
జగన్ హామీలు.. నీటిపై రాతలేనా..?
- Ap political StoryNewsPolitics
- June 27, 2023
- No Comment
- 18
అధికారంలోకి రావడానికి .. ఎన్ని అబద్ధాలైనా చెబుతారు. ఆ సమయంలో నమ్మించేందుకు.. ఎన్ని పాట్లు అయినా పడతారు… పాపం జనాలు.. ఆ నాయకుడు మాటలు నమ్మి.. నిజమేననుకుని ఓటు వేస్తారు. గెలిచిన తర్వాత.. ఇచ్చిన హామీలు మరచిపోతాడు. జనం నిలదిస్తే.. జైల్లో పెడతామని బెదిరిస్తారు లేదా ప్రలోభ పెడతారు. ఇది అక్షరాల .. 2019లో ముఖ్యమంత్రి అయిన.. జగన్ పట్ల నిజమైన కఠిన వాస్తవం. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందర్నీ రెగ్యులరైజ్ చేస్తామని.. సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తామని.. వైసీపీ మానిఫెస్టోలో పెట్టారు. నాలుగేళ్లు దాటినా.. జగన్ చెప్పిన మాటలో.. ఒక్క అక్షరం కూడా వాస్తవం లేదని రుజువైంది.
ఆంధ్రప్రదేశ్ లో.. వివిధ ప్రభుత్వ శాఖలు, విద్యుత్, ఆర్‌టిసి, టూరిజం, హౌసింగ్ వంటి 26 ప్రభుత్వరంగ సంస్థల్లో.. మూడు లక్షలకు పైగా ఉద్యోగులు.. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ పద్ధతిన పని చేస్తున్నారు. కేవలం వీళ్లే కాకుండా.. 3 దశాబ్దాల నుండి ఎన్‌ఎంఆర్, డైలీ వేజ్, కంటింజెంట్, టైమ్ స్కేల్ ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరంతా ఏ నాటికైనా తాము రెగ్యులర్ అవుతామన్న ఆశతో .. అతి తక్కువ వేతనాలతో పని చేస్తున్నారు. నాడు ప్రతిపక్షనేతగా జగన్.. ఇచ్చిన హామీ ప్రకారం.. 2019లో.. అధికార వైసీపీ ప్రభుత్వం అందరినీ రెగ్యులరైజ్ చేస్తుందనుకున్నారు. జగన్ తాను ఇచ్చిన హామీని నెరవేర్చక పోగా.. పిడుగు లాంటి జీవో తెచ్చి.. వారిని నట్టేట ముంచారు. అది ఏంటంటే.. 2014 జూన్ 2 నాటికి ఐదేళ్లు సర్వీసు పూర్తయిన 10,177 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని.. ప్రభుత్వం ప్రకటించింది. కానీ వాస్తవంగా క్యాబినెట్ నిర్ణయం ప్రకారం రెగ్యులర్ కావడానికి అవకాశమున్న ఉద్యోగులు 6,665 మంది మాత్రమే.
మాట తప్పను – మడమ తిప్పను.. అందరినీ రెగ్యులరైజ్ చేస్తామన్న జగన్ … 3 లక్షల మంది కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగు ఉద్యోగులను మోసగించారు. వైసీపీ సర్కార్ తాజా నిర్ణయం కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను తీవ్ర ఆందోళన, అసంతృప్తికి గురిచేస్తోంది. సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తామన్న .. జగన్ సర్కార్.. కొత్తగా జీవో 5,7 లను విడుదల చేసింది. గత పిఆర్‌సి లోని కనీస వేతనం రూ.20 వేలు కాగా.. ప్రస్తుతం.. కేవలం రూ.15 వేలతో జీవో నంబరు 7 విడుదల చేసింది. వేలాది మంది కాంట్రాక్టు ఉద్యోగులకు అమలు చేయాల్సిన .. మినిమమ్ టైమ్ స్కేలు.. నాలుగేళ్లు దాటి 3 నెలలు అయినా.. ఇప్పటికీ.. అమలుకు నోచుకోలేదు. కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగ సంఘాలను.. కనీసం చర్చలకు పిలవడం లేదు. ఏపీలో ఎన్నికలకు మరో 9 నెలలు మాత్రమే గడువు ఉండటంతో.. జగన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏ మాత్రం నెరవేరవని ఇప్పటికి వారికి అర్థమైంది. దీంతో.. ఆ కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ దిక్కుతోచక.. ఆందోళనలకు దిగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో బుద్ది చెప్పడానికి కాంట్రాక్ట్ ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారు.
ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నెరవేరిస్తేనే.. ప్రజలు మెచ్చిన నాయకుడు అవుతారు. కానీ.. జగన్ మాత్రం.. అధికారంలోకి వచ్చేందుకు ఒక మాట.. వచ్చిన తర్వాత మరో మాట చెప్పడం.. నయవంచనే అవుతుంది. కాంట్రాక్ట్ ఉద్యోగుల పర్మినెంట్ విషయంలో .. జగన్ మాట మార్చడాన్ని.. ఎవరూ జీర్ణించుకోలేక పోతున్నారు. ఇన్నాళ్లు తమను ఆశపెట్టి.. నట్టేట ముంచిన.. ముఖ్యమంత్రి జగన్ పై .. ఉద్యోగ నేతలెవరూ.. పట్టించుకోక పోయినా.. కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ .. భవిష్యత్తులో తాడోపేడో తేల్చుకోనున్నారు.