
జగన్, భారతిలకు కోర్టు నోటీసులు?
- Ap political StoryNewsPolitics
- September 15, 2023
- No Comment
- 13
జగన్ కు షాకింగ్ న్యూస్. ప్రజాధనాన్ని సాక్షి పత్రికకు దోచిపెడుతున్న కేసులో సీఎం జగన్, ఆయన సతీమణి సాక్షి ఎండీ భారతికి ఢిల్లీ హైకోర్టు నుంచి నోటీసులు వెళ్లాయి. ప్రభుత్వ పథకాల సమాచారం కోసం ఒక దినపత్రికని కొనాలంటూ గతంలో జగన్ ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఇందుకోసం వాలంటీర్లకు, సచివాలయ సిబ్బందికి ఒక్కొక్కరికి 200 రూపాయలు మంజూరు చేసింది. దొడ్డిదారిన ఈ జీవో ఇచ్చి పరోక్షంగా సాక్షి పేపరు సర్కులేషన్ ను పెంచడంపై ఉషోదయా పబ్లికేషన్స్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. అయితే, సుప్రీం విచారణను ఏపీ హైకోర్టు కకుండా ఢిల్లీ హైకోర్టుకు బదలాయించింది. ఈ కేసులో భాగంగా ఢిల్లీ హైకోర్టు సిబ్బంది… నేరుగా నోటీసులు తీసుకుని సీఎం క్యాంపు ఆఫీసుకు వెళ్లారు. జగన్ దంపతులకు నోటీసులు అందజేసినట్టు తెలుస్తోంది.