
జగన్‌ను రాజకీయంగా ఫుల్‌స్టాప్ పెట్టాలి: దారపనేని
- Ap political StoryNewsPolitics
- April 27, 2023
- No Comment
- 29
సత్యసాయి జిల్లా, కొత్తచెరువు మండలం కేంద్రంలో టీడీపీ నాయకుడు గురువారం జగన్ మీద ఆవేదన వ్యక్తం చేసారు. తప్పుడు హామీలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డికి శాశ్వతంగా రాజకీయపరంగా ఫుల్ స్టాప్ పెట్టాలని టిడిపి యువ నాయకుడు దారపనేని ఉపేంద్ర ప్రజలకు తెలియజేశారు.
ప్రభుత్వం ద్వారా అందిన పథకాలకి ఇంటింటికి బుక్లెట్ ఎలా ఇచ్చిందో అదేవిధంగా ప్రజల్లో ఒక బుక్లెట్ పెట్టి ప్రజల నుంచి గవర్నమెంట్ అమౌంట్ ఎంత నోట్ చేయాలని కరెంట్ బిల్లు చెత్త పన్ను చెత్త బ్రాండ్ గ్యాస్ ధరలు ద్వారా ప్రభుత్వానికి ఎంత అమౌంట్ చేసామని రాయాలని గవర్నమెంట్ పథకాల ద్వారా మన ఇంటికి వచ్చిన లెక్కలకే బుక్ లెట్ ఇచ్చిన విధంగా మీరు కూడా ఒక పుస్తకం పెట్టి ప్రభుత్వానికి కట్టిన లెక్కలు రాయండి ఇంటి పనిలో, చెత్త పన్ను, పెరిగిన కరెంటు బిల్లులో, బస్సు చార్జీలు, మద్యం ధరలు, నిత్యవసర సరుకులు మీరు కూడా బుక్ పెట్టి రాయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి యువ నాయకుడు దారప నేని ఉపేంద్ర మరియు ఐ టిడిపి అధికార ప్రతినిధి కిలారి శ్రీనాథ్ పాల్గొనడం జరిగింది.