వైసిపికి అనుకూలమైన వారికే పెన్షన్లు : ధూళిపాళ్ల

వైసిపికి అనుకూలమైన వారికే పెన్షన్లు : ధూళిపాళ్ల

గుంటూరు జిల్లా పొన్నూరులో మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మున్సిపాలిటీ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వైసిపి ప్రభుత్వం అర్హత ఉన్న వందలాది పెన్షన్లు తొలగించారు. కమిషనర్‌ సెలవుపై వెళ్లి పోలీసులతో ఫిర్యాదులు ఇచ్చేవారిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. పేదవారు పెన్షన్ల కొరకు చెప్పులు అరిగేలా తిరుగుతున్న అధికార యంత్రాంగం పట్టించుకోవట్లేదన్నారు.

పోలీసులు అత్యుత్సాహం చూపిస్తూ లబ్ధిదారులపై లాఠీ ఛార్జ్‌ చేస్తామని బెదిరిస్తున్నారన్నారు. పట్టణంలో 500 నుండి 700 వరకు పెన్షన్లు తొలగించారని, వార్డుల్లో వైసీపీ నాయకులు తమకు అనుకూలమైన వారికి పెన్షన్‌లు ఉంచి మిగిలిన వారికి తొలగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ తరఫున బాధితుల పక్షాన పోరాటం చేస్తామన్నారు. వారికి న్యాయం జరిగే వరకూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *