విత్తన మాఫియా పై ఉక్కుపాదం మోపుతాం : నారా లోకేష్ వెల్లడి

విత్తన మాఫియా పై ఉక్కుపాదం మోపుతాం : నారా లోకేష్ వెల్లడి

టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే విత్తనాల మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా గురువారం పాణ్యం నియోజకవర్గం బొల్లవరం శివార్లలో పత్తిచేలోకి దిగిన యువనేత లోకేష్ అక్కడ మహిళారైతును కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మహిళారైతు మల్లేశ్వరి మాట్లాడుతూ రెండెకరాల కౌలుకు తీసుకొని పత్తిపంట వేశాం. కల్తీ విత్తనాల బెడద ఎక్కువగా ఉంది, పంట చేతి కొచ్చేవరకు నమ్మకం లేదు. కూలీఖర్చులు, పురుగుమందుల ధరలు విపరీతంగా పెరిగాయి.

గతఏడాది మొక్కజొన్న వేస్తే నష్టం వచ్చింది. నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరగడంతో భారంగా బతుకుబండి లాగుతున్నాం. ఇప్పటి పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి సాయం లేకపోతే వ్యవసాయం చేయడం కష్టమని లోకేష్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రైతుల సమస్యపై లోకేష్ సానుకూలంగా స్పందించారు. ఎన్నికల సమయంలో ఏదేదో చేస్తానని కల్లబొల్లి కబుర్లు చెబుతూ ముద్దులు పెట్టిన జగన్, ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నాడు.

వైసిపి నేతల కనుసన్నల్లోనే కల్తీవిత్తనాల మాఫియా నడుస్తోంది. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అందించేలా చర్యలు తీసుకుంటాం. నిత్యావసర వస్తువుల ధరలు కూడా తగ్గిస్తాం. ఒక్క సంవత్సరం ఓపికపట్టండి. రాబోయే చంద్రన్న ప్రభుత్వం రైతులు, కౌలురౌతులకు అండగా నిలస్తుంది అని లోకేష్ హామీ ఇచ్చారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *