
తిరుమల కొండపై అపచారం
- Ap political StoryNewsPolitics
- April 25, 2023
- No Comment
- 34
స్వామివారి సన్నిధిలో వైసీపీ అరాచకాలు శృతిమించిపోతున్నాయి. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల కొండను అపవిత్రం చేస్తున్నారు.ఇప్పటికే అన్యమత ప్రచారం, గంజాయి సరఫరా లాంటి కళంకిత చర్యలతో…ఘోర అపచారం జరిగిపోయింది. ఇక, ఇప్పుడు తమ ప్రచార యావ కోసం వై”ఛీపీ” మరింతగా దిగజారిపోయింది. తిరుమల కొండపై ఇంటింటికి జగన్ స్టిక్కర్లు అంటించే కార్యక్రమానికి తెరలేపింది. నిషేధిత ప్రాంతంలో రాజకీయ ప్రచారం చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంత జరుగుతున్నా విజిలెన్స్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీ అరాచకాలపై ప్రతిపక్ష పార్టీలు సహా, టీటీడీ ధర్మకర్తలు, భక్తులు మండిపడుతున్నారు.
వైసీపీ శ్రేణులు తమ ప్రచారం కోసం పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలనూ వదలడం లేదు. తిరుమల కొండను అపవిత్రం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ శ్రేణులు…పార్టీ స్టిక్కర్లు, బ్యాగులు, లోగోలతో హల్‌చల్ చేస్తున్నారు. తిరుమలలోని బాలాజీనగర్‌లో ఇళ్లకు జగన్ స్టిక్కర్లు అంటించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అధికార పార్టీ నేతల ప్రచారాన్ని అడ్డుకోవాల్సిన విజిలెన్స్ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
వ్యక్తుల విగ్రహాలు, ఫొటోలు, రాజకీయ పార్టీల జెండాలు, చిహ్నాలు, అన్యమత ప్రచారానికి సంబంధించిన ప్రచార సామాగ్రిని తిరుమలకు తీసుకురావడాన్ని టీటీడీ కొన్ని దశాబ్దాల క్రితమే నిషేధించింది. అయితే వైసీపీ నేతలు ఈ నిబంధనలను తుంగలో తొక్కారు. నిబంధనలకు విరుద్ధంగా ఈ కార్యక్రమం చేపట్టినా విజిలెన్స్ అధికారులెవరూ పట్టించుకోలేదు. వైసీపీ నేతలు తమ కార్యక్రమం ముగించుకొని పోయాక…సిబ్బందిని పంపించి చేతులు దులుపుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అలిపిరి చెక్‌పాయింట్‌లో జగన్ భజన బ్యాచ్ ను ఎలా అనుమతించారో తనకు తెలియదంటూ విజిలెన్స్ వీజీవో చెప్పడం కొసమెరుపు.
గతంలో లాగా తిరుమల కొండపై భక్తులు స్వేచ్ఛగా దర్శనం చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. పరమ పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇటీవలే గంజాయి వెలుగుచూడడం కలకలం రేపింది. ఇక, ఇప్పుడు ఏకంగా నిషేధిత ప్రాంతంలో… జగన్ ప్రచార భజన మరింత అలజడి రేపుతోంది. గోవింద నామస్మరణతో మారుమోగాల్సిన వీధులు, జగన్ భజనతో అపవిత్రంగా మారుతోంది. ఈనేపథ్యంలో వైసీపీ నేతలు అంటించిన స్టిక్కర్లను స్థానికులు ఎక్కడిక్కడ తొలగించేస్తున్నారు.