రజనీకాంత్‌పై వైసీపీ విమర్శలకు సీఎం జగన్‌ క్షమాపణ చెప్పాలి : చంద్రబాబు

రజనీకాంత్‌పై వైసీపీ విమర్శలకు సీఎం జగన్‌ క్షమాపణ చెప్పాలి : చంద్రబాబు

జగన్‌ ప్రభుత్వం పై రజనీకాంత్‌ చిన్న విమర్శ చేయకపోయినా ఆయనపై వైసీపీ నీచపు వ్యాఖ్యలకు సీఎం జగన్‌ క్షమాపణ చెప్పాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. అన్నగారి శత జయంతి కార్యక్రమంలో పాల్గొని ఆయనతో తన అనుబంధాన్ని… అనుభవాలను పంచుకున్న సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌పై వైసీపీ మూకల అసభ్యకర విమర్శల దాడి అభ్యంతరకరం, దారుణమన్నారు. సమాజంలో ఎంతో గౌరవం ఉండే రజనీ కాంత్‌ లాంటి లెజెండరీ పర్సనాలటీపై కూడా వైసీపీ నేతలు చేస్తున్న నీచ వ్యాఖ్యలు అందరికీ బాధ కలిగిస్తున్నాయన్నారు.

వైసీపీ ప్రభుత్వ పోకడలపై ఆయన చిన్న విమర్శ చేయలేదు… ఎవరినీ చిన్న మాట అనలేదు. పలు అంశాలపై కేవలం తన అభిప్రాయాలు పంచుకున్నారన్నారు. అయినా తీవ్ర అహంకారంతో ఆయనపై చేస్తున్న ఆర్థం లేని విమర్శలను తెలుగు ప్రజలు ఎవరూ సహించరన్నారు. శిఖరం లాంటి వ్యక్తిత్వం కలిగిన రజనీ క్యారెక్టర్‌పై వైసిపి పార్టీ నేతల విమర్శలు ఆకాశంపై ఉమ్మి వేయడమే. నోటిదూల నేతలను జగన్‌ అదుపులో పెట్టుకోవాలన్నారు.జరిగిన దానికి క్షమాపణ చెప్పి తమ తప్పు సరిదిద్దుకోవాలని హెచ్చరించారు.

Related post

నెల్లూరులో నారాయణ పూజలు

నెల్లూరులో నారాయణ పూజలు

నెల్లూరు నగరంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నగర ఇన్‌చార్జ్‌ ,మాజీమంత్రి పొంగూరు నారాయణ, సతీమణి రమాదేవి కలిసి పలు చోట్ల.. వినాయక స్వామివారిని…
శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయకుని క్షేత్రం

శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయకుని క్షేత్రం

హిందువులకు అత్యంత ముఖ్యమైన ఆరాధ్య దైవం విఘ్నేశ్వరుడు. సకల శుభంకరుడు.. సకల గణాలకు నాయకుడు గణేశుడు. అంతే కాదు.. లయకారుకుడైన ఆదిశంకరుడు, జగన్మాతల ముద్దుబిడ్డ వినాయకుడు. శివుని ఆదేశాలతో…
పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

టీడీపీ ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంది. కానీ, వాటన్నంటినీ ఎదుర్కొని పార్టీని సమర్థవంతంగా ముందుండి నడిపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. కానీ, ఇప్పుడు ఆయనకే కష్టం వచ్చింది. అక్రమ అరెస్ట్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *