగ్‌లోనో.. లేదా స్పెషల్‌ అపిరియాన్స్‌లో కనిపిస్తారు. కానీ వశిష్ట మాత్రం 12 మంది హీరోయిన్స్‌ హైప్‌ కోసం కాకుండా 12మందికి క్యారెక్టర్స్‌కు ఇంపార్టెంన్స్‌ ఉంటుందని అంటున్నాడు. అంటే చిరు 12మంది హీరోయిన్స్‌తో రోమాన్స్‌ కన్‌ఫామ్‌ అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ ఓకే అయితే మాత్రం ప్రోడ్యూసర్‌కి తిప్పలు తప్పవు అంటున్నారు.

ఇండస్ట్రీలో హీరోయిన్స్‌ని మ్యానేజ్‌ చేయడం చాలా కష్టం. అలాంటిది 12 మంది హీరోయిన్స్‌ని హ్యాండిల్‌ చేయడం అంటే తల ప్రాణం తోకోస్తుందని అంటున్నారు. పైగా ఇప్పుడు ఉన్న సిట్యూవేషన్‌లో చిరుకు హీరోయిన్‌ సెట్ చేయడం అంటే కత్తి మీద సాముల మారింది. మరి 12మంది అంటే ఎన్ని ఆడిషన్స్‌ చేస్తారో ఎంతమంది కొత్తభామలు వస్తారో.. ప్రోడ్యూసర్‌ పాట్లు పక్కన పెడితే ఫ్యాన్స్‌కు చిరుని అంతమంది బ్యూటీస్‌తో చూడటం ఫీస్ట్ అంటున్నారు.

యంగ్‌ డైరెక్టర్‌కు మెగాస్టార్‌తో సినిమా అన్నది ఓ కలల ఉండేది. ఇప్పుడు అది రిచ్‌ అవ్వడానికి కొత్త డైరెక్టర్స్‌ ఫస్ట్‌ సినిమాతో హిట్‌ కొడితే చాలు, మెగా కాంపౌండ్‌ దగ్గర చిరుకి కథ చెప్పాడానికి గేట్స్‌ ఓపెన్‌ అవుతున్నాయి. మెగాస్టార్‌ కూడా కొత్త వారిని ఎంకరేజ్‌ చేసే పనిలో ఉన్నాడు. ఓ పక్క వశిష్ట ఒకే చెబుతునే మరో పక్క దసరాతో బ్లాక్‌బస్టర్‌ హిట్ కొట్టిన శ్రీకాంత్ ఓదెల కథ కూడా వింటున్నాడట. చిరు ప్రజెంట్‌ ప్రాజెక్ట్స్‌ పూర్తి అవ్వగానే ఈ సినిమాలు పట్టలెక్కె ఛాన్స్‌ ఉందట.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *