దసరా మూవీ రివ్యూ…

దసరా మూవీ రివ్యూ…

న్యాచురల్ స్టార్ నాని హీరో గా నటించిన దసరామూవీపై ఎన్నడూ లేనంతగా అంచనాలు ఏర్పడ్డాయి. యూత్ ఫుల్ లవ్ స్టోరీస్ తో అలరించే.. నాని మొట్టమొదటిసారి ఊర మాస్ లుక్ రోల్ తో కనిపించడమే. టీజర్, ట్రైలర్ దసరా మూవీపై .. నాని ఫ్యాన్స్ లో ఎప్పుడూ లేనంతగా క్రేజ్ ఏర్పడింది. కారణం గత కొన్ని సినిమాలు అంతగా ఆడక పోవడమే.. ఇప్పుడు తాజాగా ఫుల్ కాన్ఫిడెన్స్ తో .. . కెరీర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన టాలీవుడ్ లోనే ఒక మైల్ స్టోన్ గా నిలిచిపోతుందని.. ఇటీవల ప్రమోషన్లలో నాని చేసిన సందడి అంతా.. ఇంతా కాదు.. అందుకే దసరా మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ హీరో రేంజ్ లో జరిగాయి, అలా భారీ అంచనాల నడుమ ఈ సినిమా అన్నీ ప్రాంతీయ భాషల్లో విడుదలైంది. మొదట్నుంచి నాని.. మంచి కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. మరి ఆ అంచనాలకు తగ్గట్టుగా దసరా సినిమా ఉందొ లేదో విశ్లేషిద్దాం.

ఇప్పుడు ఎక్కడ విన్నా ఒకే మాట.. నాని.. దసరా మూవీ గురించే చర్చ.. శ్రీరామనమమి పండగ రోజు.. విడుదలైన దసరా.. తొలి షో నుంచి మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. టాలీవుడ్‌కు మరో పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ దొరికేశాడని.. ప్రేక్షకులు అంటున్నారు. విడుదలకు ముందే 50 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన దసరా నానికి తొలి పాన్ ఇండియా చిత్రం కావడం విశేషం. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మల్టీలింగ్వల్ పండగ మూవీ ఎలా ఉందంటే.. ధరణి పాత్రలో సింగరేణి బొగ్గుగని కార్మికుడిగా నాని క్యారెక్టర్ ప్రారంభం అవుతుంది. అన్యాయాన్ని ఎదిరించే వ్యక్తిగా.. ప్రేమిస్తే ప్రాణమించే క్యారెక్టర్ లో కనిపిస్తాడు. సింగరేణిలో ఓ కాంట్రాక్టర్ చేసే అన్యాయానికి ఎదురు తిరిగి భీకరంగా పోరాడతాడు. ఇది కాస్త రొటీన్ కథే అయినా స్క్రీన్ ప్లే.. డిఫరెంట్ గా ఉంటుంది. మూవీలో నాని యాక్టింగ్ అదిరిపోయిందనే చెప్పాలి. రేగిన జుట్టు, మెలి తిప్పిన మీసాలు, మ‌ట్టి ప‌ట్టిన‌ట్లున్న డ్రెస్ ధ‌రించి అంద‌రిలోభారీ అంచ‌నాలు పెంచాడు.

దసరా మూవీ కథను.. మరింత లోతుగా వెళ్లి విశ్లేషిస్తే.. తెలంగాణకు చెందిన గోదావరిఖని లో ఉన్న వీర్లపల్లి అనే ఊరి ప్ర‌జ‌లు, వారి జీవితాలు ఎలా ఉండేవి, బొగ్గు గనుల‌తో వారికి ఉన్న సంబంధం అనే అంశాల‌తో చిత్రాన్ని రూపొందించారు. నాని తన స్నేహితులతో కలిసి బొగ్గు ని దొంగతనం చేస్తూ, మద్యం సేవిస్తూ , అందరితో గొడవ పడుతూ మల్లి మరుసటి రోజు వాట‌న్నింటిని మ‌ర‌చిపోతూ ఉంటాడు. అయితే రోజులు ఇలా సాగిపోతూ ఉండ‌గా, ఓ రోజు .. విలన్ చిన్న నంబి సిల్క్ బార్ లో గొడ‌వ‌ పడి మర్చిపోతాడు, అయితే చిన్న నంబి మాత్రం ఆ విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకుంటాడు. ధరణి పొరపాటు తో.. ప్రేయసి వెన్నెల. ఫ్రెండ్స్ జీవితాల్లో.. అనేక కష్టాలు మొదలవుతాయి. వారందరి కోసం.. ధ‌ర‌ణి ఏం చేశాడ‌న్న‌ది క‌థ‌ ఫైనల్ గా ఉంటుంది. మునుపెన్నడూ కనిపించని.. క్యారెక్టర్ లో నాని స‌రికొత్త లుక్ లో కనిపించి మంచి మార్కులు కొట్టేశాడు.

దసరా మూవీలో.. పక్కా మాస్ లుక్స్‌తో నాని అదరగొట్టేశాడు. వెన్నెలగా నటించిన కీర్తి సురేశ్, విలన్‌గా చేసిన మలయాళ నటుడు షైన్ చాకో పాత్రల్లో నటించారనడం కంటే.. తమ పాత్రకు న్యాయం చేసేలా జీవించారని చెప్పాలి. వెన్నెల లాంటి గర్ల్ ఫ్రెండ్ మనకూ ఉండాలి, చాకో లాంటి విలన్‌తో మనం కొట్లాడాలని ప్రేక్షకులు భావించేలా.. దర్శకుడు శ్రీకాంత్ ఆ పాత్రలను తీర్చి దిద్దారు. నాని స్నేహితుడిగా నటించిన కన్నడ యాక్టర్ దీక్షిత్ శెట్టికి కూడా మంచి మార్కులే పడ్డాయి. శ్రీకాంత్ ఓదెల కథను ఎక్కడా పట్టు కోల్పోకుండా నడిపించాడు. తెలంగాణ భాష, కల్చర్, భావోద్వేగాలు .. దసరా మూవీకి జీవం పోశాయి. ముఖ్యంగా వైలెన్స్ సీన్లలో నాని రెచ్చిపోయేలా నటించాడని చెప్పాలి. నిర్మాణ విలువలు కూడా ఓ రేంజ్‌లో ఉన్నాయి. సింగరేణి బొగ్గుగనుల్లో కార్మికుల జీవితాలను చూపించిన తీరు అద్భుతమనే చెప్పాలి.

దసరా చిత్రంలో టెక్నిక‌ల్ విష‌యానికి వ‌స్తే కొత్త ద‌ర్శ‌కుడు శ్రీకాంత్.. అద్భుతంగా తీసాడని చెప్పొచ్చు. గోదావరిఖని ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడంతో.. సింగరేణి బొగ్గుగనుల నేపధ్యాన్ని అద్భుతంగా .. వెండితెర పై చూపించాడు, అయితే ఇవే కాకుండా ఒక చక్కటి భావోద్వేగాన్ని, యాక్షన్ తో చాల బాగా మిక్స్ చేసి ప్రేక్ష‌కుల‌కు ఎంటర్ టైన్ పంచాడు. సత్యన్ సూర్యన్ కెమెరా చిత్రానికి వెన్నెముక అని చెప్పాలి., ఇక సంతోష్ నారాయణన్ పాటలు సూప‌ర్ హిట్ కాగా, ఈ చిత్రం భావోద్వేగంతో కూడిన యాక్షన్ డ్రామా అని చెప్పాలి. వైవిధ్యమైన కథా బలంతో సినిమా తీస్తే.. పాన్ ఇండియా మూవీగా ఆదరిస్తారనే ధైర్యంతో .. దసరా మూవీ ఉందనే చెప్పాలి.

 

రేటింగ్ : 3 / 5

Related post

ఈ దసరాకు థియేటర్స్ ఫైట్‌ తప్పదా..?

ఈ దసరాకు థియేటర్స్ ఫైట్‌ తప్పదా..?

దిల్‌ రాజు డిస్ట్రీబ్యూటర్‌ నుంచి నిర్మతగా మారాడు. ఇప్పటీకి సినిమాల డిస్ట్రీబ్యూషన్‌ చేస్తున్నాడు. దిల్‌ రాజు డీల్‌ చేస్తే సినిమా మినిమమ్‌ గ్యారేంటీ. కానీ శాకుంతలం విషయంలో తన…
దసరా మూవీ మొదటిరోజు బాక్సాఫీస్ కలెక్షన్స్

దసరా మూవీ మొదటిరోజు బాక్సాఫీస్ కలెక్షన్స్

ఎన్నో అంచనాల నడుమ రూపొందిన నాని ‘దసరా’ మూవీ శ్రీరామనవమి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *