
లుక్ ఔట్ నోటీసులపై కోర్టులో సుజనా చౌదరికి షాక్..!
- Ap political StoryNewsPolitics
- April 26, 2023
- No Comment
- 31
బీజేపీ మాజీ ఎంపీ సుజనా చౌదరికి కోర్టులో మరోసారి షాక్ తగిలింది. దేశంలో పలు జాతీయ బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని ఎగ్గొట్టారనే ఆరోపణలపై గతంలో ఈడీ పలు కేసులు నమోదు చేసింది. ఈ క్రమంలో ఆయన దేశం విడిచి వెళ్లకుండా లుక్ ఔట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఇది జరిగి సుమారు 4 ఏళ్ళు దాటుతుండగా.. ఆయనపై కేసుల విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో గతంలో తనపై జారీ చేసిన లుక్ అవుట్ నోటీసులను రద్దు చేయాలంటూ సుజనా చౌదరి కోర్టును ఆశ్రయించారు.
వివిధ పనుల నిమిత్తం తాను విదేశాలకు వెళ్ళాల్సి ఉందని ఆయన కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. అయితే.. సుజనా చౌదరి పిటీషన్ ను కొట్టి వేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆయనపై జారీ అయిన లుక్ ఔట్ నోటీసును రద్దు చేయటానికి నిరాకరించింది. అవసరం అయితే సుజనా చౌదరి విదేశాలకు వెళ్లేందుకు సంబంధిత కోర్టులను ఆశ్రయించి అనుమతి తీసుకోవాలని సూచించింది. దీంతో లుక్ ఔట్ నోటీసులు రద్దు అవుతాయని భావించిన సుజానా చౌదరికి తీవ్ర నిరాశే ఎదురైంది.