మైనింగ్‌ మాఫియాకు పాల్పడుతున్న అధికార పార్టీ : ధూళిపాళ్ల

మైనింగ్‌ మాఫియాకు పాల్పడుతున్న అధికార పార్టీ : ధూళిపాళ్ల

చేబ్రోలు మండలంలో అధికార పార్టీకి చెందిన నాయకులు పెద్ద ఎత్తున మైనింగ్‌ మాఫియాకు పాల్పడుతున్నారని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్‌ ఆరోపించారు. ఈ సందర్బంగా శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ దళిత భూములలో అక్రమ తవ్వకాలు జరిపినప్పుడు అధికారులకు ఫిర్యాదు చేశామని, పోలీసులు, అధికారులు అక్రమ మైనింగ్‌కు సహకరిస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే కిలారి రోశయ్య, పోలీసులు కుమ్మక్కై అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారన్నారు.

ఎన్నిసార్లు సంబంధిత అధికారులను కలిసిన ప్రయోజనం లేదని, గ్రామ అవసరాల పేరుతో గ్రావెల్‌ అక్రమంగా అమ్ముకుంటున్నారని ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్‌ అన్నారు. జగనన్న కాలనీ కోసం తీసుకున్న భూమిలో సైతం అధికార పార్టీ నాయకులు వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అక్రమ మైనింగ్‌పై త్వరలో టీడీపీ ఆధ్వర్యంలో కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. అధికార పార్టీ నాయకులు అక్రమాలను ప్రజల ముందు ఉంచుతామని, అధికార పార్టీకి కొమ్ముకాసే అధికారులపై పోరాటం చేస్తామని ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్‌ స్పష్టం చేశారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *