
రాజమండ్రి నగరంలో అవినీతి జరుగుతోంది
- Ap political StoryNewsPolitics
- April 29, 2023
- No Comment
- 30
అభివృద్ధి సుందరీకరణ ముసుగులో రాజమండ్రి నగరంలో అవినీతి జరుగుతోందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆరోపించారు. శనివారం రాజమండ్రిలోని 48వ డివిజన్‌లో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆదిరెడ్డి వాసు ముఖ్య అతిధిగా హాజరై ఇంటింటికీ వెళ్లి ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. టీడీపీకి ప్రజల నుంచి మంచి ఆదరణ వస్తోందని అన్నారు.
చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. టిడిపి హాయాంలో మొదలుపెట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు జగన్ పాలనలో ఎక్కడిక్కకడే నిలిచిపోయాయన్నారు. రాష్ట్రాన్ని జగన్ దోచుకుంటే సుందరీకరణ పేరుతో లోకల్ లీడర్లు దండుకుంటున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.