
దసరా మూవీ మొదటిరోజు బాక్సాఫీస్ కలెక్షన్స్
- EntertainmentMoviesNews
- April 1, 2023
- No Comment
- 38
ఎన్నో అంచనాల నడుమ రూపొందిన నాని ‘దసరా’ మూవీ శ్రీరామనవమి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే రెస్పాన్స్ భారీ స్థాయిలో వచ్చింది. దీంతో ఈ సినిమాకు అనుకున్న దానికంటే ఓపెనింగ్ డే అత్యధిక కలెక్షన్లు వచ్చాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దసరా మూవీకి ఆంధ్రా, తెలంగాణలో ఫస్ట్ డే భారీ రెస్పాన్స్ వచ్చింది. క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన ‘దసరా’ మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా 48 కోట్ల రూపాయల బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఆంధ్రా, తెలంగాణలో భారీ స్థాయిలో 14.45 కోట్లను కొల్లగొట్టిన ‘దసరా’.. ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో 1.52 కోట్లు, వేరే భాషల్లో 71 లక్షలు, నార్త్ ఇండియాలో 55 లక్షలు, ఓవర్సీస్‌లో 4.10 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 21.10 కోట్ల షేర్, 38.65 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది.
తెలుగు సినీ పరిశ్రమలో.. తక్కువ సమయంలోనే .. పెద్ద హీరోగా నాని.. ఎదిగిపోయాడు. అక్కడి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా వరుస చిత్రాలతో సందడి చేస్తున్నాడు. ‘దసరా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను కొల్లగొడుతున్నాడు. దసరా మూవీ.. చూస్తే.. చక్కని తెలంగాణ గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన డ్రామా అని చెప్పొచ్చు. కొన్ని చోట్ల.. చాలా స్లోగా సాగినా.. సాగదీసినట్లు అనిపించినా.. మంచి సన్నివేశాలు.. అదిరిపోయే క్లైమాక్స్‌తో చాలా వరకూ ప్రేక్షకులకు సంతృప్తిని ఇచ్చింది. దసరా మూవీ నానికి కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారని ప్రేక్షకులు అంటున్నారు. ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకు .. ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందనే దక్కింది. ఫలితంగా బాక్సాఫీసు వద్ద కలెక్షన్లు పోటెత్తాయి. దసరా మూవీలో .. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. దీన్ని ఎస్‌ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. సంతోష్ నారాయనణ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. దసరా మూవీకి.. తొలి రోజు దీనికి 21.10 కోట్లు కలెక్షన్లు రాగా.. మరో 27.90 కోట్ల కలెక్షన్లు వసూలు చేస్తే.. ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.
మాస్ స్టోరీతో రూపొందిన ‘దసరా’ తొలి రోజే ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. ముఖ్యంగా నైజాంలో ‘బాహుబలి 1’ రికార్డును ఇది బ్రేక్ చేసింది. అలాగే, తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన టైర్ 2 హీరోల చిత్రాల్లో ఇది టాప్ ప్లేస్‌కు చేరుకుంది. తద్వారా లైగర్ మూవీ 9.57 కోట్ల రూపాయల రికార్డును బ్రేక్ చేసింది. అలాగే, ఎన్నో ఏరియాల్లో ఈ చిత్రం కొత్త చరిత్రను రాసేసింది. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకులు భారీ స్పందనను అందించారు. ఫలితంగా దీనికి రెండు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయి వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. 2023లో అత్యధిక షేర్ రాబట్టిన చిత్రంగా దసరా మూవీ రికార్డు సాధించింది. ఈ క్రమంలోనే సంక్రాంతికి వచ్చిన బిగ్గెస్ట్ మూవీలు ‘వీర సింహా రెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాలను కూడా నాని మూవీ వెనక్కి నెట్టేసింది. మొత్తానికి నైజాం గడ్డపై తనదైన మార్కును చూపించి.. రాబోయే కాలంలో మరెన్నో.. రికార్డులను సృష్టించేందుకు దసరా సిద్ధమైంది.