పవర్ పాలిటిక్స్

పవర్ పాలిటిక్స్

తెలంగాణలో పవర్ పాలిటిక్స్ పీక్స్ కు చేరాయి. ఉచిత విద్యుత్‌ మంటలు ఆరడం లేదు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ మధ్య హైవోల్టేజ్‌ వార్‌ కంటిన్యూ అవుతోంది. రైతులను ఆకట్టుకునేందుకు గులాబీ, హస్తం పార్టీలు నువ్వా నేనా అన్నట్టుగా మాటల కత్తులు దూసుకుంటున్నాయి. సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఇరు పార్టీల నేతలు పొలిటికల్ హీట్ రాజేస్తున్నారు. అది ఏ రేంజ్ కు వెళ్లిందంటే ఎన్నికల్లో ఇదే అంశంపై రెఫరెండం తీసుకునే వరకు వెళ్తోంది. రైతు కేంద్రంగా సాగుతున్న ఈ రాజకీయం రానున్న రోజుల్లో మరింత వేడెక్కేలా కనిపిస్తోంది.

తెలంగాణలో పవర్ ఫైట్ ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ లు తగ్గేదేలే అంటున్నాయి. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో వచ్చే ఎన్నికలకు రెడీ అవుతోంది బీఆర్ఎస్. ఈ క్రమంలోనే తాము అమలు చేస్తోన్న రైతుబంధు, రైతుభీమా, ఉచిత విద్యుత్, సాగునీరు, రైతు వేదికలాంటి పథకాలు తమను గట్టెక్కిస్తాయనే ఆశతో ఉంది. అయితే, వాటినే కాంగ్రెస్ టార్గెట్ చేస్తోంది. దీంతో, రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అమెరికాలో ఉచిత విద్యుత్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాజేసిన మంటలు ఇంకా దావాగ్నిలా మండుతూనే ఉన్నాయి.

రాష్ట్రంలో మూడు గంటల కరెంట్ వర్సెస్ మూడు పంటలు అన్నట్టుగా బీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్య రాజకీయం నడుస్తోంది. మూడు గంటలు ఇచ్చే కాంగ్రెస్ కావాల్నా, మూడు పంటలు పండించుకునేలా 24గంటల కరెంట్ ఇచ్చే బీఆర్ఎస్ కావాలో తేల్చుకోవాలంటూ బీఆర్ఎస్ మంత్రులు సవాల్ విసిరితే….అసలు 24గంటల కరెంట్ ఎక్కడిచ్చారో చెప్పాలంటూ సబ్ స్టేషన్ ల వద్దకు వెళ్లి లాగ్ బుక్‌లు తీసి లాజిక్‌తో కొట్టింది కాంగ్రెస్. దీంతో, రాష్ట్రంలోని అన్ని సబ్ స్టేషన్ లలోని లాగ్ బుక్‌ లన్నీ బీఆర్ఎస్ ఎత్తుకెళ్లి దాచిపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతటితో, ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం చల్లారడం లేదు. మరింతగా ముదిరిపాకాన పడుతోంది.

తొలుత 3గంటల పేరుతో బీఆర్ఎస్ కు దొరికిన రేవంత్‌ను కోమటిరెడ్డి వెంటర్ రెడ్డి లాగ్ బుక్ లను బయటకు తీసి గట్టెక్కిస్తే…ఇప్పుడు హైకమాండ్ రంగంలోకి దిగి 24 గంటల ఉచిత విద్యుత్‌ కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో ప్రధాన అంశాలలో ఒకటని చెబుతోంది. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇచ్చి తీరుతామని రేవంత్‌రెడ్డితోనే చెప్పిస్తోంది. దీంతో, బీఆర్ఎస్ కూడా గేమ్ ఛేంజ్ చేసింది. చత్తీస్‌గఢ్‌లో కరెంట్‌ పుష్కలంగా ఉన్నా 24 గంటలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తోంది. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో కరెంట్ అమ్ముకుంటున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తే…కేసీఆర్ కుటుంబం ఉచిత విద్యుత్ పేరుతో దోచుకుంటోందని హస్తం పార్టీ దుమ్మెత్తిపోస్తోంది.

మొత్తంగా, వచ్చే ఎన్నికల్లో కరెంట్ టాపిక్ హాట్ టాపిక్ అవుతోంది. ఇదే అంశంపై రెఫరెండం కోరదామా అంటూ కాంగ్రెస్ కు సవాల్ విసురుతోంది బీఆర్ఎస్. అటు హస్తం పార్టీ కూడా ప్రజల్లోనే తేల్చుకుందామంటూ గులాబీ పార్టీపై కౌంటర్ అటాక్ చేస్తోంది. మొత్తంగా, రెండు పార్టీలు రైతులను నమ్ముకొని చేస్తున్న రాజకీయంతో బీజేపీ మరుగున పడిపోయింది.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *